https://oktelugu.com/

Akkineni’s Heroes : అక్కినేని మూడవ తరం హీరోలు సక్సెస్ అవ్వలేరా..?

వీళ్లు చేసిన తప్పేంటి అంటే స్టోరీస్ సెలక్షన్స్ సరిగ్గా చేసుకోకపోవడం అందువల్లే వీళ్ల సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావడం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : September 19, 2023 / 07:24 PM IST
    Follow us on

    Akkineni’s Heroes : అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున లను మినహాయిస్తే అక్కినేని ఫ్యామిలీ లో మిగిలిన వారు ఎవరు కూడా అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు. నాగేశ్వరరావు, నాగార్జున ల తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన సుమంత్ గాని,సుశాంత్ గాని, నాగచైతన్య గాని, అఖిల్ గాని ఎవరు కూడా అంత గా సక్సెస్ అయితే అవ్వలేదు. వీళ్లు చేసిన తప్పేంటి అంటే స్టోరీస్ సెలక్షన్స్ సరిగ్గా చేసుకోకపోవడం అందువల్లే వీళ్ల సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావడం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంకా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఇప్పటికీ కూడా చాలా సినిమాలు చేస్తున్నారు.

    అయినప్పటికీ అవి ఏవి పెద్దగా సక్సెస్ అయితే సాధించడం లేదు ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడోతరం హీరోలు సక్సెస్ లు కొట్టలేరా అనే దానిమీద ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తుంది. ఇక నాగార్జున తన పాటికి తాను ఇప్పటికి కూడా సినిమాలు, బిగ్ బాస్ అంటూ సినిమాలు, షోలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కానీ తన కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ కెరియర్ల పట్ల ఆయన కొంచెం ఫోకస్ పెడితే బాగుంటుందని సినీ మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.

    ఇక ఇది ఇలా ఉంటే అఖిల్ పరిస్థితి మాత్రం మరి దారుణంగా ఉంది ఇప్పటివరకు అరడజను సినిమాలు చేసినా కూడా ఇప్పటి వరకు ఆయనకి ఒక్క మంచి హిట్ అయితే పడలేదు. దాంతో ఆయన ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలనే దాని మీద ఒక చిన్న పాటి డైలమా లో ఉన్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ అయింది.ఇక ఇప్పుడు ఏ సినిమా చేయాలి అనేది అర్థం కాక అఖిల్ తల పట్టుకుంటున్నాడు. ఇక ఇదే విషయం మీద నాగార్జునని అడిగితే అఖిల్ కి సెట్ అయ్యే స్టోరీ ఒకటి దొరికిన తర్వాత మళ్లీ అఖిల్ సినిమా చేస్తాడు అని చెప్పాడు…అఖిల్ తో సినిమా చేసి హిట్ కొట్టాలి అంటే డైరెక్టర్లకి ఒక పెద్ద సవాలే అని ట్రేడ్ పండితులు అంటున్నారు.ఇక చూడాలి మరి అఖిల్ ఒక భారీ హిట్ ఎప్పుడు కొడతాడో…