https://oktelugu.com/

Pakistan Election 2024 : పాక్ కు ప్రధాని కావాల్సిన వేళ..  ఇమ్రాన్ ఖాన్ కు ఏమిటీ పరిస్థితి..

అందుకే మా అభ్యర్థులు గెలిచినట్టు ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ మేము ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నామని" పీటీఐ బారిష్టర్ సయూఫ్ ప్రకటించారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 17, 2024 / 09:58 PM IST
    Follow us on

    Pakistan Election 2024 : సైన్యం పెత్తనం.. దేశంలో పెరిగిన నిరుద్యోగం.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆహార పదార్థాలను సరఫరా చేయలేని దుస్థితి. పట్టుమని రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయలేని దౌర్భాగ్యం.. ఇలాంటి పరిస్థితుల్లో తన దేశాన్ని కాపాడాలని ఆయన అనుకున్నారు. అక్కడి సైన్యం అతడు అధికారంలోకి వస్తే తమ ఆటలు సాగవనుకుంది. చక్రం తిప్పింది.. ఆయనను జైలుకు పంపింది. దేశంలో ఈ లోగానే ఎన్నికలు వచ్చాయి. జైలు నుంచే అతడు ఎన్నికల ప్రచారం చేశాడు. ప్రజలు కూడా ఈసారి అతను చెప్పిన మాటలు నమ్మినట్టున్నారు. అందుకే మెజారిటీ స్థానాల్లో అతడి పార్టీని గెలిపించారు. కానీ అది అధికారాన్ని అధిష్టించేందుకు సరిపోదు. పైగా ఆర్మీ సపోర్ట్ ఉన్న మిగతా రెండు పార్టీలు తక్కువ స్థానాలు గెలిచినప్పటికీ.. అవి రెండూ కలిసిపోవడంతో అధికార పీఠం వాటికే దక్కే అవకాశం ఉంది.

    పై ఉపోద్ఘాతమంతా ఎక్కడ అనుకుంటున్నారు.. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశంలో.. పాకిస్తాన్ దేశంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ_ ఇన్సాఫ్(పీటీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పార్లమెంట్ లో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవి సరిపోయే పరిస్థితి లేదు. దీంతోపాటు ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పిటిఐ పార్టీకి చెందిన బారిష్టర్ అలీ సయూఫ్ ప్రకటించారు. పార్టీ తన ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉమర్ ఆయుబ్ ఖాన్, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అస్లాం ఇక్బాల్ ను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయాన్ని పి టి ఐ వెల్లడించడం విశేషం.

    “పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ పలు సూచనలు చేశారు. ఆయన సూచనల మేరకు మేము ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాం. ఓట్లు, సీట్లను తారుమారు చేశారు. లేకుంటే మా పార్టీకి 180 స్థానాలు వచ్చేవి. మొత్తం 177 స్థానాలలో మా పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వాటిలో 85 స్థానాలను మా నుంచి బలవంతంగా లాగేసుకున్నారు. అందుకే మా అభ్యర్థులు గెలిచినట్టు ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ మేము ప్రతిపక్షంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నామని” పీటీఐ బారిష్టర్ సయూఫ్ ప్రకటించారు.