KCR: తెలంగాణలో మూడోసారి గెలిచి.. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను మార్చాలని చూస్తున్నారు. గులాబీ బాస్.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఈమేరకు నెల రోజులు ప్రచారంతో హోరెత్తించారు. ఆకట్టుకునే మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. అయినా.. విజయంపై ఏదో ఒక మూలన భయం నలకొంది. గ్రౌండ్ లెవల్‌లో మౌత్‌టాక్ పూర్తిగా కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతోంది. తెలంగాణలో సర్వే చేసిన సంస్థలు కూడా 50–50 ఛాన్స్ అంటున్నాయి. హంగ్ అని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో చివరి చెండు రోజులు చేసే పోల్ మేనేజ్‌మెంట్ గెలుపు అవకాశాలను నిర్ణయిస్తుంది.
ఏం చేయాలంటే..
మరోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలంటే.. మొదల చేయాల్సింది అహంకారం తగ్గించుకోవాలి. కేసీఆర్, కేటీఆర్,హరీశ్‌రావు, కవితరావు.. ఇలా కుటుంబమంతా రెండోసారి అధికారం చేపట్టగానే అహంకారపూరితంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. ఏ ఎన్నికలు వచ్చినా తామే గెలుస్తున్నామని గర్వంతో మాట్లాడడం, మాట విననివారిపై కక్షసాధింపునకు దిగడం, విపక్షం లేకుండా చేయాలని కుట్రలు చేయడం, ప్రశ్నించేవారిని అరెస్ట్ చేయడం వంటివి కోకొళ్లలు. మళ్లీ గెలిపిస్తే కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కుతుందన్న భావనలో సమాజం ఉంది. దీనిని మార్చే మాటలు చెప్పాలి. గత ఎన్నికల్లో హామీ ఇచ్చి నెవర్చేని హామీలు ఎందుకు చేయలేదు.. గెలిస్తే ఏం చేస్తాం అనేది వివరించారు.
మేనిఫెస్టో సాధ్యాసాధ్యాలపై..
ఇక కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందని పోటీగా బీఆర్‌ఎస్ అవే హామీలను కాస్త అటూ ఇటు మార్చి మేనిఫెస్టో విడుదల చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ హామీలను కాపీ కొట్టింది. కానీ, కాంగ్రెస్ హామీలు అమలుకావని ప్రచారం చేస్తోంది. మరి బీఆర్‌ఎస్ ఎలా అమలు చేస్తుందో వివరించాలి.
కర్ణాటక విషయం పక్కన పెట్టాలి..
ఇక కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తుంది. కానీ, తాము అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తామో లేదో వివరించాలి. కార్ణటక విషయం ఇక ఆపాలి.
కబ్జాలు, దౌర్జన్యాలపై వివరణ…
తెలంగాణలో బీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు, ఇసుక, మట్టి దందాలు, దౌర్జన్యాలు పెరిగాయి. కిందిస్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వరకు ఇదే జరుగుతోంది. ఇక పథకాల్లో కమీషన్, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరుకు లంచం.. ఇలా అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. వీటిని ఎలా నియంత్రిస్తామో విరవణ ఇవ్వాలి.
కాళేశ్వరం అవినీతిపై క్లారిటీ..
ఇక ఎన్నికల ముందు కాళేశ్వరం పిల్లర్ కుంగిపోయింది. నీరు నిల్వ చేయలేని పరిస్థితి. 80 వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టు కుంగిపోతే.. ఇల్లు కడితే లీకేజీ ఉండగా, చిన్నచిన్నసమస్యలు రావా అంటూ సర్దిచెప్పుకోవడం అలవాటు చేసుకున్నారు. కానీ, భారీ ప్రాజెక్టుకు, ఇంటికి తేడా ఉండదా. ఇల్లు లీకేజీ ఉంటే లక్ష రూపయాల్లో అయిపోతుంది. ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు కావాలో తెలియనంత అమాయకులు కాదు. జనం సొమ్ముతో కట్టిన ప్రాజెక్టుపై జనాలకు వివరణ ఇవ్వాలి.
పోల్ మేనేజ్‌మెంట్..
ఇక ఆఖరు విషయం పోల్‌మేనేజ్‌మెంట్.. ఈ విషయంలో బీజేపీ చాలా పటిష్టంగా ఉంది. అందుకే పదేళ్లలో అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా పోల్‌మేనేజ్‌మెంట్ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో గులాబీ నేతలు పోల్‌మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టాలి. దాడులు చేయడం, అరెస్ట్‌లు చేయడం కాకుండా ఓటర్ల మనసు దోచుకోవడంపై దృష్టిపెట్టాలి.