Naga Chaitanya- Samantha Divorce: అక్కినేని నాగచైతన్య – సమంత విడిపోవడం అనేది అక్కినేని ఫ్యాన్స్ కి నేటికీ షాకే. అసలు చైతు – సామ్ మధ్య ఎన్నడూ గొడవ జరిగినట్టు కూడా వార్తలు రాలేదు. పైగా అక్కినేని కోడలుగా సమంత ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చుకుంది. మరి ఎందుకు ఈ క్రేజీ కపుల్ సడెన్ గా విడిపోయారు ?, మరేదైనా కారణం ఉందా ? అని నెటిజన్లు ఇప్పటికీ ఆరా తీస్తూనే ఉన్నారు. ఐతే, తాజాగా సమంతతో తాను విడిపోవడంపై నాగచైతన్య స్పందించారు.

చైతు మాటల్లోనే.. ‘నా వ్యక్తిగత జీవితం గురించి అందరూ మాట్లాడుకోవడం నాకు అసహనాన్ని కలిగిస్తోంది. ఒక నటుడిగా నా వర్క్ గురించే అందరూ మాట్లాడుకోవాలని నేను కోరుకుంటాను గానీ, నా వ్యక్తిగత జీవితం గురించి కాదు. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ అంటూ ఒక్కటి ఉంటుంది. సమంతతో నేను విడాకులు ఎందుకు తీసుకున్నాను ?, అసలు విడాకులకు గల కారణాలను నేను ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం లేదు’ అని చైతు తేల్చి చెప్పాడు.
Also Read: Jayasudha Shocking Comments: జయసుధ షాకింగ్ కామెంట్స్ ఎవరి గురించి ?, వివక్ష పోవాలంటే ఏం చేయాలి ?
పైగా చైతు ఇంకా కఠినంగా మాట్లాడుతూ.. ‘ఇప్పుడు సమంత దారి సమంతదే. నా దారి నాదే. ఇంతకుమించి ఈ విషయంలో నేను చెప్పాల్సిందేమీ లేదు. అలాగే నా పై వచ్చే అన్నీ ఊహాగానాలకు ఇక నేను స్పందించను’ అంటూ చైతు క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి తన వ్యక్తిగత జీవితంపై సోషల్మీడియాలో జరుగుతోన్న ప్రచారం దెబ్బకు చైతు బాగా విసిగిపోయినట్లు కనిపిస్తోంది.

అలాగే చైతు ఒక మాట అన్నాడు. ‘సమంత – నాకు మధ్య జరిగిన ఒక విషయాన్ని నేను ఈ ప్రపంచానికి చెప్పాలనుకోవడం లేదు. నా జీవితంలో అసలు ఏం జరిగిందో నా కుటుంబానికి, నా బంధుమిత్రులకు తెలుసు’ అని చైతు కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అంటే.. చైతు మాటలను బట్టి.. చైతుకి – సామ్ కి మధ్య ఏదో జరిగిందని అర్థం అవుతుంది.
అదే ఏం జరిగింది అనేది ఆరా తీస్తే.. సమంత చేసిన ఓ పని చైతుని బాగా బాధ పెట్టిందట. చైతు మాట్లాడిన ఎమోషనల్ మాటలను బట్టి కూడా.. చైతు ఏదో ఒక విషయంలో తీవ్రంగా ఆవేదన చెందినట్లు అర్ధం అవుతుంది. మరి అది ఏమిటి అనేది రానున్న రోజుల్లో నైనా క్లారిటీ వస్తోందేమో చూడాలి.
Also Read: Tollywood Mafia: టాలీవుడ్ మాఫియా : ఎదిగిన హీరోనే తొక్కేస్తుంటే.. ఇక కొత్త వాళ్ళను బతకనిస్తారా ?
Recommended Videos
[…] […]
[…] […]