Varun-Lavanya Tripathi Reception : హీరో వరుణ్ తేజ్ ఒక ఇంటివాడయ్యాడు. ఆయన లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నారు. నవంబర్ 1న ఇటలీ వేదికగా వివాహం జరిగింది. పెళ్ళికి కుటుంబ సభ్యులు మాత్రమే ఆహ్వానం దక్కింది. మూడు రోజులు పెళ్లి వేడుక నిర్వహించారు.
#VarunLav wedding reception at N Convention HYD ! pic.twitter.com/MSYf3HhuLe
— Rajesh Manne (@rajeshmanne1) November 5, 2023
Megastar #Chiranjeevi entry at #VarunLav Wedding Reception! pic.twitter.com/qQ3MSvmqOF
— Rajesh Manne (@rajeshmanne1) November 5, 2023
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యారు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక పెళ్ళిలో సందడి చేశారు.
ఇక చిత్ర ప్రముఖుల కోసం నవంబర్ 5 రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వరుణ్-లావణ్యల వివాహ రిసెప్షన్ కి టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. వెంకటేష్, నాగ చైతన్య, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, అలీ, సుబ్బరాజ్, సునీల్, సుకుమార్, కార్తికేయ, సందీప్ కిషన్, రీతూ వర్మ, అల్లు శిరీష్, సుశాంత్, అశ్వినీ దత్, వైష్ణవ్, సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు.
అలాగే దిల్ రాజు, గుణశేఖర్, బోయపాటి శ్రీను, నవీన్ చంద్ర, టి సుబ్బిరామిరెడ్డి, జయసుధ, సంపత్ నంది, మురళీ మోహన్, నాగవంశీ, అడివి శేష్, యాంకర్ సుమతో పాటు పలువురు ఈ వేడుకలో సందడి చేశారు. నవదంపతులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి డిజైనర్ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. నిహారిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పసందైన వంటకాలతో ఘనంగా వేడుక జరిగింది. కొందరు స్టార్స్ షూటింగ్స్ లో బిజీగా ఉండటం వలన హాజరు కాలేకపోయారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న నటులు, సాంకేతిక నిపుణులు వరుణ్ తేజ్ వివాహ రిసెప్షన్ కి హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. వరుణ్, లావణ్య ఐదేళ్లకు పైగా లవ్ లో ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా సెట్స్ లో కలిసిన లావణ్య-వరుణ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ పరిచయం మెల్లగా ప్ర ప్రేమకు దారి తీసింది. జూన్ 9న ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.