https://oktelugu.com/

Valentine’s day: టెడ్డీ అనేది బొమ్మ కాదు.. ప్రేమకు అది ప్రతిరూపం

వాలంటైన్ వీక్ సందర్భంగా నిర్వహించే టెడ్డీ డే ప్రేమికులకు చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే ఈరోజు వారు ఒకరికి ఒకరు టెడ్డీ లను ఇచ్చిపుచ్చుకుంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2024 11:08 pm
    Follow us on

    Valentine’s day : ప్రేమంటే హృదయంలో ఉప్పొంగే సంఘర్షణ. అది అనంతమైన భావాల సమరం. అలాంటి ప్రేమలో మునిగితేలే ప్రేమికులు ఎన్నో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ప్రేమకు గుర్తుగా భద్రపరచుకుంటారు. అలాంటి ప్రేమికులు భద్రపరచుకొనే బహుమతుల్లో ముందు వరుసలో ఉండేది టెడ్డీ. పేరుకు అది ఒక దూది బొమ్మ కావచ్చు. కానీ అది అనంతమైన భావాలకు ప్రతిరూపం. అందుకే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిర్వహించుకునే వేడుకల్లో మూడవరోజు ప్రేమికులు పరస్పరం టెడ్డీలను ఇచ్చి పుచ్చుకుంటారు. మనదేశంలో కంటే ఇలా టెడ్డీ బొమ్మలను ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి పాశ్చాత్య దేశాలలో అధికంగా ఉంటుంది. అందుకే దీనిని వారు ఒక వేడుకగా జరుపుకుంటారు.

    టెడ్డీ లు పుచ్చుకునే సంస్కృతి వెనకటి రోజుల్లో ఉండేది కాదు. అప్పట్లో ఈ స్థాయిలో స్వేచ్ఛ ఉండేది కాదు కాబట్టి.. ప్రేమికులు రాసిన బహుమతులు ఇచ్చిపుచ్చుకునేవారు.. అందులో రోజా పూలు ముందు వరుసలో ఉండేవి. ఆర్థిక స్తోమత ఉన్నవారు రోజాపూలకు మించిన బహుమతులు ఇచ్చిపుచ్చుకునేవారు. కాలం గడుస్తున్న కొద్దీ ప్రేమికుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. అందువల్లే వారు టెడ్డీలను బహుమతులుగా మార్చారు. ముఖ్యంగా ఈ టెడ్డీలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మృదువుగా, అందంగా ఉంటాయి..పైగా కనులకు నచ్చే రంగులో ఉంటాయి. అందుకే ప్రేమికులు వీటిని ఇచ్చిపుచ్చుకోవడానికి ఇష్టపడుతుంటారు. టెడ్డీ ల పై ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అనే కొటేషన్లు అందంగా చిత్రీకరించి బహుమతిగా ఇస్తూ ఉంటారు. ప్రేమికులు కాలానుక్రమంలో వీటిని బహుమతులుగా కాకుండా తమ ప్రేమకు ప్రతిరూపాలుగా ఇచ్చిపుచ్చుకుంటుండడంతో
    టెడ్డీలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టెడ్డీ డే రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో వ్యాపారం జరుగుతుంటుంది.

    వాలంటైన్ వీక్ సందర్భంగా నిర్వహించే టెడ్డీ డే ప్రేమికులకు చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే ఈరోజు వారు ఒకరికి ఒకరు టెడ్డీ లను ఇచ్చిపుచ్చుకుంటారు. వాటి పైన అందమైన కొటేషన్లు రాస్తూ ఉంటారు.. ఇలా కొటేషన్లు రాసి తమ ప్రేమించే వారిని మరింత సంతోషపెడుతుంటారు. ” టెడ్డీ బేర్ అనేది హృదయానికి సంబంధించింది. సంతోషాన్ని, ఓదార్పును ఇస్తుంది.. ఇది కాలాతీత బహుమతి. టెడ్డీ అనేది చాలా మృదువైనది. ప్రేమ కూడా అలాంటిదే. అది ఎప్పటికీ మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది..టెడ్డీ డే రోజు బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటాం.. వాటిని మనం ఎలాగైతే ఆదరిస్తున్నామో.. మన ప్రియమైన వారితో అలాంటి క్షణాలను ఆరాధిద్దాం” వంటి కొటేషన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక చాలామంది ప్రేమికులు తమ ప్రియమైన వారికి టెడ్డీ లు ఇస్తూ వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో టెడ్డీ డే అనే యాష్ ట్యాగ్ ముందు వరుసలో కొనసాగుతోంది.