Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan CM: పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఏపీ ఎలా ఉండబోతుంది?

Pawan Kalyan CM: పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఏపీ ఎలా ఉండబోతుంది?

Pawan Kalyan CM: జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతోంది. 2014 ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి పవన్ మద్దతు ఇచ్చారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పవన్ మద్దతు తెలిపిన రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. దీంతో పవన్ కు తిరుగులేదని.. ఆయనకు కేంద్రంలో, రాష్ట్రంలో మంచి పదవులకే దక్కుతాయని అంతా భావించారు. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ పవన్ మాత్రం తనకు పదవులు వద్దని.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తే చాలని చెప్పుకొచ్చారు. చాన్స్ ఉన్నా పదవులకు దూరంగా ఉండిపోయారు. అలాగని మద్దతిచ్చిన పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటుచేశాయి కదా.. అని ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టారు. ఎన్నో సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలిగారు. కానీ వ్యక్తిగత ప్రయోజనం ఎన్నడూ ఆశించలేదు. 2019 ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమదూరం పాటిస్తూ పోటీచేశారు. కానీ నిరాశే ఎదురైంది. పరాజయం చవిచూశారు. చివరకు తాను పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో జనసేనను ఏదో పార్టీలో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. దానిని చెక్ చెబుతూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు.

Pawan Kalyan CM
Pawan Kalyan

2024 ఎన్నికల్లో జనసేనకు అనూహ్య విజయం దక్కవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్వే నివేదికలు కూడా అందుకు దగ్గరగా ఉన్నాయి. అందుకే పవన్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు బలమున్న నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో జనసేన లేనిదే ప్రభుత్వం ఏర్పాటుకాదన్న ధీమాతో ఉన్నారు. అదే జరిగితే సీఎం కావొచ్చన్న అభిప్రాయంతో జనసేన వర్గాలు పనిచేస్తున్నారు. అటు రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు కూడా పవన్ కు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు సీనియార్టీని గౌరవించి ఒక ఛాన్సిచ్చారు. కానీ దానిని చంద్రబాబు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఒక ఛాన్స్ అన్న జగన్ మాటలను నమ్మి ఆయనకూ అవకాశమిచ్చారు.కానీ సంక్షేమం మాటున అభివృద్ధి అటకెక్కించారు. రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విద్యాధికులు, రాజకీయాలపై అవగాహన ఉన్నవారు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈసారి పవన్ కు ఒక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరన్న భావన అయితే అందరిలోనూ ఉంది.

Also Read: Ali- Janasena: అలీ జనసేనలో చేరడం లేదా? అసలేమైంది?

పీఆర్పీ నుంచి పవన్ కు రాజకీయాల పట్ల, రాష్ట్రం పట్ల అవగాహన ఉంది. వాస్తవానికి జగన్ కు కూడా ఇంతలా రాజకీయ అనుభవం లేదు. కేవలం తండ్రి వైఎస్సార్ పై ఉన్న సానుభూతి, ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్ కు పొలిటికల్ గా కలిసొచ్చింది. కానీ పీఆర్పీని ఇప్పటివరకూ కొనసాగించి ఉంటే అసలు వైసీపీ అనేది ఆవిర్భవించి ఉండేది కాదని.. జగన్ అనే వ్యక్తి కూడా తెరపైకి వచ్చి ఉండేవారు కాదని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ప్రస్తుతమున్న నాయకుల్లో పవన్ లా రాజకీయ పరిణితి ఉన్న వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు.కేవలం సిద్ధాంతపరంగా పార్టీని తీసుకెళుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. అమరావతి రాజధాని ఎంపిక చేసిన సమయంలో పవన్ 32 వేల ఎకరాలు ఎందుకని … ఇప్పుడే పుట్టిన రాష్ట్రానికి ఆర్భాటాలెందుకని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ నాటి విపక్షం దీనిని విమర్శ కోణంలో చూసింది. నాటి అధికార పక్షంతో గొంతు కలిపి 32 వేల ఎకరాల కంటే ఎక్కువ భూమినే సమీకరించాలని నాడు విపక్ష నేత జగన్ చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక అంత భూమి అవసరం లేదని.. మూడు రాజధానులుంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మడతపెచీ వేసింది.

Pawan Kalyan CM
Pawan Kalyan

అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా.. ఇప్పడు వైసీపీ అధికారంలోకి వచ్చినా బలమైన ప్రతిపక్షంగా జనసేనను కొనసాగించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తుతున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య నుంచి నేటి కౌలు రైతుల భరోసా యాత్ర వరకూ ఏదీ చేసినా ప్రజా సంక్షేమం కోసమే. వ్యక్తిగత దూషణలకు సైతం దూరంగా ఉన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యపై ముందుగా గొంతెత్తినది పవనే. రాష్ట్ర ప్రజల్లో మెజార్టీ వర్గం రైతాంగానిది. అందుకే వారి సమస్యలనే ప్రధాన అజెండాగా తీసుకొని పోరాడుతున్నారు. కేవలం సమస్యపైనే కాకుండా.., సమస్య మూలాలపై మాట్లాడుతున్న నేత పవన్ కళ్యాణ్. అందుకే ఆయన పట్ల రోజురోజుకూ ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ పెరుగుతోంది. గతంలో విభేదించిన వారు సైతం తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి పవనే కరెక్ట్ అన్న భావనకువచ్చారు. ఆయన సీఎం అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుందని చెబుతున్నారు. అయితే ఇదే భావన ఎన్నికల వరకూ కొనసాగితే మాత్రం అటు అధికార వైసీపీకి, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి దెబ్బపడడం ఖాయం.

పవన్ కళ్యాణ్ సీఎం అయితే రామరాజ్యంలా ఉంటుందని మెజార్టీ ప్రజలు, జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. మరణించిన కౌలు రైతుల కోసం తను సినిమాల్లో సంపాదించిన కోట్ల డబ్బును పంచిన పవన్ సీఎం అయితే పేదలకు అంతకుమించిన సౌకర్యాలు కలుగుతాయని.. అభివృద్ధి, సంక్షేమం పట్టాలెక్కుతాయని ప్రజలు భావిస్తున్నారు. అధికారంలో లేనప్పుడే ఇంత చేసిన పవన్.. సీఎం అయితే మాత్రం పేదల కళ్లల్లో సంతోషాలు విరబూసేలా పాలిస్తాడని అంటున్నారు. ఎంతో నిబద్దత గల పవన్ సీఎం అయితే మాత్రం ఏపీ దశ దిశ మారడం ఖాయమంటున్నారు. నిస్వార్థంగా సేవ చేసే పవన్ లాంటి మనిషినే ఏపీకి కరెక్ట్ అని.. పెండింగ్ ప్రాజెక్టులు, రోడ్లు, మౌళిక వసతులు, విద్యా, ఉద్యోగ, వైద్యానికి ఆయన ప్రాధాన్యమిచ్చి నిజంగానే రామరాజ్యాన్ని నెలకొల్పుతాడని జనసైనికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ సీఎం సీఎం అయితే ఏపీ అన్నింటా ముందంజలో ఉంటుందని.. ప్రజల ముఖాళాల్లో నవ్వులు విరబూస్తాయని జనసైనికులు ధీమాగా చెబుతున్నారు.

Also Read: Asiatic Lion: సొంత రాష్ట్రంలో సింహాలపై మోడీకి ఎందుకు అంత చిన్న చూపు?
 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular