100 Test Caps : 100వ టెస్టు.. ఈ ఏటి మేటి క్రికెటర్లలో ఎవరికి తీపి జ్ఞాపకమవుతుంది?

ఇలా టెస్ట్ క్రికెట్ లో 100వ టెస్టు ఆడిన ఆటగాళ్ల జాబితా చాంతాడంత ఉంది. ఎంతో మంది ఆ టెస్టులో భీకరంగా ఆడినవారు ఉన్నారు. రికార్డులు నెలకొల్పారు. ఈరోజు మన అశ్విన్ 4 వికెట్లతో సత్తా చాటగా.. ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో మాత్రం తేలిపోయాడు.. 29 పరుగులే చేశాడు.  ఈ ఇద్దరిలో అశ్విన్ కే ఈ టెస్ట్ మధుర స్మృతిగా మిగిలింది. 

Written By: NARESH, Updated On : March 7, 2024 7:33 pm

kane williamson tim southee ashwin jhony bairstow

Follow us on

100 Test Caps : టెస్ట్ క్రికెట్.. ఇప్పుడంటే ప్రభ కోల్పోయింది కానీ.. ఒకప్పుడు దీనికి ఉన్న క్రేజ్ వేరు. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఈ టెస్ట్ క్రికెట్ ద్వారానే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నారు. ఇందులో నేర్చుకున్న ఆటను ఇతర ఫార్మాట్లో ప్రదర్శించడం ద్వారా మేటి ఆటగాళ్ళయ్యారు. అప్పట్లో సచిన్ లాంటి ఆటగాళ్లు వన్డేల్లో వీర విహారం చేసేవారు. టెస్ట్ క్రికెట్ కు వచ్చేసరికి అసలు సిసలైన ఆట తీరు ప్రదర్శించేవారు.. అందుకే వారు వందలకొద్దీ టెస్టులు ఆడారు. ఆ తరాన్ని పక్కన పెడితే.. ఈ జనరేషన్లో కొంతమంది ఆటగాళ్లు టెస్టుల్లో ప్రతిభ చూపుతున్నారు. ప్రస్తుతం వారు తమ కెరియర్లో 100వ టెస్టు ఆడుతున్నారు.

టీమిండియా ఏస్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గురువారం ఇంగ్లాండ్ జట్టుతో ధర్మశాల వేదికగా ప్రారంభమైన ఐదో టెస్ట్ మ్యాచ్ ద్వారా 100 టెస్ట్ ఆడిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇదే ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో కూడా 100వ టెస్టు ఆడుతున్నాడు

ఇక న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియంసన్, టిమ్ సౌతి శుక్రవారం ఆస్ట్రేలియా తో ప్రారంభయ్యే రెండవ టెస్ట్ ద్వారా తమ 100వ టెస్టు ఆడబోతున్నారు.

ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ తన 100 టెస్ట్ మ్యాచ్ లలో ఆధిపత్య బౌలింగ్ రికార్డ్ కలిగి ఉన్నాడు. 593 వికెట్లు, 49 సార్లు 5 వికెట్లు, 14 సార్లు 10 వికెట్ల హాల్ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక రవిచంద్రన్ తన కెరీర్లో గురువారం 100వ టెస్టు ఆడాడు. అతడు కూడా 500 పైచిలుకు వికెట్లు తీశాడు.

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్ తన 100వ టెస్టు ముగిసే సమయానికి 58.95 సగటుతో 9,137 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు ఉన్నాయి.  శుక్రవారం 100వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసుకునే న్యూజిలాండ్ బ్యాటర్ విలియంసన్.. అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.

న్యూజిలాండ్ ఆటగాడు మెకల్లమ్ తన ఆరంగేట్రం నుంచి 100వ టెస్ట్ మ్యాచ్ వరకు.. ఒక్క టెస్ట్ మ్యాచ్ కు కూడా గైర్హాజరు కాలేదు. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా అతడు నిలిచాడు. ఇదే జట్టుకు చెందిన మరో ఐదుగురు ఆటగాళ్లు 100 టెస్ట్ లు వరుసగా ఆడినప్పటికీ.. మధ్యలో ఒక మ్యాచ్ కు దూరం కావడం వల్ల మెకల్లమ్ ఘనతను సాధించలేకపోయారు.

అలెన్ బోర్డర్, ఆలిస్టార్ కుక్ తమ తమ ఆరం గేట్రం సిరీస్లో ఒక టెస్టుకు దూరమయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారు 150 పైచిలుకు టెస్ట్ మ్యాచ్లు వరుసగా ఆడారు. 1984లో కోల్ కతా వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కపిల్ దేవ్ ను అర్థంతరంగా ప్లేయింగ్ లెవన్ నుంచి పక్కన పెట్టారు. ఇక అప్పటినుంచి అతడు రిటైర్మెంట్ అయ్యేవరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా దూరంగా లేడు.

ఇయాన్ అనే ఆటగాడు 1994 పాకిస్తాన్ పర్యటనలో ఉండగా తన బొటనవేలు విరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు. అప్పటినుంచి రిటైర్మెంట్ అయ్యేంతవరకు వరుసగా టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు.

ఇండియన్ వాల్ రాహుల్ ద్రావిడ్ తన ఆరంగేట్రం నుంచి వరుసగా 93 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 2005లో అహ్మదాబాద్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన టెస్ట్ లో అతడు గ్యాస్ట్రో ఎంటిరెటిస్ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. కాగా, ఆ టెస్ట్ మ్యాచ్ అనిల్ కుంబ్లేకు 100వ టెస్ట్ కావడం విశేషం.

ఇంగ్లాండ్ ఆటగాడు కుక్ ఏడు సంవత్సరాల 287 రోజులపాటు టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఇంత తక్కువ వ్యవధిలో 100 టెస్టులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా అతడు ఘనత సాధించాడు. ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్లలో తక్కువ వ్యవధిలో 100 టెస్ట్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న వారు ఐదుగురున్నారు.

ఆస్ట్రేలియా ఆటగాడు మార్క్ వా 100 టెస్టులు పూర్తి చేసుకోవడానికి 8 సంవత్సరాల 342 రోజులు పట్టింది.

గ్రాహం గూచ్ అనే ఆటగాడు తన కెరియర్ ప్రారంభించిన 17 సంవత్సరాల 203 రోజుల తర్వాత 100వ టెస్టు ఆడాడు. గూచ్ తన 100వ టెస్టు ఆడేందుకు ముందు 77 మ్యాచ్ ల్లో అవకాశాన్ని కోల్పోయాడు. 1982 నుంచి 1985 వరకు అతడు నిషేధం ఎదుర్కొన్నాడు. ఫలితంగా టెస్ట్ మ్యాచ్ లకు దూరమయ్యాడు.

ఇక ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హెడెన్ 66 మ్యాచ్ లను కోల్పోయాడు. అతడు తన ఆరంగేట్రం నుంచి జరిగిన మొదటి 69 టెస్ట్ మ్యాచ్ లలో ఏడింట్లో మాత్రమే ఆడాడు. ఆరం గేట్రం నుంచి 100వ మ్యాచ్ మధ్య వరకు సుమారు ఆరుగురు ఆటగాళ్లు 50 టెస్ట్ మ్యాచ్లకు దూరమయ్యారు. 51 టెస్ట్ మ్యాచ్లతో ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో కూడా ఆ జాబితాలో ఉన్నాడు.

2006లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ మధ్య సెంచూరియన్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ద్వారా జాక్వెస్ కల్లిస్, షాన్ పొలాక్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తమ 100వ టెస్టు మైలురాయిని అందుకున్నారు.

ఇక ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ తన 100వ టెస్టులో డబుల్ సెంచరీ చేసి అలరించాడు.

2000 సంవత్సరంలో మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్ పై జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మైక్ అథర్టన్, అలెక్ స్టీవర్ట్ 100 టెస్ట్ మైలురాయి అందుకున్నారు.

2013 పెర్త్ వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన యాషెస్ సిరీస్ లో మైఖేల్ క్లార్క్, ఆ లిస్టర్ కిక్ 100వ టెస్టు ఘనత సాధించారు.

ఇక ధర్మశాల వేదికగా భారత జట్టుతో జరుగుతున్న ఐదవ టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో వందవ టెస్ట్ మైలురాయిని అందుకున్నాడు. ఒక దేశం తరఫున 100కు మించి టెస్ట్ మ్యాచ్ లు ఆడిన ఘనతను ఇంగ్లాండ్ సాధించింది. ఆ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి.. ఆస్ట్రేలియా నుంచి 15, భారత్ నుంచి 14 మంది ఆటగాళ్లు 100 టెస్టుల ఘనత సాధించారు. ఇక పాకిస్తాన్ నుంచి అతి తక్కువ ఆటగాళ్లు 100 టెస్టుల ఘనతను సాధించారు. ఆ దేశం నుంచి కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే 100 టెస్టులు ఆడారు.

ఇక 100వ టెస్టు మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన ఆటగాళ్లుగా వార్న్, మురళీధరన్, కుంబ్లే రికార్డులు సృష్టించారు. 2002లో దక్షిణాఫ్రికా పై జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాడు వార్న్ 100వ మైలురాయి అందుకున్నాడు. ఆ టెస్టులో అతడు ఐదు వికెట్లు సాధించాడు. 2006లో బంగ్లాదేశ్ పై జరిగిన టెస్ట్ మ్యాచ్ లో శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ 100వ టెస్ట్ మైలురాయి అందుకున్నాడు. ఆ మ్యాచ్లో అతడు ఆరు వికెట్లు తీశాడు. 2005లో శ్రీలంక జట్టుపై జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా భారత ఆటగాడు అనిల్ కుంబ్లే 100వ టెస్ట్ మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ మ్యాచ్లో అనిల్ కుంబ్లే ఐదు వికెట్లు సాధించాడు. ఇక కపిల్ దేవ్ తన వందవ టెస్ట్ మ్యాచ్లో ఏకంగా రెండు ఇన్నింగ్స్ లు కలిపి ఏడు వికెట్లు సాధించాడు.

2021లో భారత జట్టుపై జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ 100వ టెస్ట్ మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్లో అతడు సెంచరీ సాధించాడు. 2022లో దక్షిణాఫ్రికా పై జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా డేవిడ్ వార్నర్ తన 100వ టెస్టు మైలురాయి అందుకున్నాడు.. ఆ మ్యాచ్లో అతడు సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ తన 100వ టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో అతడు సెంచరీలు సాధించాడు.

భారత జట్టు ఆటగాడు సునీల్ గవాస్కర్ తన 99 నుంచి 100 టెస్ట్ ఆడటానికి 298 రోజుల సమయం తీసుకున్నాడు. 99 తర్వాత 100వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఏ ఆటగాడు కూడా ఇంత సమయం తీసుకోలేదు. ఎందుకంటే భారత్ 1984లో అక్టోబర్ వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా నిషేధానికి గురై 99 టెస్ట్ మ్యాచ్ ల వద్ద కెరియర్ ముగించిన ఏకైక ఆటగాడు మహమ్మద్ అజారుద్దీన్.

ధర్మశాల వేదికగా భారత జట్టుతో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో బ్యాటింగ్ సగటు 36.42. 100 టెస్ట్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న 22 మంది ఆటగాళ్ల సగటు బెయిర్ స్టో తో పోలిస్తే తక్కువ. బెయిర్ స్టో వికెట్ కీపర్ గా 55 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ గా 44 మ్యాచ్లు ఆడాడు. కీపర్ గా ఆడుతున్నప్పుడు బెయిర్ స్టో 216 ఔట్ లను తన ఖాతాలో వేసుకున్నాడు.. స్టోక్స్ 100వ టెస్టుకు ముందు అత్యధిక ఔట్లతో మార్క్ బౌచర్ (360), హీలీ(344) ముందున్నారు.

రాంచి టెస్ట్ కు ముందు బెన్ స్టోక్స్ సగటు 36.34 మాత్రమే. రాంచి టెస్ట్ ద్వారా స్టోక్స్ 100 టెస్ట్ మైలురాయి అందుకున్నాడు. స్టోక్స్ లాగా 100 టెస్టులు పూర్తి చేసుకున్న 19 ఆటగాళ్లు 300కు మించి వికెట్లు తీశారు. కానీ స్టోక్స్ తన 100వ టెస్టు పూర్తయ్య నాటికి అతడికి కేవలం 197 వికెట్లు మాత్రమే తీశాడు.

వికెట్ కీపర్ లో విభాగంలో ఇయాన్ హీలి (28.69), మార్క్ బౌచర్ (30) అతి తక్కువ సగటు కలిగి ఉన్నారు. మైక్ అథర్టన్ 38.14, కార్ల్ హుపర్ 36.85 సగటుతో ఉన్నారు..

గోర్డాన్ గ్రీనిడ్జ్, వివ్ రిచర్డ్స్ 1974లో భారత జట్టుపై జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరు 100కు పైగా టెస్టుల్లో వెస్టిండీస్ జెట్ తరఫున ఆడారు. భారత ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ 1996లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుపై జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చారు. భారత్ తరఫున వందకు పైగా టెస్టులు ఆడారు.

సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ టెస్ట్ మ్యాచ్ లలో వందకు పైగా క్యాప్ లను కలిగి ఉన్న ఆటగాళ్ళుగా ఘనత సాధించారు. వీరి తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కలిసి, మార్క్ బౌచర్ ఉన్నారు.

ఇలా టెస్ట్ క్రికెట్ లో 100వ టెస్టు ఆడిన ఆటగాళ్ల జాబితా చాంతాడంత ఉంది. ఎంతో మంది ఆ టెస్టులో భీకరంగా ఆడినవారు ఉన్నారు. రికార్డులు నెలకొల్పారు. ఈరోజు మన అశ్విన్ 4 వికెట్లతో సత్తా చాటగా.. ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో మాత్రం తేలిపోయాడు.. 29 పరుగులే చేశాడు.  ఈ ఇద్దరిలో అశ్విన్ కే ఈ టెస్ట్ మధుర స్మృతిగా మిగిలింది.