https://oktelugu.com/

Bhagwant Kesari – Srileela : భగవంత్ కేసరిలో శ్రీలీల చిన్నప్పటి పాత్రలో నటించిన ఆ చిన్నారి ఎవరు..?

ఇంతకుముందు ఆమె చేసిన సీరియల్స్,రీల్స్ వీడియోలు గాని అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి... ఇక దాంతోపాటుగా ఈమె వరుసగా సినిమా ప్రాజెక్టులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది...

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2023 / 10:23 PM IST
    Follow us on

    Bhagwant Kesari – Srileela : సినిమాల్లో కొంతమంది చైల్డ్ అరెస్ట్ లు చాలా క్యూట్ గా నటిస్తూ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడిని కూడా వాళ్ళ నటనతో, వాళ్ళ ఎక్స్ప్రెషన్ తో ఆకట్టుకుంటు ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే అనిల్ రావిపూడి, బాలయ్య బాబు కాంభినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో చిన్నప్పటి శ్రీలీలా క్యారెక్టర్ లో నటించి తనదైన గుర్తింపు పొందిన అమ్మాయి ఎవరు ఆమె ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం…

    ఆ అమ్మాయి పేరు నైనిక, ముద్దు పేరు మిన్ను అయితే నైనిక సంగారెడ్డిలో అక్టోబర్ 2 వ తేదీన రవికాంత్, ప్రియ అనే దంపతులకు జన్మించింది. అయితే నైనికకి యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండటంతో ఆమె డబ్ స్మాష్, టిక్ టాక్ లాంటి వాటిని వాడుకుని ఎక్కువ వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉండేది. క్యూట్ గా మాట్లాడుతుండటం చాలా బబ్లీగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉండటం వల్ల ఆ అమ్మాయిని చూసిన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ యూనిట్ ఖుషి అనే పాత్ర కోసం ఆమెను తీసుకోవడం జరిగింది. ఈ సీరియల్ లో ఆమె మాట్లాడిన మాటలకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి ప్రతి ప్రేక్షకుడు కూడా ఫిదా అయిపోయాడు దాంతో ఆమెకి అప్పుడు యాడ్స్ లో చేసే అవకాశం వచ్చింది. అలా ఇప్పటి వరకు ఆమె మూడు యాడ్స్ లో నటించడం జరిగింది.

    సీరియల్ లో బాగా పాపులర్ కావడం తో ఇప్పుడు ఆమె సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. అందులో భాగంగానే బాలయ్య బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీలా కి చిన్నప్పటి పాత్రలో నటించడం జరిగింది.ఇక రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమా ఈవెంట్ లో కూడా ఆమె మాట్లాడిన మాటలు చాలా క్యూట్ గా ఉంటూనే ప్రేక్షకులందరు కూడా నైనిక గురించి మాట్లాడుకునేలా తన మాటలతో మాయ చేసింది.

    ఇక మొత్తానికి ఇవాళ్ల ఆ సినిమా రిలీజ్ అవ్వడంతో ఈమెకి ఆ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండటంతో ప్రస్తుతం నైనిక ఆ సినిమా ద్వారా చాలా పాపులర్ అవుతుంది.ఇంతకుముందు ఆమె చేసిన సీరియల్స్,రీల్స్ వీడియోలు గాని అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి… ఇక దాంతోపాటుగా ఈమె వరుసగా సినిమా ప్రాజెక్టులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది…