https://oktelugu.com/

BJP – Bandi Sanjay : ‘బండి’ని సాగనంపి బీజేపీని నాశనం చేసింది ఎవరు?

ఈ తరుణంలో బండి సంజయ్‌ తెలంగాణ ఎన్నికల్లో పార్టీని ఏమేరకు గెలుపు బాట పట్టిస్తారో చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2023 / 01:22 PM IST

    Bandi Sanjay

    Follow us on

    BJP – Bandi Sanjay : భారతీయ జనతాపార్టీ.. ఏడాది క్రితం వరకు తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంది. ప్రజాసంగ్రామ యాత్రతో గ్రామాల్లోకి పార్టీ విస్తరించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దింపుతామని, అధికార బీఆర్‌ఎస్‌ను పడగొట్టేది తామే అని బీజేపీ నేతలు తొడగొట్టారు. కానీ, ఆరు నెలల్లో అంతా మారిపోయింది. ఒకవైపు కార్ణటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, మరోవైపు తెలంగాణ బీజేపీ సారథి బండి సంజయ్‌ను తప్పించడం ఈ రెండు పరిణామాలు తెలంగాణలో బీజేపీ దూకుడుకు బ్రేక్‌లు వేశాయి. క్యాడర్‌లో జోష్‌ లేకుండా చేశాయి. అధికారంలోకి వస్తామన్న నేతల ఆశలను అడియాసలు చేశాయి. బీఆర్‌ఎస్‌ను దించేది బీజేపీ మాత్రమే అని నమ్మిన నేతలు భారీగా కమలం గూటికి చేరారు. కానీ ప్రస్తుతం పరిస్థితిలో కమలం రెక్కలు ఒక్కొక్కటిగా రాలిపతోఉన్నాయి. చేరిన నేతలు పార్టీని వీడుతున్నారు. కొంతమంది పక్కచూపులు చూస్తున్నారు.

    ‘బండి’కి బ్రేక్‌ వేసిన వలస నేతలు..
    బీఆర్‌ఎస్‌లో నంబర్‌ 2 నేతగా ఎదిగిన ఈటల రాజేందర్‌ గులాబీ బాస్‌కు కొరకరాని కొయ్యాలా తయారయ్యారు. పార్టీలో నంబర్‌ 2ను అణచివేసే ఆనవాయితీని కొనసాగిస్తూ సీఎం కేసీఆర్‌ ఈటలకు చెక్‌ పెట్టారు. కబ్జాదారు ముద్రవేసి మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేశారు. దీంతో ఈటల రాజేందర్‌ కూడా కేసీఆర్‌ను విభేదించి బయటకు వచ్చారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనతోపాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, తుల ఉమ్మ వంటి నాయకులను కమలం గూటికి చేర్చారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఈటల విజయానికి బండి సంజయ్‌తోపాటు పార్టీ నేతలంతా కలిసి పనిచేశారు. కానీ, బీజేపీలో క్రమగా బలపడిన ఈటల అక్కడ కూడా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పెరుగుతన్న బీజేపీ బలం చూసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నాయకులు కమలం గూటికి చేరారు. వారంతరినీ ఈటల చేరదీశారు. ఈ క్రమంలో బండి మూడేళ్ల పదవీకాలం పూర్తయింది. దీంతో బండిని తప్పించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది ఈటల సారథ్యంలోని వలస నేతల వర్గం. ఈమేరకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చింది. బండిని మార్చకుంటే.. తామే మారుతామని అల్టిమేటం ఇచ్చారు. వలస నేతల ఒత్తిడికి తలొగ్గిన బీజేపీ అధిష్టానం. సిద్దాంతాన్ని పక్కనపెట్టి బండిని అధ్యక్షుడిగా తప్పించి కేంద్ర మంత్రి, మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికే మళ్లీ బాద్యతలు అప్పగించింది. దీంతో వలస నేతల పంతం నెగ్గింది.

    ‘బండి’ సారథ్యంలో బీజేపీ జోరు..
    బండి సంజయ్‌ మూడేళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన మూడేళ్ల కాలంలో అటు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు ప్రత్యేక తెలంగాణలో బీజేపీకి ఎన్నడూ లేనంత జోష్‌ తెచ్చారు. నిఖార్సై బీజేపీ నేతగా పార్టీని పరుగులు పెట్టించారు. రెండు ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలుపుబాట పట్టించారు. జీహెచ్‌ఎంసీలో ఎన్నడూ లేనివిధంగా 47 కొర్పొరేట్‌ సీట్లను బీజేపీ గెలిచింది. ఇందుకు కారణం బండి సంజయ్‌. అగ్రసెవ్‌ పాలిటిక్స్, కేసీఆర్‌కు మాటకు మాట సమాధానం ఇచ్చే నేతగా బండి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హోం మంత్రి అమిత్‌షా ఆశీస్సులతో తన గురించి పట్టించుకోకుండా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేశారు.

    బండిని తప్పించేవరకు పనిచేసి..
    ఇక పార్టీలో బండి దూకుడు, ఆధిపత్యం నచ్చని కొంతమందిన నేతలు ఏకమయ్యారు. ముఖ్యమంగా బీజేపీలో కీలక నేతగా మారారు ఈటల.. ఆ పార్టీలో తనకంటూ ప్రత్యేక వర్గం తయారుచేసుకున్నారు. తన ప్రధాన అనుచరుడు ఏనుగు రవీందర్‌రెడ్డితోపాటు మరో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఈటల వర్గంలో చురుగ్గా వ్యవహరించేవారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పదవి నుంచి దించేవరకు విశ్రమించకుండా పోరాడింది ఈటల వర్గం.. తాము అనుకున్నది సాధించింది. అయితే తర్వాత పార్టీ బలపేతానికి కృషి చేయాల్సిన ఈటల వర్గం ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకునే పనిలో పడ్డారు. ఈటల వర్గంలో యాక్టివ్‌గా ఉన్న ప్రధాన నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి బీజేపీని వీడారు. బండిని దించే వరకు కలిసి ఉన్న ఈ నేతలు చివరికి తమ సొంత నియోజకవర్గాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న వివేక్‌ పార్టీ వీడడం బీజేపీకి పెద్ద దెబ్బ. విజయశాంతి, డీకే అరుణ పార్టీలో ఉన్నా.. సైలెంట్‌ అయ్యారు.

    చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు..
    తెలంగాణలో పార్టీకి జరిగిన నష్టాని బీజేపీ అధిష్టానం ఆలస్యంగా గుర్తించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా.. పార్టీని వెనక్కునెట్టి కాంగ్రెస్‌ రేసులోకి వచ్చిన తర్వాత బీజేపీ నాయకత్వం బండి సంజయ్‌ మార్పుతో తీవ్ర నష్టం జరిగినట్లు భావించింది. దీంతో ఇప్పుడు తమ తప్పును దిద్దుకునే ప్రయత్నం చేపట్టింది. కానీ ఇప్పటికే ఆలస్యమైంది. అయినా తనవంతు ప్రయత్నంలో భాగంగా బండి సంజయ్‌ను తెలంగాణ స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించింది. హెలిక్యాప్టర్‌ కూడా కేటాయించింది. ప్రచారంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. ఈ తరుణంలో బండి సంజయ్‌ తెలంగాణ ఎన్నికల్లో పార్టీని ఏమేరకు గెలుపు బాట పట్టిస్తారో చూడాలి.