https://oktelugu.com/

Video Viral: బంగారు పళ్లెం’లో భోజనం పెట్టారు.. వీడియో వైరల్..

ఇక్కడ నిజంగానే బంగారం రంగులో ఉన్న పల్లెంలో భోజనం పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..

Written By:
  • Srinivas
  • , Updated On : February 20, 2024 / 12:46 PM IST

    video Wiral

    Follow us on

    Video Viral: పెళ్లంటే నూరేళ్ల పంట.. ఈ వేడుక కలకాలం గుర్తుండాలని వైభవంగా నిర్వహించుకుంటారు. కొందరు పెళ్లిని సాధారణంగా నిర్వహించుకుంటే మరి కొందరు మాత్రం పదిమందికి గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహిస్తారు. ఒకప్పుడు పెళ్లి వైభవం వారం రోజుల పాటు సాగేది. అయితే ఇప్పుడు కొన్ని రోజులు నిర్వహించుకున్నా.. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారని చెప్పొచ్చు. సాధారణంగా బంగారం పల్లెంలో భోజనం అనే పదం వస్తుంది. వెటకారంగా మాట్లాడేటప్పుడు దీని వాడుతారు. కానీ ఇక్కడ నిజంగానే బంగారం రంగులో ఉన్న పల్లెంలో భోజనం పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..

    Adarsh Hegde అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోల పెళ్లికి వచ్చిన అతిథుల ముందు నెమలి ఆకారంలో ఉన్న పాత్రలు ఉన్నాయి. అయితే ముందుగా వీటిని చూసి ఆకర్షణీయంగా అక్కడ పెట్టారని అనుకున్నారు. కానీ అవి అతిథులు భోజనం చేసే పళ్లాలు. ఇందులో వారికి భోజనం వడ్డించారు. ఈ వడ్డింపును చూసి అతిథులు ఎంతో మురిసిపోయారు. ఈ వీడియోను దాదాపు లక్ష మంది వీక్షించారు.

    ఈ వీడియోపై కొందరు ప్రశంసలు కురిపించారు. పెళ్లిని ఎంతో వైభవంగా నిర్వహించారని అంటున్నారు. మరికొందరు మాత్రం ఓ వైపు కరువు తాండవిస్తుండగా.. డబ్బును ఇలా వృథాగా ఖర్చు చేయడం దేనికి? అని విమర్శిస్తున్నారు. గతంలోనూ పెళ్లిళ్లపై ఎక్కువగా ఖర్చు చేయొద్దన్న కొందరు వాదించారు. కానీ తమ జీవితంలో జరిగే అరుదైన వేడుక ఇదేనని భావిస్తూ పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఏదీ ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

    https://twitter.com/adarshahgd/status/1633111006451834880