https://oktelugu.com/

Kadem project : కడెం మహోగ్రరూపం.. ప్రాజెక్ట్ పై నుంచి నీళ్లు.. షేకింగ్ వీడియో

తాజాగా ఈ వానలకు ఆదిలాబాద్ చిగురుటాకులా వణుకుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ అయితే మహోగ్రరూపం దాల్చింది. ఎంతలా అంటే ప్రాజెక్ట్ నిండిపోయి పై నుంచి నీరు పోతున్న పరిస్థితి. అక్కడి భయాన పరిస్థితుల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2023 / 10:46 AM IST
    Follow us on

    Kadem project : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణలో ఎక్కడ లేనన్నీ నదులు, వాగులు, వంకలు, ప్రాజెక్టులు, చిన్న చిన్న చెక్ డ్యాంలు అక్కడ ఉన్నాయి. ఓవైపు గోదావరి.. మరోవైపు ప్రాణహిత సహా పెన్ గంగా, వెన్ గంగా లాంటి ఎన్నో ఉపనదుల సమాహారం మన ఆదిలాబాద్. అందుకే అక్కడ అన్నీ ఎక్కువనే. అడవులు ఎగువన మహారాష్ట్రలోనూ ఉండడంతో వానలు, వరదలు ఎక్కువ.

    తాజాగా ఈ వానలకు ఆదిలాబాద్ చిగురుటాకులా వణుకుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ అయితే మహోగ్రరూపం దాల్చింది. ఎంతలా అంటే ప్రాజెక్ట్ నిండిపోయి పై నుంచి నీరు పోతున్న పరిస్థితి. అక్కడి భయాన పరిస్థితుల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    ప్రాజెక్ట్ తెగితే కిందనున్న గ్రామాల ప్రజలు పెనుప్రమాదంలో పడుతారు. గేట్లు ఎత్తుదాం అంటే ఓ నాలుగు గేట్లు మొరాయిస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్ పై సిబ్బంది అధికారులు ఏం చేయాలో తోచక భిక్కుభిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

    కడెం ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత ప్రమాదంలో పడింది. ప్రాజెక్ట్ పై నుంచి నీటి ప్రవాహం పోతోంది. వరద 4 లక్షల క్యూసెక్కులకు చేరడంతో నీరు గేట్ల పై నుంచి వెళుతోంది. ప్రాజెక్ట్ కెపాసిటీ 3.50 లక్షల క్యూసెక్కులే. కానీ 4 లక్షలకు పైగా వస్తోంది. అందుకే ప్రాజెక్ట్ నిండిపైనుంచి పోతున్నాయి.

    ఇప్పటికే 14 గేట్ల ద్వారా దిగువకు 2.18 లక్షల క్యూసెక్కులు వదిలారు. 4 గేట్లు ఓపెన్ కాక మొరాయిస్తున్నాయి. ప్రాజెక్ట్ దిగువన 12 గ్రామాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. వరద పేరుకుపోవడంతో ఎగువ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. దీంతో భిక్కుభిక్కుమంటున్న పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం పరివాహక ప్రాంతాల ప్రజలను వెంటాడుతోంది.