Etala Rajender : జన్మనిచ్చిన ఇలాఖాను వదిలేసిన ఈటల.. కారణమేంటి?

ఇక ఈటల మల్కాజ్‌గిరి వెళ్లే హుజూరాబాద్‌లో కూడా తన మార్కు పోకుండా ఉండేందుకు ఈటల మరో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తన భార్య ఈటల జమునను ఇన్‌చార్జిగా నియమించే ఆలోచన చేస్తున‍్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈటల హుజూరాబాద్‌ను వీడితే ఆయన అనుచరులను తమవైపు తిప్పుకునేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

Written By: NARESH, Updated On : March 12, 2024 10:50 pm

bjp etela rajendar

Follow us on

Etala Rajender : ఈటల రాజేందర్‌.. తెలంగాణకు పరిచయం అక్కర లేని పేరు. 1964 మార్చి 20న ప్రస్తుత హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోలో జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. రాజకీయ జన్మనిచ్చింది హుజూరాబాద్‌. 2001లో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి వ్వవస్థాపకుల్లో ఒకరు ఈటల రాజేందర్‌ 2004 నుంచి, 2021 వరకు హుజూరాబాద్‌ ప్రజలు ఆయనను గెలిపిస్తు వచ్చారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన అక్కడి ప్రజలు.. 2023 ఎన్నికల్లో ఓడించారు. అప్పటి నుంచి ఆయన హుజూరాబాద్‌తో అంటి ముట్టనట్టు ఉంటున్నారు.

రెండు దశాబ్దాల ప్రస్థానం..
హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. వరుస విజయాలతో తనకు ఎదురు లేదని భావించిన తరుణంలో అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీనిని ఈటల అనుచరులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోవడం లేదు. ఓటమి తర్వాత ఈటల హుజూరాబాద్‌వైపు కన్నెత్తి చూడడంలేదు. దీంతో ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఈటల అనుచరులకు పార్టీతో సంబంధం ఉండదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పనిచేస్తారు. ఇలా 20 ఏళ్లుగా హుజూరాబాద్‌లో తనకంటూ ఒక కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. కమలాపూర్‌, జమ్మికుంటలో ఆయనకు ప్రత్యేక అనుచరగణం ఉంది.

మల్యాజిగిరి ఎంపీ టికెట్‌..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ బీజేపీ టికెట్‌పై హుజూరాబాద్‌, గజ్వేల్‌ నుంచి పోటీ చేశారు. కేసీఆర్‌పై కసి తీర్చుకోవాలని భావించారు. కానీ, రెండు పడవలపై ప్రయాణం బెడిసి కొట్టింది. రెండు చోట్ల పోటీ చేసి, రెండింటిలో ఓడిపోయారు. దీంతో బీజేపీ ఈసారి ఆయనకు మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ ప్రకటించింది. దీంతో ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. హుజూరాబాద్‌కు దూరం అవుతున్నందుకు స్థానికులు బాధపడుతున్నారు.

జమునకు బాధ్యతలు..
ఇక ఈటల మల్కాజ్‌గిరి వెళ్లే హుజూరాబాద్‌లో కూడా తన మార్కు పోకుండా ఉండేందుకు ఈటల మరో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తన భార్య ఈటల జమునను ఇన్‌చార్జిగా నియమించే ఆలోచన చేస్తున‍్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈటల హుజూరాబాద్‌ను వీడితే ఆయన అనుచరులను తమవైపు తిప్పుకునేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు.