Gaami Movie Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలావరకు కొత్త కథలను ఎంచుకుంటూ యంగ్ హీరోలందరూ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మాస్ కా దాస్ గా పేరు పొందిన విశ్వక్ సేన్ సైతం కొన్ని కొత్త అటెంప్ట్ లతో మన ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ‘గామి ‘ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా తో విశ్వక్ సేన్ కి సక్సెస్ దక్కిందా? లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సినిమాలో మూడు కథలు పార్లల్ గా నడుస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా విశ్వక్ సేన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఒక అగోరా గా నటించాడు. ఇక ఆయన్ని ఎవ్వరూ ముట్టుకోని ఒక తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. అలాగే అభినయకు సంబంధించిన ఒక స్టోరీ అనేది సినిమాలో పార్ట్ గా నడుస్తూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే విశ్వక్ సేన్ తనకున్న ఆ జబ్బు పోవాలి అంటే 36 సంవత్సరాలకి ఒకసారి హిమాలయాల్లో ఉండే ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్లి అక్కడ కొన్ని పనులు చేస్తే ఆయనకి ఉన్న ఆ జబ్బు పోయి ఆరోగ్య వంతుడు అవుతాడు అని చెప్తారు. ఇక ఈ క్రమంలోనే తను హిమాలయాలకి బయలుదేరుతాడు.
ఈ ప్రాసెస్ లోనే అతనికి చాందిని చౌదరి కలుస్తుంది.ఆమె బ్యాక్ స్టోరీ ఏంటి? చాందిని విశ్వక్ సేన్ కి ఎందుకు హెల్ప్ చేస్తుంది. ఈ మూడు కథలను కలుపుతూ దర్శకుడు ఇక అదిరిపోయే ట్విస్ట్ కూడా ఇస్తాడు. అయితే విశ్వక్ సేన్ ఈ సినిమాలో తన జబ్బుని పోగొట్టుకున్నాడా? లేదా? చివరికి ఏం జరిగింది ? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు విద్యాధర్ కాగితా రాసుకున్న స్టోరీ చాలా ఫ్రెష్ గా ఉంది. ఇక ఆ స్టోరీ కి అనుకూలంగానే స్క్రీన్ ప్లే ని కూడా చాలా కొత్తగా రాసుకున్నాడు. ప్రతి ఒక ఆడియన్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ సినిమా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాలు అవుతున్న కూడా ఒకే స్క్రిప్ట్ మీద ఆయన ఇన్ని రోజులు ట్రావెల్ అవడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. పట్టువదలని విక్రమార్కుడి వలె ఆరు సంవత్సరాలు అయిన కూడా ఎక్కడ డిస్పాయింట్ అవ్వకుండా ఆ సినిమాను మొత్తానికి ఫినిష్ చేసి రిలీజ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. ఈ విషయంలో మనం డైరెక్టర్ యొక్క ఓపికకి కి మెచ్చుకోవచ్చు. అయితే ఈ సినిమాలో విద్యాధర్ చూపించిన సీన్లు గాని, విశ్వక్ సేన్ యాక్టింగ్ గానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని రాసుకున్న విధానం అయితే చాలా బాగుంది.
ఇక కొన్ని సీన్లని హై లో చూపించడంలో దర్శకుడు కొద్దిగా తడబడ్డట్టుగా అనిపించినప్పటికీ ఆ సీన్ యొక్క డెప్త్ ను చెడగొట్టకుండా సినిమాను చూసి ఆడియన్స్ లో ఈ సినిమా తాలూకు ఒక మూడునైతే క్రియేట్ చేయగలిగాడు. ఈయన ఇలాంటి ఒక ఎక్స్పరిమెంటల్ మూవీ ని అసలు ఎక్కడ డివియేషన్స్ లేకుండా అతను ఎంచుకున్న పాయింట్ తెర మీద చూపిస్తు కథను హనేస్ట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ లు ఇంకా వస్తేనే సినిమా ఇండస్ట్రీ అనేది కొత్త పుంతలు తొక్కుతుందనేది మాత్రం వాస్తవం… ఇక ఈయన చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఎంతసేపు విశ్వక్ సేన్ క్యారెక్టర్ మీదనే సినిమాను రన్ చేశాడు కానీ అభినయ క్యారెక్టర్ లో కూడా ఇంకా డెప్త్ ను చూపిస్తే బాగుండేది. అలా చేయకుండా చాలాసేపు విష్వక్ సేన్ మీదే స్క్రీన్ ప్లే నడవడం వల్ల సినిమా చూసే ఆడియన్ కి కొన్నిసార్లు బోర్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. అలాగే అభినయ క్యారెక్టర్ లో డెప్త్ ఉంది.
ఆమె చుట్టూ రాసుకున్న సీన్లలో కూడా ఒక హై ఎలివేషన్ అయితే ఉంది. సాధ్యమైనంత వరకు విద్యాధర్ హీరో క్యారెక్టర్ కి దీటుగా ఈ క్యారెక్టర్ ను రాసుకున్నాడు. ఎగ్జిక్యూషన్ లో అయితే ఆమె క్యారెక్టర్ మాత్రం పర్ఫెక్ట్ గా పోట్రే అవ్వలేదు అనేది తెలుస్తుంది… ఈ సినిమాని ఒక యంగ్ డైరెక్టర్ డీల్ చేశారంటే మాత్రం ఎవరు నమ్మలేరు… ఎందుకంటే దీంట్లో కాంప్లికేటెడ్ సీన్స్ చాలా ఉన్నాయి. అవి ఆయన ఎత్తుకున్న విధానం గాని, వాటిని డీల్ చేసిన పద్దతి గాని చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ వేలో ఉన్నాయనే చెప్పాలి… ఇక ఈ సినిమాకి మ్యూజిక్ కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి…
నటీనటుల పర్ఫామెన్స్
ఇక ఈ సినిమాలో నటినటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ ఒక కొత్త క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ గా తీసుకొని మరీ నటించినట్టుగా తెలుస్తుంది. ఆయన నటించిన క్యారెక్టర్లలో ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనే చెప్పాలి. అయినప్పటికీ దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్నిక్యూట్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నిజానికి ఈ క్యారెక్టర్ ని పోషించడం అంటే అంత ఆషామాషీ కాదు. అందులో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక జబ్బుతో బాధపడే వ్యక్తి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు అనేది కూడా మన కండ్లకు కట్టినట్టుగా తన నటనతో చూపిస్తూ ఎమోషన్స్ ని కూడా చాలా బాగా డీల్ చేస్తూ నటించాడు. చాందిని చౌదరి హీరో కి హెల్ప్ చేసే క్యారెక్టర్ లో నటించింది. ఆమె ఇంతకుముందు చేసిన కలర్ ఫోటో లో ఎలా అయితే సెటిల్డ్ గా నటించి మెప్పించిందో, ఈ సినిమాలో కూడా ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో అభినయ కూడా చాలా చక్కని పర్ఫామెన్స్ ని ఇచ్చింది. తను నటించిన ప్రతి సీను లో జీవించిందనే చెప్పాలి. ఇక వీళ్లతో పాటుగా మిగిలిన క్యారెక్టర్లు పోషించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే నరేష్ కుమారన్ అందించిన మ్యూజిక్ ఓకే అనిపించింది. ముఖ్యంగా బిజీ ఏం మాత్రం సినిమాలోని సీన్స్ ని ఎలివేట్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అయింది. అలాగే ప్రేక్షకుడిలో ఆ సినిమా తాలూకు ఒక మూడును క్రియేట్ చేయడంలో మ్యూజిక్ అన్నది చాలా కీలకపాత్ర వహించిందనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే సినిమాటోగ్రాఫర్ అయిన విశ్వనాథ్ రెడ్డి అందించిన విజువల్స్ ఈ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో ఆయన అందించిన విజువల్స్ అనేవి ప్రేక్షకుడిని కట్టిపడేసాయనే చెప్పాలి… రాఘవేంద్ర ఎడిటింగ్ పనితనం కూడా బాగుంది. ఏ సీన్ ఎంత లెంత్ లో కట్ చేయాలో అక్కడి వరకు కట్ చేశాడు. కోర్ సీన్ లో ఉన్న ఎమోషన్ మిస్ అవ్వకుండా సీన్ ను చాలా షార్ప్ గా గ్రిప్పింగా కట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్స్ లో పనిచేసిన సునీల్ రాజు అందించిన స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి రిచ్ నెస్ ను తీసుకొచ్చాయి. ప్రతి షాట్ లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై లో కన్పిస్తుంటాయి…
ప్లస్ పాయింట్స్
కథ
విశ్వక్ సేన్
మైనస్ పాయింట్స్
కొన్ని సీన్లు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో కొంచెం బోర్ కొట్టించాయి…
డైరెక్టర్ మొదటి సినిమా అవడం వల్ల ఆయన కి ఎక్స్పీరియన్స్ లేకపోవడం కూడా కొన్ని సీన్లను ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయాయి…
రేటింగ్
ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.75/5
చివరి లైన్
మాస్ కా దాస్ కొత్త ప్రయత్నం కొంతవరకు వర్కౌట్ అయింది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More