https://oktelugu.com/

Viral Video : కొండ చరియ మీదపడ్డా కానీ.. టాటా కార్లు అంటే అట్లుంటయి మరీ!

ఓ కారుపై పెద్ద బండరాయి పడినా అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇంతకీ అసలు విషయమేంటంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : March 2, 2024 / 09:49 AM IST

    tata moters video wiral

    Follow us on

    Video Wiral:కారులో ప్రయాణించడం అందరికీ సరదాగే ఉంటుంది. కానీ ఒక్కోసారి జరిగే ప్రమాదాల గురించి చూస్తే ఇందులో వెళ్లాలంటే భయమేస్తుంది. అయితే కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు కార్ల కంపెనీలు రక్షణ ఏర్పాట్లను చేస్తున్నాయి. ముఖ్యంగా కారుకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫ్రంట్ కు వెళ్లకుండా రక్షణగా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇవి ఇతర వాహనాలకు టచ్ కాగానే ఓపెన్ అయి ప్రయాణికులను సురక్షితంగా ఉంచుతాయి. అయితే ఓ కారుపై పెద్ద బండరాయి పడినా అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇంతకీ అసలు విషయమేంటంటే?

    భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ ప్రాంతం ఎంతో చల్లగా ఉంటుంది. ఇక్కడున్న అందమైన ప్రదేశాలను చూసేందుకు నిత్యం ప్రజలు వెళ్తుంటారు. అయితే ఇక్కడి ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా గుట్ల మధ్య ఉండేరోడ్లపై వాహనాల్లో వెళాల్సి ఉంటుంది. ఈ వాహనం అదుపు తప్పితే కంటికి కనిపించని లోయలో పడాల్సి వస్తుంది. అందువల్ల ఇక్కడ చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. ఇక వర్షాల సమయంలో మరీ ప్రమాదం. ఎందుకంటే?

    ఈ సమయంలో కొండచరియలు విరిగిపడుతూ ఉంటాయి. ఎటువైపు నుంచి ఏ విధంగా బండరాయి వచ్చి మీదపడుతుందో తెలియని పరిస్థితి. అయితే కొన్ని రోజుల కింద ఓ కుటుంబం కారులో ఇలాంటి కొండ ప్రాంతాల్లో ప్రయాణించింది. అయితే ఒక్కసారిగా పైనుంచి వచ్చిన పెద్ద బండరాయి కారుపై పడింది. దీంతో ఆ కారు నుజ్జునుజ్జయింది. వెనుక ఉన్న వారు ఈ కారుపై పడిన బండరాయితో అందులో ఉన్న వారు మరణించారని అనుకున్నారు. కానీ అందులో నుంచి ప్రయాణికులు ఏమాత్రం చిన్న గాయం లేకుండా బయటకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిచింది.

    ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని ఆ కారు కంపెనీ క్యాచ్ చేసుకుంది. ఎందుకంటే అంతపెద్ద బండరాయి పడినా కారు నుజ్జునుజ్జయినా ప్రయాణికులు మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ వారు ఈ వీడియో షేర్ చేస్తూ ‘కొండ చరియ మీదపడ్డా.. టాటా కార్లు అంటే అట్టుంటాయి.. మరీ’.. అని క్యాప్షన్ పెట్టారు. మొత్తానికి టాటా కార్లకు రక్షణ ఎక్కువగా ఉందని ఆ కంపెనీ వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు.