Padma Awards 2024: మన దేశంలో భారత రత్న అత్యున్నత పురస్కారం. ఈ అవార్డు తర్వాత స్థానం పద్మ వార్డులదే. 1954 నుంచి భారత ప్రభుత్వం పద‍్మ అవార్డులను ప్రదానం చేస్తోంది. 1955లో దీనికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను కేంద్రం ప్రకటిస్తోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వీటిని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతులమీదుగా ప్రదానం చేస్తారు.
ఎవరికి ఇస్తారంటే..?
పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అనే మూడు కేటగిరీల్లో అందిస్తున్నారు. కళలు, సమాజ సేవ, ప్రజా సబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలు అందించినవారికి గుర్తింపుగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ అవార్డులకు భారతీయులతోపాటు విదేశీయులను ప్రకటిస్తున్నారు. విదేశీయుల్లో కూడా మన మిత్ర దేశాలకు చెందిన వారికి మాత్రమే ఇస్తున్నారు. సోమవారం 2024 పద‍్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తం 153 మందికి అవార్డులు ప్రకటించగా, ఇందులో పది మంది విదేశీలు ఉన్నారు.
విదేశీయులు వీరే..
ఈసారి ప్రకటించిన పద్మ అవార్డుల్లో పద్మవిభూషణ్ విదేశీయులెవరికీ ఇవ్వలేదు. భారత సంతతికి చెందిన నలుగురు విదేశీయులకు పద్మభూషణ్ ప్రకటించింది. ఇక పద్మశ్రీ అవార్డులను మూడు విభాగాల్లో ఆరుగురు విదేశీయులకు ప్రకటించింది. వీరిలో భారతదేశంలోని పోలాండ్ మాజీ రాయబారి ఉన్నారు.
పద్మ విభూషణ్..
భారతీయ సంతతికి చెందిన సత్యనారాయణ నాదెళ్ల, సుందర్‌పిచాయ్, మధుర్ జాఫరీ భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు. వీరికి పద్మభూషణ్ ప్రకటించారు. మరో భారతీయుడు సంజయ్ రాజారాంకు మెక్సిక్ శాస్త్రవేత్త ఆయనకు పద్మభూషణ్ ప్రకటించింది. దేశ వ్యవసాయ రంగానికి సంజయ్‌రామ్ సహకారం అందించారు. 51 దేశాల్లో విడుదల చేసిన 480 రకాల గోధుమల అభివృద్ధికి కృషి చేసినందుకు 2014లో ప్రపంచ ఆహార బహుమతిని గెలుచుకున్నాడు. గతంలో భారత్ ఈయనకు పద్మశ్రీ ప్రకటించింది. తాజాగా పద్మభూషణ్ ప్రకటించింది.
పద్మశ్రీ..
ఇక ఆరుగురు విదేశీయులకు పద్మశ్రీ ప్రకటించింది. వీరిలో ముగ్గురు పోలాండ్, ఐర్లాండ్, థాయ్‌లాండ్‌కు చెందిన సంస్కృత పండితులు. ఐర్లాండ్‌కు చెందిన సంస్కృత పండితుడు రట్జర్ కోర్టెన్‌హోస్ట్‌ను గత సంవత్సరం తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. మిగిలిన ఇద్దరు థాయ్‌లాండ్‌కు చెందిన చిరాపట్ ప్రపాండ విద్య, భారతదేశంలోని పోలాండ్ మాజీ రాయబారి మరియా క్రిస్టోఫర్ బైర్స్కీ.
అలాగే మాసో‍్కలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని సెంటర్ ఆఫ్ ఇండియన్ స్టడీస్‌లో తన సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో భారతదేశంపై చేసిన కృషికి రష్యాకు చెందిన టటియానా ల్వోవ్నా శౌమ్యన్‌కు పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. రోబోటిక్ సర్జరీలో నైపుణ్యానికిగాను యూకేకి చెందిన ప్రొకార్ దాస్‌గుప్తాను పద్మశ్రీ వరించింది. జపాన్‌కు చెందిన హోటల్ వ్యవస్థాపకుడు ర్యూకో హిరాకు కూడా పద్మశ్రీకి ఎంపిక చేసింది. అతని పుట్టిన పేరు కమలేష్ పంజాబీ. అనేక హోటళ్ల యజమాని. అతను భారతదేశానికి జపాన్ పెట్టుబడులను సులభతరం చేసినందుకు అవార్డు పొందాడు.
ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు ‘పద్మభూషణ్’
ఈసారి వాణిజ్యం, పారిశ్రామిక రంగంలో నలుగురికి పద్మ పురస్కారాలు దక్కాయి. జిందాల్ అల్యూమినియం ఫౌండర్ & సీఎండీ సీతారామ్ జిందాల్(కర్ణాటక), ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లీ (తైవాన్)కు పద్మభూషణ్, ఫైనాన్స్ రంగ నిపుణురాలు కల్పన మోర్పారియా(మహారాష్ట్ర), ఐజ్మో లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్ శశి సోనీ (కర్ణాటక)కి పద్మశ్రీ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. యంగ్ లియూ తైవానీస్ టెక్నాలజీ దిగ్గజం హోన్ హై టెక్నాలజీ గ్రూప్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఛైర్మన్. దీనిని సాధారణంగా ఫాక్స్‌కాన్ అని పిలుస్తారు. ఫాక్స్‌కాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీదారు. సైన్స్ మరియు టెక్నాలజీ సొల్యూషన్‌ల యొక్క ప్రముఖ గ్లోబల్ ప్రొవైడర్‌గా నిలుస్తుంది.
– ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ అండ్ అతి పెద్ద ఐఫోన్ (iPhone) తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌కు 2019 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వివిధ ఉత్పత్తులను ఈ కంపెనీ ఆవిష్కరిస్తుంది.
– పారిశ్రామిక రంగంలో యాంగ్ లీకి 40 ఏళ్ల అనుభవం ఉంది. ఈ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన వ్యవస్థాపకులు, ఆవిష్కర్తల్లో ఒకరు.
– యాంగ్ లీ గొప్ప వ్యవస్థాపకుడు. ఇప్పటి వరకు మూడు కంపెనీలను స్థాపించారు. 1988లో, ‘యాంగ్ మైక్రో సిస్టమ్స్’ పేరిట మదర్ బోర్డ్ తయారీ కంపెనీ; 1995లో, PC చిప్‌సెట్ కోసం నార్త్‌బ్రిడ్జ్ అండ్ సౌత్‌బ్రిడ్జ్ IC డిజైన్ కంపెనీ; 1997లో, ADSL IC డిజైన్ కంపెనీ ITeX ను స్థాపించారు.
– తైవాన్ నేషనల్ చియావో టంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్‌లో BS డిగ్రీని (1978), యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో MS డిగ్రీని (1986) పూర్తి చేశారు.
– 2023 జులైలో, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ‘సెమికాన్ ఇండియా 2023’ సదస్సులో, ఫాక్స్‌కాన్ చీఫ్ యాంగ్ లీ ప్రధాని నరేంద్ర మోదీని (Prime Minister Narendra Modi) కలిశారు. అదే సదస్సులో ఈ ఇద్దరు సమావేశమయ్యారు.
గతంలో పద్మశ్రీ అందుకున్న విదేశీయులు..
1. ఫ్రాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షార్లెట్ చోపిన్ యోగా రంగానికి ఆమె చేసిన కృషికి పద్మశ్రీ గౌరవం పొందారు.
2. పియర్ సిల్వైన్ ఫిలియోజాట్, ఫ్రాన్స్ నుంచి సాహిత్యం, విద్య గ్రహీత, అతని ముఖ్యమైన పనికి గుర్తింపు పద్మశ్రీ ప్రకటించారు.
3. కిరణ్ వ్యాస్, ఫ్రాన్స్ నుంచి “అదర్స్-యోగా” కేటగిరీలో గుర్తింపు పొందారు, అతను యోగాకు చేసిన కృషికి జరుపుకుంటారు.
4. మెక్సికోకు చెందిన ప్రకాష్ సింగ్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ రంగంలో గుర్తింపు పొందారు.
5. పబ్లిక్ అఫైర్స్‌లో సాధించిన విజయాలకు గుర్తింపు పొందిన మరియు పాపువా న్యూ గినియా నుండి వచ్చిన శశింద్రన్ ముత్తువేల్‌ను పద్మ అవార్డుతో సత్కరించారు.
6. ఫ్రెడ్ నెగ్రిట్, ఫ్రాన్స్ నుండి, సాహిత్యం మరియు విద్యలో అతని విజయాల కోసం ప్రశంసించబడ్డాడు.