https://oktelugu.com/

Varun Tej – Lavanya wedding : వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి ఫొటోలు వైరల్

ఇక ఈనెల 5న వరుణ్-లావణ్యల రిసెప్షన్ హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ లో జరుగనుంది. దానికి ఇక్కడి అతిథులందరినీ ఆహ్వానించనున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2023 / 11:51 AM IST
    Follow us on

    Varun Tej – Lavanya wedding : వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇటలీ వేదికగా నవంబర్ 1న వరుణ్-లావణ్యల వివాహం ఘనంగా జరిగింది. వీరిది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. 2017లో వచ్చిన మిస్టర్ సినిమా షూటింగ్లో వీరిద్దరి మనసులు కలిశాయి. ఈ ప్రేమకథ ఐదేళ్లకు పైగా రహస్యంగా సాగింది. లావణ్య వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులకు కూడా దగ్గరవుతూ వచ్చింది. 2020లో నిహారిక వివాహం రాజస్థాన్ లో జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే లావణ్య, రీతూ వర్మ హాజరుకావడం చర్చకు దారి తీసింది.

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ప్రియురాలు లావణ్య త్రిపాఠిని ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఈ కొత్త జంట ఫొటోలను నెట్టింట పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. చూడముచ్చటగా ఉన్నారంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

    ఇక ఈనెల 5న వరుణ్-లావణ్యల రిసెప్షన్ హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ లో జరుగనుంది. దానికి ఇక్కడి అతిథులందరినీ ఆహ్వానించనున్నారు.