https://oktelugu.com/

Renu Desai : రేణూ దేశాయ్ వెనకుంది ఎవరు? ఆ వీడియో చేయించింది ఎవరు?

సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తి అన్నట్లు రేణూ దేశాయ్ అన్నారు. సందర్భం లేకుండా, ఆమెను ఎవరూ అడగకున్నా రేణూ దేశాయ్ ఈ వీడియో ఎందుకు చేశారనే సందేహాలు

Written By:
  • NARESH
  • , Updated On : August 14, 2023 / 10:15 PM IST
    Follow us on

    Renu Desai : ఇటీవల నటి రేణూ దేశాయ్ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఏ మాత్రం చిన్న సందు దొరికినా రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తుంది. చాలా కాలంగా ఇది జరుగుతుంది. ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఆమెకు గొడవలు జరిగాయి. మా అన్నయ్య(పవన్ కళ్యాణ్) కొడుకును చూపించండి. అలా మీరు దాచి పెట్టకండి అని ఒక అభిమాని అన్నారు. ఈ కామెంట్స్ కి ఆమె అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. మీ అన్నయ్య కొడుకేంటీ… అకీరా నాకొడుకని ఆమె సోషల్ మీడియా వార్ కి దిగారు.

    ఎలక్షన్స్ వస్తున్న క్రమంలో రేణూ దేశాయ్ మరలా మొదలుపెట్టింది. ఎవరో డబ్బులిచ్చి ఆమె చేత ఇలాంటి కామెంట్స్ చేయిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిప్రాయ పడ్డారు. అయితే అనూహ్యంగా రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఓ వీడియో విడుదల చేశారు. సదరు వీడియోలో పవన్ కళ్యాణ్ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు.

    పవన్ కళ్యాణ్ నా విషయంలో ఏం చేసినా… ఆయనకు డబ్బు మీద వ్యామోహం లేదు. సోషల్ వర్క్ చేయాలని ఆశపడతారు. సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తి అన్నట్లు రేణూ దేశాయ్ అన్నారు. సందర్భం లేకుండా, ఆమెను ఎవరూ అడగకున్నా రేణూ దేశాయ్ ఈ వీడియో ఎందుకు చేశారనే సందేహాలు కలుగుతున్నాయి. ఆమెతో ఎవరైనా ఈ వీడియో చేయించారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె స్వయంగా చేసినా ఎవరి ప్రోద్బలంతో చేసినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

    ఇదిలా ఉంటే రేణూ దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. చాలా గ్యాప్ అనంతరం ఆమె వెండితెరపై కనిపించనున్నారు. రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణూ దేశాయ్ కీలక రోల్ చేస్తున్నారు. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు.