https://oktelugu.com/

Saindhav Review : సైంధవ్ మూవీ యూఎస్ఏ రివ్యూ…

ఇక ఈ సినిమాతో శైలేష్ హిట్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అనే కాకుండా యాక్షన్ సినిమాలను కూడా చాలా బాగా డీల్ చేస్తాడు

Written By:
  • Gopi
  • , Updated On : January 12, 2024 5:27 pm
    Follow us on

    Saindhav Review : సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఆ సినిమాల ట్రైలర్ మనల్ని సినిమా చూడటానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో శైలేష్ కొలన్ దర్శకత్వంలో వచ్చిన సైంధవ్ సినిమా ఒకటి. ఈ సినిమా ఇండియా లో రేపు రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పటికే యూఎస్ఏ లో ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు.మరి అక్కడున్న ప్రేక్షకులు చెప్తున్న దాని ప్రకారం ఈ సినిమా ఎలా ఉంది. వెంకటేష్ కి ఒక మంచి హిట్ దక్కిందా..? నవాజద్ధిన్ సిద్ధికి క్యారెక్టర్ ఈ సినిమా కి ఏమైనా హెల్ప్ అయిందా..? శైలేష్ కొలన్ డైరెక్షన్ ఎలా ఉంది అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

    ఇక ముందుగా ఈ సినిమా కథ లోకి వెళ్తే ఒక సైకో పర్సన్ అయిన సైంధవ్ (వెంకటేష్),మనోజ్ఞ (శ్రద్ధ శ్రీనాథ్) దంపతులకు గాయత్రి అనే ఒక పాప ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్న సమయంలో ఆ పాపకి ఒక వ్యాధి సోకుతుంది. దాంతో ఆ పాపకి ఆ వ్యాధి క్యూర్ అవడానికి 17 కోట్లు పెట్టి ఒక ఇంజక్షన్ ని చేయించాల్సి ఉంటుంది. ఇక దానికోసం వెంకటేష్ విపరీతమైన ప్రయత్నాలు చేస్తు చాలా తాపత్రయ పడుతుంటాడు.అయితే మిడిల్ క్లాస్ లైఫ్ ని అనుభవిస్తున్న వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు దాంతో ఇంజక్షన్ వేయించడం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇక ఇది ఇలా ఉంటే వెంకటేష్ కి అంతకుముందు వికాస్ మాలిక్ (నవజాద్దిన్ సిద్ధికి)తో కొన్ని గొడవలు అయితే ఉంటాయి. ఆ గొడవలకి ఈ పాప వ్యాధికి మధ్య సంబంధం ఏంటి వెంకటేష్ తన పాపకి ఇంజక్షన్ చేయించి ఆ పాప ని బతికించుకున్నాడా లేదా అనే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో ఈ కథ సాగనున్నట్టు గా తెలుస్తుంది…

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని డైరెక్టర్ శైలేష్ కోలన్ చాలా కొత్తగా తెరకెక్కించాడట. ఇక ఈ సినిమాలో ఒక తండ్రి తన కూతురు కోసం ఎక్కడి దాకా అయినా వెళ్తాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించడమే కాకుండా చాలా ట్విస్ట్ లను కూడా ఈ సినిమాలో పొందుపరిచి సగటు ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ సినిమాని నడిపించడంలో తను సక్సెస్ అయ్యాడనే చెతున్నారు. ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు క్యూరియాసిటీతో సీట్ ఎడ్జ్ మీద కూర్చోని సినిమాని చూసేలా ఈ స్టోరీ ని డిజైన్ చేసినట్టు గా తెలుస్తుంది.నిజానికి వెంకటేష్ ఈ సినిమాలో సైకో టైప్ ఆఫ్ పాత్రను పోషించాడు అని చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నవజద్ధిన్ సిద్ధికి క్యారెక్టర్ కూడా చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉందట వెంకటేష్ కి పోటీగా నవజద్దిన్ సిద్ధికి చేసే ప్రయత్నాలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తాయట…

    ఇక నటినటుల పార్ఫా మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాగైతే ఉంటారో అలాంటి పాత్రను పర్ఫెక్ట్ గా పోట్రే చేశారు. అలాగే ఇది నవాజద్ధిన్ సిద్ధికి సరికొత్త క్యారెక్టర్ తో తెలుగులో ఇంట్రడ్యూస్ అయ్యాడని అంటున్నారు. ఆయన తెలుగులో ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్తున్నారు. ఇక తమిళ హీరో ఆయన ఆర్య కూడా ఇందులో మానస్ అనే పాత్ర లో నటించాడు. అలాగే ఈ సినిమాలో తన నటన తో మెప్పించినట్టు గా తెలుస్తుంది…

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సంతోష్ నారాయణన్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యిందట ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వెంకటేష్ కి పాపకి మధ్య వచ్చే సెంటిమెంటల్ సీన్స్ నిచాలా బాగా ఎలివేట్ చేసేలా ఉన్నాయట. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కి ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా హెల్ప్ అయిందంటూ చెప్తున్నారు… ఇక సినిమాటోగ్రాఫర్ మణికందన్ అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయట. అలాగే వెంకటేష్ కి పాపకి మధ్య ఉన్న ఇంటిమసీని చూపించడంలో విజువల్స్ కూడా చాలా వరకు హెల్ప్ అయ్యాయట…ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ గా ఉన్నాయని తెలుస్తుంది…

    ఇక ఈ సినిమాతో శైలేష్ హిట్ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అనే కాకుండా యాక్షన్ సినిమాలను కూడా చాలా బాగా డీల్ చేస్తాడు అంటూ యూఎస్ఎ అభిమానులు చెప్తున్నారు.ఇక ఈ సినిమా అక్కడి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది మరీ ఇండియన్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో చూడాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు…