Chiranjeevi vs Dasari : దాసరి నారాయణ రావుకి చిరంజీవికి మధ్య గొడవ ఏంటి..?

దాసరి ఎప్పుడు మోహన్ బాబుతో కలిసి ఉండేవాడు. దాంతో మోహన్ బాబు కి దాసరి కి చిరంజీవి అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు అంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి...

Written By: Gopi, Updated On : January 24, 2024 9:53 pm
Follow us on

Chiranjeevi vs Dasari :  సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి స్టార్ హీరోలతో సూపర్ సక్సెస్ సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు దాసరి నారాయణరావు. అటు ఎన్టీఆర్ ని, ఇటు నాగేశ్వరరావు ని బ్యాలెన్స్ చేస్తూ కథలు రాస్తూ అటు రైటర్ గా, ఇటు డైరెక్టర్ గా సినిమాలు చేస్తు సక్సెస్ అయిన ఒకే ఒక్క దర్శకుడు కూడా దాసరి గారు కావడం విశేషం…

అప్పట్లో ఒకరు కథ రాస్తే, మరొకరు డైరెక్షన్ చేసేవారు కానీ దాసరి గారు మాత్రం కథ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ఆయనే చేసేవాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన చాలా సినిమాలు అప్పట్లో సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఎన్టీయార్ లాంటి సీనియర్ హీరో సైతం దాసరి గారితో సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

అయితే ఎన్టీయార్, నాగేశ్వరరావు తర్వాత ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో స్టార్ డమ్ అందుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. దాసరి గారికి చిరంజీవి కి మధ్య డైరెక్ట్ గా గొడవలు ఏమీ జరగనప్పటికీ, స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి చాలా మంది దర్శకులతో ఒక్కో సినిమా చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. ఇక ఈ క్రమం లో ఎన్టీయార్, నాగేశ్వరరావు లాంటి వాళ్లే దాసరి గారితో మనం ఒక సినిమా చేద్దాం అని చెప్తూ ఉండేవారు. అలాంటిది చిరంజీవి మాత్రం అసలు దాసరి గారిని పట్టించుకోకుండా తన సినిమాలు తను చేసుకుంటూ పోయేవాడు. ఇక ఈ క్రమం లోనే చిరంజీవి నా దగ్గరికి వచ్చి మనం సినిమా చేద్దాం అని అడగడం లేదు అనే కారణం తో దాసరి గారు హర్ట్ అయ్యారు అంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఇక దానివల్లనే చిరంజీవి మీద దాసరి గారికి కొంచం కోపం ఉండేదని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక మొత్తనికైతే అల్లు రామలింగయ్య అటు చిరంజీవిని, ఇటు దాసరి ని ఇద్దరిని ఒప్పించి వీళ్ళ కాంబో లో లంకేశ్వరుడు అనే సినిమా వచ్చేలా చేశాడు, కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది.

అయితే దాసరి గారికి మాత్రం ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయిన ఇబ్బంది గా ఈ సినిమా చేశారని అందుకే ఇది ప్లాప్ అయింది అంటూ అప్పట్లో చాలా చర్చలు కూడా జరిగాయి. అందుకే ఇక వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా అయితే రాలేదు. ఇక చిరంజీవి పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత దాసరి గారు చిరంజీవి మీద సెటైరికల్ గా మేస్త్రి అనే ఒక సినిమా చేసి చాలామంది చేత విమర్శల ఎదుర్కొన్నారు. ఇక అప్పటి నుంచి వాళ్ళ మధ్య ఎప్పుడు సన్నిహిత సంబంధం అయితే ఉండేది కాదు. దాసరి ఎప్పుడు మోహన్ బాబుతో కలిసి ఉండేవాడు. దాంతో మోహన్ బాబు కి దాసరి కి చిరంజీవి అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు అంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి…