https://oktelugu.com/

Pawan Kalyan : మార్పుతో కూడిన అధికారమే లక్ష్యం కావాలి పవన్ కళ్యాణ్ గారూ

పవన్ ఎందుకు బ్రేక్ తీసుకున్నాడన్నది అంతుపట్టడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ ప్రక్రియ లేకుండా ఎందుకు పోటీచేశాడు. టీడీపీ కోసం వారాహి యాత్రకు ఎందుకు బ్రేక్ చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : December 14, 2023 / 12:21 PM IST

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉన్నటువంటి పదును.. ఎందుకనో తగ్గిందని అనిపిస్తోంది. వారాహి యాత్రలో జనం గతంలో ఉరకలేశారు. అప్పుడే జనసేన గ్రాఫ్ పెరిగింది. మరి ఎందుకు బ్రేక్ ఇచ్చారన్నది అర్థం కావడం లేదు. దీనికి రెండు కారణాలున్నాయి.

    ఒక తెలంగాణ ఎన్నికల కోసం అంతరాయం.. రెండోది టీడీపీతో చర్చల కోసం వారాహి యాత్రకు బ్రేక్.. వారాహి యాత్ర అదే పద్ధతిలో కనుక కంటిన్యూ చేసి ఉంటే ఆ పరిస్థితినే వేరే ఉండేది. కనీసం 75 నియోజకవర్గాల్లో బలంగా జనసేన నిలబడి ఉండేది. పవన్ వారాహి యాత్ర చేస్తే 100 చోట్ల పోటీచేసి బలంగా నిలబడేది.

    పవన్ ఎందుకు బ్రేక్ తీసుకున్నాడన్నది అంతుపట్టడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ ప్రక్రియ లేకుండా ఎందుకు పోటీచేశాడు. టీడీపీ కోసం వారాహి యాత్రకు ఎందుకు బ్రేక్ చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదు.

    పవన్ కళ్యాణ్ రాజకీయాలు మారాలని.. మార్పుతో కూడిన అధికారమే లక్ష్యం కావాలి పవన్ కళ్యాణ్ గారు అంటూ ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.