https://oktelugu.com/

Salaar climax : సలార్ క్లైమాక్స్ కి బాహుబలి కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

ఈ సినిమాని కూడా బాహుబలి రీతిలోనే ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాని ఎలా ఎండ్ చేస్తారనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్

Written By:
  • NARESH
  • , Updated On : December 21, 2023 / 10:39 AM IST
    Follow us on

    Salaar climax : కేజిఎఫ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ ఒక సిరీస్ తోనే ఆయన పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ఒక భారీ పేరునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో యంగ్ రెబల్ స్టార్ గా పిలుచుకునే ప్రభాస్ తో ఒక సినిమా చేయాలి అనుకొని ప్రభాస్ కి కథ చెప్పి అతన్ని ఒప్పించి ఆయన చేత సలార్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేయాల్సిందే…

    Also Read : డంకీ మూవీ ట్విట్టర్ టాక్: షారుఖ్ ఖాన్ కి హ్యాట్రిక్ హిట్, సినిమాలో అసలు ట్విస్ట్ అదే!

    సలార్ సినిమా 2 పార్టులు గా రిలీజ్ అవుతున్న క్రమంలో ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఒక ట్విస్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది ప్రస్తుతానికి లీక్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే రెండు పార్టులు గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యం లో పృథ్వి రాజ్ సుకుమారన్ చేసిన క్యారెక్టర్ ప్రభాస్ దగ్గర మంచిగా నటిస్తూ వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్ కావడం వల్ల ఇక సినిమా మొత్తం ప్రభాస్ ని వాడుకున్న పృధ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో మాత్రం ప్రభాస్ ని వెన్నుపోటు పొడవబోతున్నట్టుగా తెలుస్తుంది.

    Also Read : 14 రోజులు రిమాండ్.. చంచల్ గూడా జైలుకు బిగ్ బాస్ విన్నర్.. వైరల్ వీడియో

    ఇక అందులో భాగంగానే ప్రభాస్ ఈ సినిమా ఎండింగ్ లో అతని చేతిలో కత్తి గాయానికి బలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ట్వీస్ట్ తో మొదటి పార్ట్ ని ఎండ్ చేసి సెకండ్ పార్ట్ లో వీళ్లిద్దరి మధ్య శత్రుత్వాన్ని పీక్స్ లెవెల్ లో చూపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాని కూడా బాహుబలి సినిమా మొదటి పార్ట్ ఎండింగ్ లో బాహుబలి కట్టప్పను చంపిన ఎపిసోడ్ తో ఎలాగైతే క్లోజ్ చేసి బాహుబలి కట్టప్ప ని ఎందుకు చంపాడు అనే ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ జనాల్లోకి పంపించి దాని కోసం జనాలు ఎదురు చూసెంత రేంజ్ కి రాజమౌళి ఆ సినిమాను ఎలాగైతే తీసుకెళ్లాడో ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాని కూడా బాహుబలి రీతిలోనే ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాని ఎలా ఎండ్ చేస్తారనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్