Virat vs Sachin : ఇండియన్ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ కి ఒక అరుదైన గౌరవం ఉంది. ఆయనని ప్రపంచం మొత్తం క్రికెట్ గాడ్ గా పిలుస్తూ ఉంటారు. ఇలాంటి సచిన్ టెండూల్కర్ తన జీవితంలో చాలా రికార్డులను క్రియేట్ చేశాడు ముఖ్యంగా వన్ డే ఫార్మాట్ లో అయితే అత్యంత ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ గా ఒక అరుదైన రికార్డు ను క్రియేట్ చేశాడు. అలాగే అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా కూడా ప్రపంచంలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాడు…
ఇక ఇది ఇలా ఉంటే మరో ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అయిన కోహ్లీ ఒక యువ కెరటంలా ముందుకు దూసుకు వచ్చి సచిన్ సాధించిన 49 సెంచరీల రికార్డుని కోహ్లీ సమం చేశాడు. మరి ముఖ్యంగా ఒక ఇండియన్ టీమ్ నెలకొల్పిన రికార్డును మరొక ఇండియన్ ప్లేయర్ అతి తక్కువ కాలంలో ఆయనతో పాటు సమం చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…
సచిన్ టెండూల్కర్ 451 ఇన్నింగ్స్ లలో 49 సెంచరీ లు చేయగా, కోహ్లీ 277 ఇన్నింగ్స్ లలో 49 సెంచరీలను సాధించాడు. ఇక ఈ లెక్కన చూసుకుంటే సచిన్ టెండూల్కర్ అవరేజ్ గనుక మనం చూసుకుంటే 9.22 మ్యాచ్ లకు ఒక సెంచరీ నమోదు చేశాడు. అదే కోహ్లీని తీసుకుంటే 5.65 మ్యాచ్ లకు ఒక సెంచరీ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది… అయితే కోహ్లీ తన 35 సంవత్సరాల తక్కువ ఏజ్ లోనే 49 సెంచరీలు సాధించడం అంటే మామూలు విషయం కాదు.అందుకే కోహ్లీ ని ద కింగ్ కోహ్లీ అని కూడా పిలుస్తుంటారు…
ఇక ఇండియన్ టీం వన్డే మ్యాచ్ ల్లో చేజింగ్ లో కోహ్లీ 27 సెంచరీలను సాధించాడు. అందులో 23 సార్లు ఇండియన్ టీం విజయం సాధించడం జరిగింది. ఇక సచిన్ టెండూల్కర్ చేజింగ్ చేసేటప్పుడు 17 సెంచరీలు సాధించగా అందులో మూడు మ్యాచ్ లు ఓడిపోయాయి… అంటే 14 సార్లు విజయం సాధించడం జరిగింది…
గడిచిన 15 సంవత్సరాల నుంచి ఇండియా చాలా మ్యాచులను గెలుస్తూ వస్తుంది అంటే అది వీళ్ళిద్దరి సెంచరీల ప్రభావం వల్లనే గెలుస్తూ వస్తుంది. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ ఇండియన్ టీం లో ఆడినప్పుడు 50.54% ఇండియన్ టీం గెలవడం జరిగింది. ఇక కోహ్లీ టీమ్ లోకి వచ్చిన తర్వాత విన్నింగ్ పర్సంటేజ్ అనేది భారీగా పెరగడం జరిగింది. సచిన్ హయాంలో 50% ఏజ్ ఉన్న విన్నింగ్ రేషియో కోహ్లీ వచ్చిన తర్వాత 61.59 శాతంగా పెరిగింది. సచిన్ 49 సెంచరీలలో 33 సార్లు మ్యాచ్ విజయం సాధించడం జరిగింది. అదే కోహ్లీ 49 సెంచరీలలో 41 సార్లు మ్యాచ్ విజయం సాధించడం జరిగింది.కోహ్లీ సెంచరీలు సాధించిన చాలా సార్లు ఇండియా మంచి విజయాలను అందుకోవడం విశేషం అనే చెప్పాలి…అందుకే కోహ్లీ ని రన్ మిషన్ అని కూడా పిలుస్తు ఉంటారు.
ఇక సచిన్ టెండూల్కర్ 16 దేశాలతో మ్యాచ్ లు ఆడి అందులో 12 దేశాల మీద సెంచరీలు చేయడం జరిగింది… ముఖ్యంగా 44 సెంచరీలను రెగ్యులర్ గా మ్యాచ్ లు ఆడే టీమ్ ల పైన చేయగా, ఒక ఐదు సెంచరీలు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే మ్యాచులు ఆడే టీమ్ ల పైన( సభ్యతం లేని దేశాలు) చేయడం జరిగింది.అందులో కెన్యా పైన నాలుగు సెంచరీలను సాధిస్తే నమీబియాపైన ఒక సెంచరీ చేయడం జరిగింది… ఇక సచిన్ టెండూల్కర్ తాన జీవిత కాలంలో వన్డే ఫార్మాట్ లో ఆస్ట్రేలియా టీం పైన అత్యధికంగా 9 సెంచరీలు చేయడం జరిగింది.
కోహ్లీ మాత్రం రెగ్యులర్ గా ఆడే 9 దేశాల పైననే సెంచరీలు సాధించడం జరిగింది. తను ఆడిన 9 దేశాలలో ప్రతి టీమ్ పైన సెంచరీ చేశాడు… కోహ్లీ శ్రీలంక టీం పైన అత్యధికం గా 10 సెంచరీలు చేశాడు…
ఇలా లెజెండ్స్ ఇద్దరూ కూడా అద్భుతంగా ఆడి ఇండియన్ టీం కి అరుదైన విక్టరీలను అందించారు. ఇక అందులో భాగంగానే 2023 వరల్డ్ కప్ లో జరుగుతున్న మ్యాచు లను బట్టి చూస్తే ఇండియన్ టీం ఈసారి కప్పు కొట్టడం పక్కా అని తెలుస్తుంది. ఇక ఈ వరల్డ్ కప్ లోనే కోహ్లీ కూడా సచిన్ రికార్డు బ్రేక్ చేసి తన 50వ సెంచరీని పూర్తి ుచేసుకుంటాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…