https://oktelugu.com/

Moon missions : మైనింగ్ కోసమే మూన్ మిషన్లు..? చంద్రుడిపై ఖనిజ సేకరణ సాధ్యమేనా? అవి ఎవరికి చెందుతాయి?

ఆపిల్ పై మైనింగ్ చేయడం అంత ఈజీ కాదు. అక్కడ మైనింగ్ చేయాలంటే భారీగా మౌలిక వసతులు ఉండాలి. పైగా అక్కడి ప్రతికూల పరిస్థితుల్లో మనుషులు జీవించడం దాదాపు అసాధ్యం.

Written By:
  • Rocky
  • , Updated On : August 20, 2023 / 11:20 AM IST
    Follow us on

    Moon missions : చంద్రుడు.. భూమికి సహజ సిద్ధంగా ఉన్న ఉపగ్రహం. తెల్లదనానికి, చల్లదనానికి నెలవైన ఆ ఉపగ్రహం ఎన్నో వింతలకు పుట్టినిల్లు. మరెన్నో అద్భుతమైన విషయాలకు పొదరిల్లు. అటువంటి ఈ ఉపగ్రహం మీద ఎన్నో దేశాలు ఇప్పటివరకు రకరకాల ప్రయోగాలు చేశాయి. ఆ వరుసలో భారత్ కూడా ఉంది. అయితే పలు దేశాలు ఎన్నో రకాల ప్రయోగాలు చేసినప్పటికీ.. చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయని కనుగొని చెప్పింది మాత్రం ఇస్రో. అప్పటినుంచి ఆయా దేశాల అన్వేషణ పూర్తిగా మారిపోయింది. అసలు చంద్రుడిలో తెలియని గుట్టుమట్లు ఏమున్నాయనే ఉత్సుకత అన్ని దేశాల్లో పెరిగిపోయింది. ఈ క్రమంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జూలై 14న చంద్రయాన్_3 ని ప్రయోగించింది. రష్యా “లూనా” ను చంద్రుడి మీదకు పంపించింది. ఫలితంగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

    చంద్రుడు భూమికి అత్యంత సహజ సిద్ధమైన ఉపగ్రహం. విలువైన ఖనిజాలకు కూడా నెలవు. చంద్రుడు తన గర్భంలో అనేక రకాలైన ఖనిజ నిక్షేపాలను దాచుకున్నాడు. చంద్రుడి ఉపరితలం మీద హైడ్రాక్సిల్ అణువుల రూపంలో నీ జాడలను చంద్రయాన్_1 2008లోనే కనుగొన్నది. ఎంత విలువైన హీలియం_3 ఖనిజం నిల్వలు టన్నులకొద్దీ చంద్రుడి మీద ఉన్నట్టు నాసా ప్రకటించింది. ఇది భూమి మీద అత్యంత అరుదుగా ఉంటుంది. రేడియోధార్మికత లేని ఈ ఖనిజాన్ని కాలుష్యం లేకుండా న్యూక్లియర్ ఎనర్జీ తయారీలో వాడుకోవచ్చు. కంప్యూటర్లు, ఫోన్లో వాడే, భూమిపై అరుదుగా దొరికే అనేక ఖనిజాలు చంద్రుడి పై ఉన్నట్టు తెలిసింది. స్కాండియం, యట్రియం, 15 రకాల లాంథనైడ్స్ కూడా జాబిల్లి పై ఉన్నాయి.

    ఆపిల్ పై మైనింగ్ చేయడం అంత ఈజీ కాదు. అక్కడ మైనింగ్ చేయాలంటే భారీగా మౌలిక వసతులు ఉండాలి. పైగా అక్కడి ప్రతికూల పరిస్థితుల్లో మనుషులు జీవించడం దాదాపు అసాధ్యం. జాబిల్లి మీద పగటిపూట 127 డిగ్రీల సెల్సియస్, రాత్రిపూట మైనస్ 173 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఒకవేళ మైనింగ్ చేపట్టాలి అంటే కచ్చితంగా రోబోల మీద ఆధారపడాల్సి ఉంటుంది.

    ఇక చంద్రుడికి సంబంధించి ఏ ఒక్క దేశానికి కూడా హక్కులు సక్రమించలేదు. 1966 లో జరిగిన ఐక్యరాజ్యసమితి ఔటర్ స్పేస్ ఒప్పందం ప్రకారం ఖగోళం ఏ దేశానికి కూడా హక్కులు ఉండవు. చంద్రుడు ఏ ఒక్క దేశానికి సంబంధించిన ఆస్తి కాదు. దీనిపై 1979లో మరొక ఒప్పందం కూడా జరిగింది. మీద సేఫ్టీ జోన్స్ ఏర్పాటు, అంతర్జాతీయ అంతరిక్ష చట్టం రూపొందించాలంటూ 2020లో అమెరికా అర్టె మిస్ అకార్డ్స్ ను ప్రకటించింది. దీనిపై భారత్ సంతకం చేయగా, చైనా, రష్యా దూరంగా ఉన్నాయి. చంద్రుడి పరిశోధనలకు పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో మైనింగ్ కు సంబంధించి ప్రత్యేక పాలసీ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని భారత్ వాదిస్తోంది. చంద్రయాన్_3 గనుక మెరుగైన ఫలితాలు అందిస్తే ఇది మరొకసారి చర్చకు వస్తుంది