Rajasthan Barmer : సహజ వనరులైన బొగ్గు, గ్యాస్, చమురు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఆ గ్రామంలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. అందరూ ఒకే రీతిన ప్రాణాలు కోల్పోతుండటం పెద్ద మిస్టరీగా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం మారిన ఆ గ్రామంలో ఇప్పుడు ప్రతికల్లో ప్రముఖంగా వినబడుతోంది. పాకిస్తాన్‌కు సరిహద్దు గ్రామమైన రాజస్థాన్ లోని బర్మార్. అంతుచిక్కని ఆ విషయాన్ని కనుగొనేందుకు ఐఏఎస్ అధికారి నియమించిన తరువాత ఈ గ్రామంలో చోటుచేసుకున్న వరుస ఆత్మహత్యల విషయం ప్రపంచానికి తెలిసింది. విస్తుపోయేలా చేసింది.
బావుల్లోనే దూకి ఆత్మహత్య
బర్మార్ లో ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2016లో చిన్నారులతో సహా 12 మంది ఆత్మహత్య చేసుకుంటే, 2017, 2018లోను ఆ సంఖ్యకు కొంచెం అటు ఇటుగా మహిళల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2019లో ఒక్కసారిగా ఆ సంఖ్య 19కి ఎగబాకింది. 2020లో 11కి చేరుకున్నటలు గణాంకాలు చెబుతున్నాయి. వీరంతా ఒకే రీతిన బావుల్లో దూరి చనిపోవడం ఆందోళన కలిగించే విషయం. సాధారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారి మోములో ఆందోళన, దిగాలు వంటివి కనిపిస్తాయి. ఇక్కడ చనిపోవడానికి ముందు రోజు చాలా సాదాసీదాగా, ఉల్లాసాంగా గడిపి, అర్థరాత్రి తరువాత వెళ్లి బావుల్లో దూకుతున్నారు.
బాహ్య ప్రపంచానికి తెలిసిందిలా…
గ్రామానికి చెందిన 27 సంవత్సరాల హనుమాన్ రామ్ కు మమత(20)తో ఇటీవల పెళ్లయ్యింది. ముందు రోజంతా ఎంతో ఉల్లాసంగా కుటుంబంతో ఆ జంట గడిపింది. ఆ మరుసటి రోజు అంటే 2023 ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలో హనుమాన్ రామ్ నిద్ర లేచి చూడగా, భార్య కనబడలేదు. ఆమె దుపట్ట మాత్రం ఆరుబటయ పడి ఉంది. వెంటనే అప్రమత్తమైన అతను గ్రామస్థులను అప్రమత్తం చేశాడు. ఇసుకలో ఆమె పాదముద్రలను అనుసరిస్తూ వెళ్లగా, సమీపంలోని బావి వద్దకు చేరుకున్నారు. అందులో ఆమె భార్య శవంలా కనిపించింది. వరుస ఆత్మహత్యలు ఆ నోటా ఈ నోటా పడి మెల్లిగా మీడియా, పోలీసుల వరకు చేరింది. గ్రామంలో ఏం జరుగుతుందోనని తెలుసుకునేందుకు అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఉపక్రమించారు.
నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకోవాలంటే ఒక్కసారిగా ఎవరూ అంత త్వరగా సఫలం కారని సైకాలజిస్టులు చెబుతున్నారు. రెండు మూడు సార్లు ప్రయత్నాల్లో చనిపోవడం ఖాయమని అంటున్నారు. కానీ, ఇక్కడ మొదటి ప్రయత్నంలోనే మహిళలు మృత్యువాతపడుతున్నారని 2021లో ఆ గ్రామాన్ని సందర్శించిన ఐఏఎస్ అధికారి లోక్ బంధు తెలిపారు. గ్రామంలో ఆత్మహత్యలకు పాల్పడిన వివాహిత మహిళల సంఖ్యను తెలుసుకొని ఆందోళనకు గురైన ఆయన ఆ ఊరిలో ఉన్న అన్ని బావులపై మూతలు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు.
ఈ ఆత్మహత్యలకు కారణాలివే…
బర్మార్ లో అత్యధికంగా 32 లక్షల మంది జనాభా ఉన్నారు. మారమూల గ్రామం కావడం వల్ల ఇక్కడి జనాభా నిరుద్యోగం, కరువు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. భౌగోళిక స్వరూపం క్లిష్టంగా ఉంటుంది. ఇళ్లన్నీ చెల్లాచెదురుగా దూరం దూరంగా ఉంటాయి. ఏ సమస్య వచ్చినా పక్కింటి వారిని ఆశ్రయించాలన్న ప్రయాస పడాల్సి ఉంటుంది.
ప్రధానంగా ఇక్కడ పురాతన సంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే ఉండటం మహిళల మానసిక, ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అదే ‘‘ఆట సట’’ (కుటుంబాలు తమ కుమార్తెలను ఒకరికొకరు తాకట్టు పెట్టి వివాహం చేసుకోవడం), బాల్య వివాహాలు. దీనికి తోడు మరో ఆందోళనకర విషయమేమిటంటే విచ్చలవిడి, వావీవరుసలు లేని శృంగారం, ట్రయాంగిల్ ప్రేమలు. కుమారుడు, కోడలు, ఇంట్లో ఉన్న ఒక పెద్ద వ్యక్తి 2022లో ఆత్మహత్యకు పాల్పడితే, మరో సందర్భంలో ఒక మహిళ,ఆమె అల్లుడు వారి జీవితాలను ముగించారని గ్రామంలో మహిళలకు సైకలాజికల్ క్లాసులు చెబుతున్న ఒక ఆమె తెలిపారు.
ప్రస్తుతం కొంచెం మెరుగు
గ్రామంలో పరిస్థితులను సాధారణీకరించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బావులను మూయించారు. మహిళలకు మానసికంగా ఆందోళన కలిగించే విషయాలను చూపకుండా, చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంతో మేథోమధనం తరువాత పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. మరిన్ని ఆత్మహత్యలు చేసుకోకుండా చేస్తున్న తీసుకుంటున్న చర్యలు సఫలీకృతం అవుతున్నారు.