Saindhav Review: సైంధవ్ ఫుల్ మూవీ రివ్యూ…

ప్రతి హీరో అభిమాని కూడా వెంకటేష్ ని చాలా ఇష్ట పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏ హీరో గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడాడు. అలాగే ఈగో లు పెట్టుకొని వేరే హీరోలతో సినిమాలు చేయడానికి అసలు వెనకడుగు వేయరు.

Written By: Gopi, Updated On : January 13, 2024 11:16 am

Saindhav Review

Follow us on

Saindhav Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అదే వెంకటేష్ అనే చెప్పాలి. హీరోలందరి కి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అందులో సగం మంది అయిన హేటర్స్ ఉంటారు. కానీ వెంకటేష్ కి మాత్రం యాంటీ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి హీరో అభిమాని కూడా వెంకటేష్ ని చాలా ఇష్ట పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏ హీరో గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడాడు. అలాగే ఈగో లు పెట్టుకొని వేరే హీరోలతో సినిమాలు చేయడానికి అసలు వెనకడుగు వేయరు.

 

అందుకే ఆయనని ప్రతి అభిమాని కూడా ఆరాధిస్తూ ఉంటాడు. ఇతను ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు,రామ్ , వరుణ్ తేజ్ లాంటి హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలను చేశాడు. ఇక వెంకటేష్ నుంచి ఒక సినిమా వచ్చిందంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమా మీద మంచి అంచనాలను పెట్టుకుంటు ఉంటారు. ఇక అలాంటి వెంకటేష్ నుంచి సంక్రాంతికి ఒక సినిమా వచ్చిందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి పండగనే చెప్పాలి. ఇక సంక్రాంతి కానుకగా ఈరోజు రిలీజ్ అయిన సైంధవ్ సినిమా ఎలా ఉంది ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా ఈ సినిమాకి సంక్రాంతి విన్నర్ గా నిలిచే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

 

కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సైంధవ్ (వెంకటేష్) అనే వ్యక్తి తన భార్య మనోజ్ఞ అలాగే తన కూతురు అయిన గాయత్రి తో కలిసి ఒక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు.అలాగే తన కూతురు అంటే తనకి ప్రాణం అందుకే తనే రోజు ఆ పాప ని స్కూల్లో డ్రాప్ చేసి మళ్లీ ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు.ఇలాంటి ఒక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న సమయంలో ఒకరోజు పాప స్పృహ తప్పి కింద పడిపోతుంది.ఇక అప్పుడు ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్తే వెంకటేష్ కు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అది ఏంటి అంటే ఆ పాప ‘న్యూరో మస్క్యులర్’ అనే వ్యాధితో బాధపడుతుంది.

 

ఇక దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఈ వ్యాది తగ్గడానికి దానికి ఒక ఇంజక్షన్ చేయల్సి ఉంటుంది. ఇక అలా అయితేనే ఈ పాప బతుకుతుందని డాక్టర్లు చెప్తారు. అయితే ఇంజక్షన్ ఖరీదు 17 కోట్లు మిడిల్ క్లాస్ లైఫ్ ని లీడ్ చేసే సైంధవ్ దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి తన కూతురు ని బతికించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో వికాస్ మల్లిక్(నవాజుద్దీన్ సిద్ధికి) తన కూతురు బతికే ఇంజక్షన్ తన దగ్గర ఉందని దానికి సైంధవ్ ని ఒక పని చేయమని చెప్తాడు. అది ఏంటి అంటే ఇంతకు ముందు సైంధవ్ కి వికాస్ మల్లిక్ కి మధ్య జరిగిన ఒక గొడవలో వికాస్ మల్లిక్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కంటైనర్ ని సైంధవ్ దాచిపెడతాడు దాన్ని తీసుకొచ్చి తనకి ఇచ్చి ఇంజక్షన్ తీసుకొని వెళ్ళమని చెప్తాడు. మరి సైంధవ్ కి వికాస్ మల్లిక్ కి మధ్య గొడవ ఏంటి..? సైంధవ్ వికాస్ కంటైనర్లు ఎందుకు దాచి పెట్టాడు..మొత్తానికైతే సైంధవ్ తన కూతుర్ని బతికించుకున్నాడా లేదా అనే ఫుల్ స్టోరీ మీకు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక డైరెక్టర్ శైలేష్ కొలన్ అంటే మనకు ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు హిట్, హిట్ 2 అనే రెండు సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఈ సినిమాని స్టార్ట్ అయిన మొదట 30 నిమిషాల వరకు చాలా స్లో నేరేషన్ తో తీసుకెళ్లాడు. ఒక్కో క్యారెక్టర్ ని బిల్డ్ చేయడానికి తనకు చాలా సమయం పట్టింది. అయితే క్యారెక్టర్ ని అంత బిల్డ్ చేయడానికి ఎందుకు అంత సమయం తీసుకున్నాడు అనే ఆలోచన మనకి కలుగుతుంది. అయినప్పటికీ ఆ తర్వాత ఆయన చూపించిన కథ ప్రకారం చూస్తే ఆయన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం ఆయన ఎక్కువ టైం చేసుకోవడంలో తప్పు లేదు అనిపిస్తుంది. ఇక ఫస్ట్ ఆఫ్ స్లో నేరేషన్ తో నడిచిన ఈ సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చిన్నపాటి ట్విస్ట్ ఇచ్చి వదిలేసిన శైలేష్ కొలన్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా గట్టిగా రాసుకున్నాడు. ప్రతి సీను కూడా ఇంట్రెస్టింగ్ గా కి ఉంటుంది. అయితే ఇలాంటి క్రమంలో విలన్ కి హీరో కి మధ్య యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం చాలా అద్భుతంగా తెరకెక్కించారు.

 

అలాగే విలన్ కి హీరో కి మధ్య జరిగే పోటీలో ఎవరు ఎవరిపై ఆధిపత్యం వహిస్తారు అనేది కూడా చాలా క్యూరియాసిటితో రాసుకున్నారు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ కొన్ని సీన్లు మాత్రం లాగేయ్యాయి. అది ఎడిటర్ ఫాల్టా లేకపోతే కావాలనే సినిమాలో అలా ఉంచారో తెలియదు కానీ మధ్య మధ్యలో కొన్ని కొన్ని సీన్లు మాత్రం చాలా లాగైనట్టుగా అనిపిస్తుంది. ఇక అక్కడక్కడ కొన్ని సీన్లు లాగ్ అవ్వడం వల్ల సినిమా చూసే ప్రేక్షకులకి సినిమా మీద ఇంట్రెస్ట్ పోయే అవకాశం కూడా ఉంది.ఇక మొత్తానికి అయితే ఈ సినిమాని ఒక మంచి సినిమాగా శైలేష్ కొలన్ తెరకెక్కించాడు… ఇక యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి…

నటీనటుల పర్ఫామెన్స్…

ఇక నటినటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో వెంకటేష్ చాలా అద్భుతమైన నటనని కనబరిచాడు. ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటికంటే కూడా ఈ సినిమాలో భిన్నమైన నటనని చూపించాడు. వెంకటేష్ తర్వాత విలన్ గా చేసిన నవాజుద్దీన్ సిద్ధికి కూడా తన నటనతో మెప్పించడమే కాకుండా ఒక కొత్త విలన్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కొన్ని సీన్లలో అయితే ఆయన డైలాగులు చెప్పకుండా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో మాత్రమే తన విలనిజాన్ని పండించాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఈ సినిమాలో నటనపరంగా ఎలాంటి హవా భావాలు పలికించాడో…ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ తనదైన పాత్రలో నటించి మెప్పించింది. ఇక మిగిలిన క్యారెక్టర్లు అన్నీ కూడా చిన్నచిన్న క్యారెక్టర్లే కావడంతో వాళ్లకి పరిధి మేరకు నటించారు…

 

టెక్నికల్ అంశాలు…

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ చాలా వరకు సినిమాకి హెల్ప్ అయ్యింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని సీన్ల ను చాలా బాగా ఎలివేట్ చేసింది. సంతోష్ నారాయణన్ ఇంతకుముందు చాలా సినిమాలకి మ్యూజిక్ ఇచ్చినప్పటికీ ఈ సినిమాలో కొత్త పంథా లో మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇక మణికందన్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది వెంకటేష్ ని చాలా అద్భుతంగా చూపించడమే కాకుండా కొన్ని సీన్లలో ఉన్న మూడుని ఆయన తన విజువల్స్ తో చాలా బాగా కాపాడాడు… గ్యారీ ఎడిటింగ్ పనితనం బాగా కనిపించినప్పటికీ కొన్ని సీన్లు మాత్రం లాగ్ అయ్యాయి వాటిని కొంచం షార్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండేది…

ప్లస్ పాయింట్స్

ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే

వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధికి
డైరెక్షన్
బిజిఎం
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్

ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే

స్లో నరేషన్
కొన్ని సీన్లు లాగయ్యాయి

ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ లేవు కాబట్టి ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు…

రేటింగ్…
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్ : యంగ్ స్టర్స్ కి పోటినిస్తూ సక్సెస్ కొట్టిన వెంకటేష్…