Konaseema Agitation ఎంతో ప్రశాంతంగా పచ్చని ఆలవాలంతో ఆహ్లాదంగా ఉండే ‘కోనసీమ’ అకస్మాత్తుగా అంటుకోవడం.. ఈ హింసాకాండలో ఒక మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగులబడడం.. పోలీసుల తలలు పగలడం.. బస్సులను తగలబెట్టడం యావత్ రాష్టాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

‘కోనసీమ జిల్లా’కు అంబేద్కర్ పేరు పెట్టినందుకు వ్యతిరేకంగా దళితేతరు కులసంఘాలు ఏకమై ఈ పనిచేశాయని సమాచారం. అయితే వైసీపీ ఎమ్మెల్యే హత్య కేసును మరిచిపోవడానికే ఈ అల్లర్లు చెలరేగేలా చేశారని జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. టీడీపీ నేతలు కూడా వైసీపీ డైవర్ట్ రాజకీయం అని ఆరోపిస్తోంది.
ఇక వైసీపీ కోణం మరోలా ఉంది. ఇది కుల వైషమ్యమే అయితే ఇళ్లు, బస్సులు ఎందుకు తగులబెడుతారని.. జాతీయ వార్తగా ఎందుకు మలుస్తారని అనుమానిస్తోంది. దావోస్ నుంచి పెట్టుబడులతో వస్తున్న ఏపీ సీఎం జగన్ సత్తాను నీరుగార్చడానికి.. పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికే రాష్ట్రాన్ని అశాంతికి నిలయంగా చూపించాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రతిపక్షాలు చేశాయని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఇప్పటికే ఫ్రాన్స్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వైజాగ్‌ని హై ఎండ్ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు టెక్ మహీంద్రా కూడా ఆసక్తి చూపుతోంది. మహీంద్రా గ్రూప్‌కు చెందిన మరో కంపెనీ కూడా ఇథనాల్ ప్లాంట్‌పై రూ. 250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది.
అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో రూ. 60000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇది దావోస్ నుంచి వస్తున్న జగన్ సాధించిన ఘనత.. దీన్ని కనీసం ప్రచారం చేయించుకోనివ్వకుండా ఈ అల్లర్లు చెలరేగేలా చేశారన్నది వైసీపీ వాదన..
కాబట్టి ఎవరి యాంగిల్ లో వారు ‘కోనసీమ’ను అన్వయించుకుంటున్నారు. జనసేన ప్రకారం.. ఇది వైసీపీ ఎమ్మెల్సీ చేసిన హత్యను డైవర్ట్ చేయడానికి.. వైసీపీ ప్రకారం.. దావోస్ నుంచి జగన్ తెచ్చిన పెట్టుబడులు,, రాష్ట్రంలోకి కొత్త పెట్టుబడులను నిరోధించడానికి ఇది చేశారని అంటోంది. మొత్తంగా ‘కోనసీమ’ నిప్పు వెనుక ఏముందో కానీ అధికార, ప్రతిపక్షాలు మాత్రం సందర్భాన్ని తెగ వాడేసుకుంటున్నాయి.
Recommended videos
[…] […]
[…] […]