https://oktelugu.com/

KTR : కొత్త ప్రచారం.. గంగవ్వతో నాటు కోడి కూర వండిన కేటీఆర్.. మంచి ధావత్.. వైరల్ వీడియో

రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉంటూ.. ఎప్పుడూ గరిట పట్టని కేటీఆర్ పొలాల మధ్యన స్వయంగా టమాటాలు కోసి.. నాటు కోడి కూర వండడం విశేషంగా చెప్పొచ్చు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2023 / 03:03 PM IST
    Follow us on

    KTR : మంత్రి కేటీఆర్ రూటు మార్చాడు. ఎన్నికల ప్రచారానికి కాదెవరు అనర్హం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు కలవని వారిని.. కలుసుకోకూడదనుకున్న వారిని సైతం కలుస్తూ తనవంతు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ యాసతో జగిత్యాల జిల్లాలో ఫేమస్ అయిన ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ చానెల్ తో ఓ మంచి కార్యక్రమం నిర్వహించి అందరినీ ఫిదా చేశారు. గంగవ్వతో కలిసి నాటు కోడి కూర వండి మరీ వాళ్లకు ధావత్ ఇచ్చారు.

    పచ్చటి పొలాల మధ్యన నిర్వహించిన ఈ ధావత్ కు కేటీఆర్ నడుచుకుంటూ వచ్చేశాడు. మై విలేజ్ షోలో పాల్గొనే నటులతో కలిసి సందడి చేశారు. ముఖ్యంగా గంగవ్వతో కలిసి తన పర్సనల్, రాజకీయ విషయాలను పంచుకుంటూనే ఆసక్తి గొలిపేలా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ విధానాలు, తాము అధికారంలోకి వచ్చిన పనులు.. ఇలా కోడి కూర ధావత్ లోనే అన్ని పంచుకున్నారు. అటు ప్రచారానికి ప్రచారం.. ఇటు యూట్యూబర్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు పని కానిచ్చేశారు.

    రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉంటూ.. ఎప్పుడూ గరిట పట్టని కేటీఆర్ పొలాల మధ్యన స్వయంగా టమాటాలు కోసి.. నాటు కోడి కూర వండడం విశేషంగా చెప్పొచ్చు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.