Vijay Devarakonda : ప్రభాస్ కల్కిలో విజయ్ దేవరకొండ… క్రేజీ రోల్ లో ఊహించని ఎంట్రీ!

కల్కి విడుదల తేదీ కూడా ప్రకటించారు. సమ్మర్ కానుకగా మే 9న విడుదల కానుంది. కల్కి చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

Written By: Gopi, Updated On : January 19, 2024 6:45 pm
Follow us on

Vijay Devarakonda : ప్రభాస్ నుండి మూవీ అంటే అంచనాలు ఆకాశానికి చేరుతాయి. ఈ మధ్య ఆయన డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నారు. ఆదిపురుష్ తో డివోషనల్ జోనర్ ఫస్ట్ టైం టచ్ చేశారు. సలార్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. రూ. 500 కోట్లకు పైగా రూపాయలు కేటాయించినట్లు సమాచారం. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

కల్కి మూవీలో భారీ స్టార్ క్యాస్ట్ నటిస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్ కీలక రోల్ చేయడం ఊహించని పరిణామం. ఆయన నెగిటివ్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ దీపికా పదుకొనె మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. దిశా పటాని మరొక హీరోయిన్. అమితాబ్ సైతం ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు. మరో క్రేజీ హీరో కల్కి మూవీలో నటిస్తున్నాడు అనేది లేటెస్ట్ టాక్.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కల్కి మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నాడంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఆయన ఓ సన్నివేశంలో తళుక్కున్న మెరుస్తారట. కనిపించేది కొన్ని నిమిషాలే అయినా మంచి వెయిట్ ఉన్న రోల్ అంటున్నారు. కల్కి టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రం. హీరో ప్రభాస్ కాలాల్లో ప్రయాణం చేస్తాడట. ఈ క్రమంలో ఓ సన్నివేశంలో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. మరి ఇదే నిజమైతే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం.

కల్కి విడుదల తేదీ కూడా ప్రకటించారు. సమ్మర్ కానుకగా మే 9న విడుదల కానుంది. కల్కి చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. మొదట 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో సమ్మర్ కి వాయిదా వేశారు. ప్రభాస్ కల్కితో పాటు రాజా సాబ్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు.