https://oktelugu.com/

Venkatesh Daggubati : వెంకటేష్ చిన్న కూతురు మెహందీ వేడుక… వైరలవుతున్న ఫోటోలు…

ఇక ఇది ఇక ఉంటే వీళ్ళ ఇంట్లో ఏ ఈవెంట్ జరగాలన్న వెంకటేష్ నిర్ణయం తో పాటు, వాళ్ళ అన్నయ్య అయిన దగ్గుపాటి సురేష్ బాబు నిర్ణయానికి కూడా వెంకటేష్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. వాళ్ళ నాన్న రామానాయుడు గారు లేకపోవడంతో వెంకటేష్ ఏ విషయం అయిన సురేష్ బాబు తో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఫైనల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సంబంధాన్ని కూడా సురేష్ బాబు దగ్గరుండి మరి ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది...

Written By:
  • NARESH
  • , Updated On : March 15, 2024 / 09:16 PM IST
    Follow us on

    Venkatesh Daggubati : విక్టరీ వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతని చిన్న కుమార్తె అయిన ‘హవ్యవాహిని’ పెళ్లికి ముందు మెహందీ ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది. గత సంవత్సరం అక్టోబర్ లో విజయవాడ కు చెందిన డాక్టర్ నిశాంత్ తో హవ్య వాహిని ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక దీనికి మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం హాజరయ్యారు. ఇక ఎంగేజ్ మెంట్ కి ఏ మాత్రం తగ్గకుండా వెంకటేష్ ఇప్పుడు పెళ్లి వేడుకను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నాడు…

    ఇక అందులో భాగంగానే మెహందీ ఈవెంట్ ని కూడా చాలా రీచ్ జరిపారు. ఇక దీనికి మహేష్ బాబు సతీమణి అయిన నమ్రత,అలాగే కూతురు సితార లు హాజరయ్యారు. ఇక వాళ్లతో పాటుగా చాలామంది ప్రముఖులు కూడా ఈ ఈవెంట్ కి హాజరవ్వడం విశేషం… ఇప్పుడు వాళ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి… ఇక విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ సినిమాలను చేస్తూ ఫ్యామిలీ లకు బాగా దగ్గరైన హీరో…

    ఆయన మొదటి నుంచి కూడా తన కుటుంబాన్ని సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంచుతున్నారు. అందుకే ఆయన పిల్లలు గాని, ఆయన సతీమణి గానీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇక ఇది ఇలా ఉంటే వాళ్ల పెళ్లిళ్ల విషయాల్లో మాత్రం వెంకటేష్ చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ తో అసలు సంబంధం లేని బయటి వ్యక్తులకు ఇచ్చి వాళ్ల పిల్లల పెళ్లి చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చిన్న కుమార్తె అయిన హవ్యవాహిని ని ఒక డాక్టర్ కి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు.

    ఇక ఇది ఇక ఉంటే వీళ్ళ ఇంట్లో ఏ ఈవెంట్ జరగాలన్న వెంకటేష్ నిర్ణయం తో పాటు, వాళ్ళ అన్నయ్య అయిన దగ్గుపాటి సురేష్ బాబు నిర్ణయానికి కూడా వెంకటేష్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. వాళ్ళ నాన్న రామానాయుడు గారు లేకపోవడంతో వెంకటేష్ ఏ విషయం అయిన సురేష్ బాబు తో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఫైనల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సంబంధాన్ని కూడా సురేష్ బాబు దగ్గరుండి మరి ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది…