https://oktelugu.com/

Valentine’s day special : ఆర్య లాగా వన్ సైడ్ లవర్ గా ఉండిపోకూడదు.. ప్రేమిస్తే చెప్పేయాలి

అందుకే ప్రేమను ప్రేమించాలి. ఆ ప్రేమించే వ్యక్తికి ప్రేమను అర్థం అయ్యే రీతిలో వివరించాలి. ఎందుకు ప్రేమించాలో కూడా చెప్పగలగాలి. అప్పుడే ఆ ప్రేమ వర్ధిల్లుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : February 8, 2024 / 08:44 PM IST
    Follow us on

    Valentine’s day special : ఎదుటి మనిషిని చూడగానే గుండె వేగం పెరిగినప్పుడు.. సిగ్గు అనేది ఆవరించినప్పుడు.. ఆ మనిషి మన పక్కన ఉంటే బాగుంటుంది అని మన మెదడు చెప్పినప్పుడు.. దానిని ప్రేమే అంటారు. ప్రేమంటే తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా ఒక మనిషిని అంగీకరించడం.. అలా అంగీకరించిన ప్రేమ ఎప్పటికీ నిలబడి ఉంటుంది. అలాంటి ప్రేమ బలపడాలి, నిలబడాలి అంటే కచ్చితంగా వ్యక్తం చేయాలి. “సంపాదించే అర్హత లేని వాడికి ఖర్చుపెట్టే అధికారం లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే అర్హత లేదు” అని నువ్వే నువ్వే సినిమాలో చంద్రమోహన్ అన్నట్టు.. ప్రేమిస్తే ఖచ్చితంగా చెప్పగలగాలి. చెబితేనే ప్రేమించాలి. లేకుంటే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ లాగా చివరిదాకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదంటే సినిమా కాబట్టి శుభం కార్డు పడుతుంది. నిజ జీవితంలో అలా జరగదు. జరగడానికి 99 శాతం కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే పోటీగా మరొక వ్యక్తి వచ్చి లేదా మరొక యువతి వచ్చి నాన్ ఉన్నయ్ కాదలిక్కిరేన్ అంటే పరిస్థితి మరో విధంగా ఉంటుంది.

    మరి కొద్ది రోజుల్లో వాలెంటైన్స్ డే.. నిన్న రోజ్ డే.. ఇవాళ ప్రపోస్ డే.. ఈ ప్రపోస్ డే వెనుక పెద్ద చరిత్ర ఉంది. 1477 లో ఆస్ట్రియన్ ఆర్చ్ డ్యూక్ మ్యాక్సి మిలియన్ మేరీ ఆఫ్ బుర్గుండికి అద్భుతమైన డైమండ్ రింగ్ తొడిగి తన ప్రేమను ప్రతిపాదించాడు. ఆనాటి నుంచి ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే గా జరుపుకుంటున్నారు. వాస్తవానికి ప్రతి ప్రేమలో గాఢత ఉంటుంది. గట్టి అనుబంధం ఉంటుంది. అలాంటివన్నీ జరగాలంటే ముందు మన ప్రేమను వ్యక్తికరించాలి. అలా వ్యక్తికరిస్తేనే ప్రేమనేది ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది. లేకుంటే అది అడవి కాంచిన వెన్నెలవుతుంది. ప్రేమ అనేది ఒక అనుభూతి. అలాంటి అనుభూతిని ఇద్దరు మనుషులు పొందాలి. అలా పొండాలి అంటే ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమను కచ్చితంగా వ్యక్తికరించాలి. అలా వ్యక్తికరిస్తేనే మన ప్రేమ ఎంత గొప్పదో ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. ప్రేమను వ్యక్తీకరిస్తేనే తదుపరి ప్రయాణం ప్రారంభమవుతుంది. అలా వ్యక్తిగరించని పక్షంలో జంటగా సాగించాల్సిన ప్రయాణం విఫల ప్రయోగంగా మిగులుతుంది.

    ఇలా చెప్పి చూడండి

    ప్రేమను వ్యక్తీకరించిన మాత్రానా ఎదుటి మనిషి అంగీకరిస్తారు అనుకోవడానికి లేదు. వెంటనే ఓకే చెప్పడానికి ప్రేమ అనేది వస్తువు కాదు. ముందుగానే చెప్పినట్టు ప్రేమ అనేది అనుభూతుల కలయిక. అలాంటి అనుభూతిని ఎదుటి వ్యక్తి కూడా పొందాలి అని అనుకూల అనుకునేలా చేయాలి అంటే మనం చెప్పే విధానం పైనే ఆధారపడి ఉంటుంది. ” నువ్వు లేని నా జీవితం అసంపూర్ణం. నేను నీతో అందమైన జ్ఞాపకాలను సృష్టించాలనుకుంటున్నాను. నువ్వు నా జీవిత భాగస్వామిగా ఉంటావా?”, “నా ప్రేమ నీతో శాశ్వతం. నా జీవిత మొత్తాన్ని నీతో గడపాలి అనుకుంటున్నాను. నా ప్రేమ ఎప్పటికీ నువ్వే”. “నా జీవితాన్ని విలువైనదిగా మార్చావు. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.. నిన్ను ప్రేమించడం నా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా మార్చింది”. ఇలాంటి మాటలు చెప్పి చూస్తే ఎదుటి వ్యక్తులు కచ్చితంగా మీ ప్రేమను ఆమోదిస్తారు అని చెబుతున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అందుకే ప్రేమను ప్రేమించాలి. ఆ ప్రేమించే వ్యక్తికి ప్రేమను అర్థం అయ్యే రీతిలో వివరించాలి. ఎందుకు ప్రేమించాలో కూడా చెప్పగలగాలి. అప్పుడే ఆ ప్రేమ వర్ధిల్లుతుంది.