వాట్సాప్ ప్రైవసీ పాలసీ అప్పటినుంచే.. వాళ్లు మెసేజ్ లు పంపలేరట..?

దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు వినియోగించే వాట్సాప్ యాప్ కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మే 15వ తేదీకి కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేసిన వాట్సాప్ మన దేశ చట్టాలకు అనుగుణంగా వ్యక్తిగత గోప్యతా పరిరక్షణకు కట్టుబడి ఉంటామని పేర్కొంది. కొత్త ప్రైవసీ పాలసీ మే 15వ తేదీ నుంచి అమలవుతుందని వాట్సాప్ స్పష్టం చేసింది. Also Read: ఆరోగ్య భీమా పాలసీ తీసుకుంటున్నారా.. తీసుకోవాల్సిన […]

Written By: Kusuma Aggunna, Updated On : February 20, 2021 12:26 pm
Follow us on

దేశంలో కోట్ల సంఖ్యలో వినియోగదారులు వినియోగించే వాట్సాప్ యాప్ కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మే 15వ తేదీకి కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేసిన వాట్సాప్ మన దేశ చట్టాలకు అనుగుణంగా వ్యక్తిగత గోప్యతా పరిరక్షణకు కట్టుబడి ఉంటామని పేర్కొంది. కొత్త ప్రైవసీ పాలసీ మే 15వ తేదీ నుంచి అమలవుతుందని వాట్సాప్ స్పష్టం చేసింది.

Also Read: ఆరోగ్య భీమా పాలసీ తీసుకుంటున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..?

యూజర్లకు కొత్త ప్రైవసీ పాలసీ సమాచారాన్ని బ్యానర్ రూపంలో కనిపించే విధంగా ప్రదర్శిస్తామని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ యూజర్లు కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోయినా వాళ్లకు వాట్సాప్ నోటిఫికేషన్లు, కాల్స్ వస్తాయని కానీ ఇతరులను వాట్సాప్ ద్వారా మెసేజ్ లు మాత్రం పంపలేరని వాట్సాప్ సంస్థ స్పష్టం చేసింది. జనవరి నెల తొలివారంలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించింది.

Also Read: ఆ దేశంలో రూపాయికే లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే..?

అయితే వాట్సాప్ ఫేస్ బుక్ తో డేటాను పంచుకుంటుందని యూజర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్రం ప్రైవసీ పాలసీలో మార్పులను వెనక్కు తీసుకోవాలని వాట్సాప్ కు సూచించింది. వాట్సాప్ చేసిన మార్పులు ఆమోదయోగ్యం కాదని కేంద్రం పేర్కొంది. అయితే వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విషయంలో అసత్యాలు ప్రచారంలో ఉన్నాయని వెల్లడించడంతో పాటు ఫేస్ బుక్ తో బిజినెస్ అకౌంట్లకు సంబంధించిన సమాచారం మాత్రమే షేర్ చేసుకుంటామని పేర్కొంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారం కూడా యూజర్ అనుమతితోనే చేస్తామని తెలిపింది. వాట్సాప్ యూజర్లు తమ ఇష్టానికి అనుగుణంగా ఇతర మెసేజింగ్ యాప్ లను వినియోగించవచ్చని కానీ ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్ లేని యాప్స్ వినియోగించే విషయంలో యూజర్లు ఆలోచించాలని వాట్సాప్ పేర్కొంది.