Viral Video: కాస్త సాయంత్రం అయిందంటే చాలు.. మంటలు పుట్టేలా దోమలు కుడుతూ ఉంటాయి. ఇంట్లో దోమల నివారణకు టార్టాయిస్ లేదా ఆలౌట్ లాంటి మిషన్లు ఏర్పాటు చేసుకుంటాం. కానీ బయటకెళ్లిన సమయంలో దోమలు కుడితే ఏమీ చేయలేని పరిస్థితి. అయినా అంతలా దోమలు ఎందుకు ఉంటాయి? అని అనుకుంటారు. కానీ కొన్ని కాదు ఏకంగా దండయాత్ర చేసే విధంగా దోమలు విజృంభించాయి. ఓ నదిపై దోమల గుంపును చూసి ప్రజలు ఉలిక్కిపడ్డారు. అంతేకాకుండా ఆ నగరంలో ఎక్కడికి వెళ్లినా దోమల దాడి తప్పడం లేదు. దీంతో కొందరు అధికారులు పార్కుల్లో, బయట పిల్లలు తిరగడాన్ని నిషేధించారు. ఇంతకీ ఆ నగరాల్లో ఏమైంది? అసలేం జరుగుతోంది? వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు.
మహారాష్ట్రాలోని పూణె ముఠా నదిపై కొందరు ప్రజలు టోర్నడో లాంటి తుపానును చూశారు. కానీ ఇదేదో గాలికి సంబంధించిన తుఫాను కాదు. విజృంభిస్తున్న దోమల గుంపు. వేలాది దోమలు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా ఈ నదిపై ఉండడాన్ని చూసి వణికిపోయారు. ఇవే దోమలు పూణెలోని ముంద్వా, కేశవనగర్, ఖరాడి ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది దోమల బారిన పడి అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
ఈ నేపథ్యంలో కొందరు అధికారులు పిల్లలను పార్కుల్లో, బయట తిప్పరాదని, దీంతో వీరు తొందరగా అనారోగ్యానికి గురవుతారని అంటున్నారు. అయితే దోమల నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఓ వైపు దోమలతో ప్రాణాలు పోయే పరిస్థితిఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దోమల బారిన డెంగ్యూ, చికున్ గున్యా లాంటి వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయని వాపోతున్నారు.
అయితే మరికొందరు మాత్రం దోమల నివారణపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ముఠా నదిపై దోమల విజృంభణకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఇక్కడే కాకుండా పలు ప్రాంతాల్లో దోమలు తీవ్రమయ్యాయని వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Thanks @PMCPune for giving Valentine gift of Mosquitoes Tornado to Keshav Nagar Pune Residents in return to their timely municipality tax payments.#Justiceforkeshavnagar @ThePuneMirror @CMOMaharashtra @PMOIndia @PuneCivic @eshan_tupe @eshan_tupe @WagholiHSA @ShivSenaUBT_ pic.twitter.com/iQxSb5tj8Y
— Rakesh Nayak (@Rakesh4Nayak) February 8, 2024