https://oktelugu.com/

Venuswami – AP Elections : వేణుస్వామి జ్యోతిష్యం : ఏపీలో 2024, 2029లో గెలుపు వీరిదే

అయితే ఇంత జరిగినా వేణు స్వామి జ్యోతిష్యం మానరా? ఈయనను నమ్మి బిఆర్ఎస్ శ్రేణులు మోసపోయాయని.. ఇప్పుడు ఆ వంతు వైసీపీ శ్రేణులకు వచ్చిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : January 22, 2024 / 07:51 PM IST

    Venu Swami AP Elections

    Follow us on

    Venuswami – AP Elections : ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతోంది జ్యోతిష్యుడు వేణు స్వామి. సినీ, రాజకీయ సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెప్పే వేణు స్వామి జోష్యాలు చాలా వరకు జరిగాయి. దీంతో ఆయన పేరు మార్మోగిపోయింది. అయితే తెలంగాణ ఎన్నికల్లో ఆయన జోష్యం తేలిపోయింది. మూడోసారి కెసిఆర్ అధికారంలోకి వస్తారని ఆన్ లైన్ వేదికగా వేణు స్వామి తెగ జోష్యాలు చెప్పారు. యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో అయితే సవాల్ చేసి మాట్లాడారు. తీరా కేసిఆర్ అధికారం కోల్పోయేసరికి సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యారు. నెటిజన్లు తెగ ఆడేసుకున్నారు. ఎక్కడ వేణు స్వామి అంటూ ఆరా తీస్తున్నారు.

    వేణు స్వామి అంటే చాలామందికి నమ్మకం. ఆయన చెప్పింది నిజమవుతుందనే నమ్మేవారు అధికం. అందుకే పొలిటీషియన్లు, సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పి చెప్పి ఆయనే ఓ సెలబ్రిటీగా మారిపోయారు. చివరకు సినిమా తారలు కూడా ఆయనతో పూజలు చేయించేటంతగా మారిపోవడం విశేషం. ఆయన రాజకీయాల గురించి ఏం చెప్పినా నిజమేనని నమ్మేటంత పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని.. కేటీఆర్ సీఎం అవుతారని.. కెసిఆర్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని డైరెక్టుగానే గ్రహగతులను అంచనా వేసి చెప్పారు. దీంతో ఫలితాలు అనుకూలంగా వస్తాయని బీఆర్ఎస్ అభిమానులు అంచనా వేశారు. తీరా ఫలితాలు ప్రతికూలంగా వచ్చేసరికి వేణు స్వామి పై అందరూ చూడడం ప్రారంభించారు. ఆయన ఎక్కడైనా కనిపిస్తాడేమోనని ఎదురుచూస్తున్నారు.

    మంత్రాలకు చింతకాయలు రాలవు.. జోష్యాలు పనిచేయవని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన జోష్యం అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇంత జరిగాక కూడా వేణు స్వామి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 2024, 2029 ఎన్నికల్లో ఏపీలో జగన్ అధికారంలోకి వస్తారని జోష్యం చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ గుచ్చి గుచ్చి వేణు స్వామి నుంచి సమాధానాలు రాబట్టారు. జగన్ గెలుస్తాడని చెబుతున్న వేణు స్వామి ఆయన పేరు చెప్పేందుకు మాత్రం తట పటాయించారు. యాంకర్ గట్టిగా అడిగేసరికి.. 2024, 2029 ఎన్నికల్లో వరుసగా జగన్ అధికారంలోకి వస్తారని.. రాసి పెట్టుకోండని.. రికార్డ్ చేసి ఉంచుకోండి అని సవాల్ చేశారు. దీంతో యాంకర్ ఒక్కసారిగా నవ్వడంతో విసుక్కున్నారు. అయితే ఇందులో కొసమెరుపు ఏమిటంటే.. కెసిఆర్ స్థాయికి జగన్ చేరుకుంటారని చెప్పడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. అయితే వైసిపి అనుకూల సోషల్ మీడియాలో వేణు స్వామి జోష్యం ట్రోల్ అవుతుండగా.. చంద్రబాబు ఏడుస్తున్న వీడియో మీమ్స్ ను జత చేసి పోస్ట్ చేశారు. అయితే ఇంత జరిగినా వేణు స్వామి జ్యోతిష్యం మానరా? ఈయనను నమ్మి బిఆర్ఎస్ శ్రేణులు మోసపోయాయని.. ఇప్పుడు ఆ వంతు వైసీపీ శ్రేణులకు వచ్చిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.