https://oktelugu.com/

New Movies Released: కొత్త సినిమాలను శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తారంటే..?

శుక్రవారం రోజున సినిమాని ఎందుకు రిలీజ్ చేయాలి..? మిగతా రోజుల్లో రిలీజ్ చేస్తే ప్రాబ్లం ఏంటి అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతాయి...

Written By:
  • Gopi
  • , Updated On : December 24, 2023 / 01:12 PM IST

    New Movies Released

    Follow us on

    New Movies Released: సినిమాలని శుక్రవారం రోజున థియేటర్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అనే డౌటు అందరికీ వస్తుంటుంది. నిజానికి సినిమాని అలా రిలీజ్ చేయాలి అనే ఆలోచన ముందుగా ఎవరికి వచ్చింది..? అలాగే శుక్రవారం రోజున సినిమాని ఎందుకు రిలీజ్ చేయాలి..? మిగతా రోజుల్లో రిలీజ్ చేస్తే ప్రాబ్లం ఏంటి అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతాయి…

    నిజానికి ఒకప్పుడు సినిమాలు రోజులు వారాలు అంటూ చూడకుండా రిలీజ్ సమయం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తూ ఉండేవారు. కాల క్రమేణా కొన్ని కారణాల వల్ల శుక్రవారం రోజున రిలీజ్ చేయాల్సి వస్తుంది. అయితే అందరూ శుక్రవారం రోజున ఎందుకు సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే వీకెండ్ కాబట్టి శుక్ర, శని, ఆదివారాల్లో సినిమా అనేది మంచి వసూళ్లను రాబడుతుంది అనే ఉద్దేశంతో శుక్రవారం రోజున సినిమాను రిలీజ్ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు.ఒక విధంగా చెప్పాలంటే అది కూడా ఒక రీజన్ అయినప్పటికీ అదే ముఖ్య కారణం అయితే కాదు. ఇంతకుముందు వేరే రోజులలో సినిమాలను రిలీజ్ చేసినా కూడా చాలా మంచి వసూళ్లను రాబట్టేవి అలాగే కొన్నిసార్లు సినిమాలను అమావాస్య రోజున కూడా రిలీజ్ చేసేవారు ఎందుకంటే అమవాస్య సమయంలో వ్యవసాయం చేసేవారు ఏ పనులు చేయకుండా పనిముట్లు ముట్టుకోకుండా ఆ రోజు ఖాళీగా ఉంటారు కాబట్టి సినిమా చూడ్డానికి థియేటర్ కు వస్తారనే కాన్ఫిడెంట్ తో అమావాస్య రోజున కూడా సినిమాలు రిలీజ్ చేసేవారు ఇలా అమావాస్య రోజు రిలీజ్ చేసిన సినిమాలు కూడా చాలా మంచి సక్సెస్ లను సాధించాయి.

    మరి శుక్రవారం రోజున సినిమా రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సినీ కార్మికులకు వారం రోజులు చేసిన పనికి సంబంధించిన డబ్బులను శుక్రవారం రోజున ఇస్తారు. అలాగే శని, ఆదివారాలు వాళ్ళకి సెలవులు ప్రకటించేవారు. ఈ ఉద్దేశ్యం తో వాళ్లు శనివారం గానీ లేదా ఆదివారం గాని సినిమాని చూడడానికి ఆసక్తి చూపించేవారు ఆ విధంగా సినిమాని శుక్రవారం రోజున రిలీజ్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారింది.

    ఇక హాలీవుడ్ మొదటగా ఈ ట్రెండు ని 1939 వ సంవత్సరంలో మొదలుపెట్టారు క్లార్క్ గేబుల్ ఆల్ టైం క్లాసిక్ మూవీ అయినా ‘గాడ్ విత్ ది ఎండ్’ అనే సినిమా డిసెంబర్ 15 శుక్రవారం రోజున రిలీజ్ అయింది. ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో ఇక వాళ్ళు శుక్రవారం రోజున సినిమాని రిలీజ్ చేయడం ఆనవాయితీగా పెట్టుకొని కొనసాగించారు. ఇక హాలీవుడ్ లో మొదలైన ఈ సాంప్రదాయాన్ని బాలీవుడ్ లో 1960లో ‘మొగల్ ఈ ఆజం’ అనే సినిమాతో శుక్రవారం సినిమాలు రిలీజ్ చేసే ట్రెండ్ ని బాలీవుడ్ లో స్టార్ట్ చేశారు… ఇక మెల్లిగా దాన్ని తెలుగులో కూడా పాటిస్తూ వస్తున్నారు…

    ఒక శుక్రవారం మన ఇండియాలో లక్ష్మీదేవి దినంగా భావిస్తారు కాబట్టి శుక్రవారం సినిమాను రిలీజ్ చేస్తే కలక్షన్లు కూడా బాగా వస్తాయని ఒక నమ్మకం కూడా శుక్రవారం సినిమాని రిలీజ్ చేయడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు… ఇక మల్టీప్లెక్స్ యాజమన్యానికి నిర్మాతలు చెల్లించే ఫీజు శుక్రవారం మినహాయిస్తే మిగిలిన రోజులలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుక్రవారం సినిమాని రిలీజ్ చేయడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్తుంటారు.