https://oktelugu.com/

India’s currency symbol : ఇండియా కరెన్సీ సింబల్‌ ఏంటి.. ఎవరు రూపొందించారో తెలుసా? దాని వెనుక పెద్ద కథ

ఇక రూపీ సింబల్‌ కంప్యూటర్ కీబోర్డుపై ఇంకా ప్రత్యేక కీ ఏర్పాటు చేయలేదు. కానీ, లేటెస్ట్‌ కీబోర్డులో దీనికోసం ఒక ఆప్షన్‌ ఇచ్చారు. crt+alt+4 ప్రెస్‌ చేస్తే రూపీ సింబల్‌ వస్తుంది. 2010 నుంచి ఈ సింబర్‌ను రిజర్వు బ్యాంకు భారత కరెన్సీపై ముద్రిస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2024 3:55 pm
    Follow us on

    India’s currency symbol : భారత కరెన్సీ 60 ఏళ్లుగా అందుబాటులో ఉంది. కాయిన్స్, నోట్ల రూపొంలో వాడుతున్నాం. కానీ, అమెరికన్‌ కరెన్సీ డాలర్‌కు ఉన్నట్లుగా మన కరెన్సీకి 2010 వరకు ఒక సింబల్‌ అంటూ లేదు. కేవలం ఖట. అని వాడుతూ వచ్చాం. కానీ భారత కరెన్సీకి కూడా ఒక సింబల్‌ ఉండాలని 2009లో అప్పటి ప్రభుత్వం నిర్ణయంచింది. ఈమేరకు గ్రాఫిక్‌ డిజైనర్లకు సూచించింది. పలువురు డిజైన్‌ రూపొందించారు. అందులో ఒక సింబల్‌ ఎంపిక చేశారు. 2010 నుంచి దీనిని రిజర్వు బ్యాంకు నోట్లపై ముద్రిస్తోంది.

    ఎవరు రూపొందించారు..
    భారత కరెన్సీ సింబల్‌ కోసం 3 వేలకుపైగా ఎంట్రీలు వచ్చాయి. ఇందులో నుంచి ఉదయ్‌కుమార్‌ అనే గ్రాఫిక్‌ డిజైనర్‌ తయారు చేసిన సింబల్‌ను ప్రభుత్వం ఫైనల్‌ చేసింది. ఈ సింబల్‌ ఇంగ్లిష్‌ ఆల్ఫాబెట్‌ R అలాగే హింది ఆల్ఫాబెట్‌ ‘రా’ను పోలి ఉంటుంది. ఈ సింబల్‌ రూపొందించినందుకు ఉదయ్‌కుమార్‌కు అప్పటి భారత ప్రభుత్వం రూ.2,50,000 వేలు బహుమతిగా అందించింది.

    ఎవరీ ఉదయ్‌కుమార్‌..
    ఉదయ్‌కుమార్‌ డిజైనింగ్‌లో ఐఐటీ బాంబేలో డిగ్రీ చేశాడు. ప్రస్తుతం ఐఐటీ గౌహతిలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా డిజైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీగా పనిచేస్తున్నారు.

    కీబోర్డుపై ఇలా..
    ఇక రూపీ సింబల్‌ కంప్యూట్‌ కీబోర్డుపై ఇంకా ప్రత్యేక కీ ఏర్పాటు చేయలేదు. కానీ, లేటెస్ట్‌ కీబోర్డులో దీనికోసం ఒక ఆప్షన్‌ ఇచ్చారు. crt+alt+4 ప్రెస్‌ చేస్తే రూపీ సింబల్‌ వస్తుంది. 2010 నుంచి ఈ సింబర్‌ను రిజర్వు బ్యాంకు భారత కరెన్సీపై ముద్రిస్తోంది.