https://oktelugu.com/

Prashant Kishore : హైదరాబాద్ కు ప్రశాంత్ కిషోర్ ఎందుకు వచ్చినట్టు? ఎవరికోసం మంతనాలు జరుపుతున్నట్టు?

వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ తన వ్యూహరచనను అత్యంత రహస్యంగా చేస్తారు. కానీ ఈసారి ఎందుకో హైదరాబాద్ కేంద్రంగా ఆయన తన వ్యవహారాలు సాగిస్తున్నారు. అయితే ఆ వ్యవహారాలు ఇక్కడ పార్టీలకు సంబంధించినవా? లేక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినవా? అనేవి అంత పట్టకుండా ఉన్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2024 / 10:07 PM IST
    Follow us on

    Prashant Kishore : ఎన్నికలంటే వ్యూహాలు. ఆ వ్యూహాలు సరిగ్గా అమలు చేస్తేనే అధికారం దక్కుతుంది. వీటిని తన చేతల ద్వారా చేసి నిరూపించిన వాడు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. అలాంటి ప్రశాంత్ కిషోర్ మనదేశంలో నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే వైయస్ జగన్మోహన్ రెడ్డి వరకు పనిచేశాడు. వారిని అధికారంలోకి తీసుకు రాగలిగాడు.. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతానికి ప్రశాంత్ కిషోర్ సైలెంట్ గా ఉంటున్నాడు. ఆ మధ్య చంద్రబాబుకు పనిచేస్తున్నాననే పుకార్లు వినిపించినప్పటికీ.. ఆ తర్వాత అదంతా ఉత్తిదే అని తేలిపోయింది. ప్రస్తుతం చడీ చప్పుడు లేకుండా ఉన్న ప్రశాంత్ కిషోర్ అకస్మాత్తుగా హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. ఇంతకీ ఆయన హైదరాబాద్ ఎందుకు వచ్చినట్టు? రాజధాని శివారులో ఉన్న ఒక రిసార్ట్ లో ఎందుకు ఉన్నట్టు? తన బృందంలో కొంతమంది సభ్యులతో ఎందుకు మంతనాలు జరుపుతున్నట్టు?

    ప్రశాంత్ కిషోర్ అపర మేధావి. కోడి గుడ్డు మీద ఈకలు పీకే రకం. అందుకే తనమీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రధాన పార్టీల నాయకులు తన పేరును కలవరించుకునేలా చేసుకున్న సమర్థుడు. తన వ్యూహాలతో ఎన్నో పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చిన ఘనాపాటి. అలాంటి వ్యక్తి హైదరాబాదులో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా మీడియా అలెర్ట్ అయింది. ఇంతకీ ఆయన ఎవరికి సలహాలిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఆ మధ్య అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. పోయిన చోట వెతుక్కోవాలని భారత రాష్ట్ర సమితి ఆరాటపడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఊపును కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ ను రెట్టింపు చేసుకొని, మరిన్ని స్థానాలు గెలవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈ సమయంలో అకస్మాత్తుగా ప్రశాంత్ కిషోర్ హైదరాబాదులో ప్రత్యక్షం కావడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ ఒక్కడు మాత్రమే కాకుండా కొంతమంది నిపుణులతో వచ్చాడట. వారితో ఒక రిసార్ట్ లో మేథో మదనం సాగిస్తున్నాడట. అంతేకాదు ఆ దరిదాపుల్లోకి ఎవరిని రానివ్వకుండా రిసార్ట్ యాజమాన్యం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిందట.

    వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ తన వ్యూహరచనను అత్యంత రహస్యంగా చేస్తారు. కానీ ఈసారి ఎందుకో హైదరాబాద్ కేంద్రంగా ఆయన తన వ్యవహారాలు సాగిస్తున్నారు. అయితే ఆ వ్యవహారాలు ఇక్కడ పార్టీలకు సంబంధించినవా? లేక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినవా? అనేవి అంత పట్టకుండా ఉన్నాయి. అసలు ఏపీ రాజకీయాలు కాక మీద ఉన్న నేపథ్యంలో.. ప్రశాంత్ కిషోర్ అక్కడైతే అనుమానం వస్తుందని ఇక్కడికి వచ్చారా? మీడియా సర్కిల్లో ఈ అంశం మీదనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఏపీలో అటు టిడిపికి ఇటు వైసీపీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహ కర్తగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఏ పార్టీకి తాను పనిచేయడం లేదని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అలాంటప్పుడు ఆయన తెలంగాణకు ఎందుకు వచ్చారనేదే అంతుచిక్కడం లేదు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ ఊరకనే హైదరాబాద్ రాలేదని.. దాని వెనుక పెద్ద స్కెచ్ ఉందని కొంతమంది అంటున్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ శిష్యుల్లో ఒకరైన రాబిన్ శర్మ టిడిపి, జనసేన కోసం పనిచేస్తున్నారు. సునీల్ కనుగోలు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇటీవల ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక సర్వే నివేదిక కూడా రేవంత్ రెడ్డికి సమర్పించారు.