https://oktelugu.com/

Saindhav Teaser : సైంధవ్ టీజర్ రివ్యూ: లెక్క మరుద్ధిరా నా కొడకల్లారా, వెంకీ విశ్వరూపం!

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఫస్ట్ టైం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన విలన్ రోల్ చేశారు. జిషు సేన్ గుప్తా, ముఖేష్ రిషి కూడా విలన్స్ గా నటించారు. టీజర్లో వీరి నటన ఆకట్టుకుంది

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2023 / 12:51 PM IST
    Follow us on

    Saindhav Teaser : హీరో వెంకటేష్ సోలోగా సినిమాలు చేయడం లేదు. చేసినా వయసుకు తగ్గ స్క్రిప్ట్ ఎంచుకుంటున్నాడు. ఆయన పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసి చాలా కాలం అవుతుంది. 75వ చిత్రం మాత్రం ప్రత్యేకంగా ప్లాన్ చేశాడు. దర్శకుడు శైలేష్ కొలను సైంధవ్ టైటిల్ తో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కిస్తున్నాడు. సైంధవ్ సంక్రాంతి బరిలో దిగనుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. సైంధవ్ టీజర్ నేడు విడుదలైంది.

    టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కూతురు, భార్యతో ఆనందంగా గడుపుతున్న హీరో జీవితం కొందరి కారణంగా చిన్నాభిన్నం అవుతుంది. ఓ మాఫియా పైకి వన్ మాన్ ఆర్మీగా వెంకటేష్ యుద్ధం మొదలుపెడతాడు. చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి. వాళ్ళకు ఆయుధాలతో శిక్షణ ఇచ్చి టెర్రరిస్ట్స్ గా మార్చే ఓ గ్యాంగ్ పై హీరో తిరగబడతాడని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

    బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఫస్ట్ టైం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన విలన్ రోల్ చేశారు. జిషు సేన్ గుప్తా, ముఖేష్ రిషి కూడా విలన్స్ గా నటించారు. టీజర్లో వీరి నటన ఆకట్టుకుంది. వెంకీ భార్యగా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. ఓ పాత్రలో రుహాణి శర్మ నటిస్తుంది. ఇక టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేశారు. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. వెంకీ యాక్షన్ హీరో అవతార్ అదిరింది. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

    మొత్తంగా సైంధవ్ టీజర్ అంచనాలకు మించి ఉంది. వెంకీ సోలోగా భారీ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న విడుదల కానుంది. మరి సంక్రాంతికి వెంకీ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. దర్శకుడు శైలేష్ కొలను హిట్, హిట్ 2 చిత్రాలతో టాలీవుడ్ ని ఆకర్షించాడు. ఆయన నుండి వస్తున్న మూడో చిత్రం సైంధవ్. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.