https://oktelugu.com/

Valentine’s day : మీ మనసైన వారిని ఈ పవర్ బ్యాంక్ లతో ఇలా ఆకట్టుకోండి

ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన వారికి వాలెంటైన్స్ డే రోజు ఈ పవర్ బ్యాంకులు బహుమతిగా ఇచ్చి వారి స్మార్ట్ ఉపకరణాలను మరింత వేగంగా ఛార్జ్ చేయండి.

Written By:
  • NARESH
  • , Updated On : February 7, 2024 / 09:54 PM IST
    Follow us on

    Valentine’s day : ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమను వ్యక్త పరచడం మాత్రమే కాదు.. బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం కూడా.. అందుకే ఫిబ్రవరి 14న ప్రేమికులు తమ మనసైన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తడానికి బహుమతులు ఇస్తారు. వెనుకటి రోజులంటే గ్రీటింగ్ కార్డులు, ఇంకా ఏవేవో బహుమతులు ఇచ్చేవారు.. ఇప్పుడు స్మార్ట్ కాలం. అరచేతిలో ప్రపంచం ఇమిడిపోతున్న కాలం. పైగా ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరిగా మారిన కాలం. “అందుకే ఈసారి వాలెంటెన్స్ డే కి కొత్తగా ఆలోచించండి. మీ ప్రేమికుల కోసం మరింత స్మార్ట్ గా ఆలోచించండి. వారు వాడే స్మార్ట్ ఉపకరణాలను చార్జర్ లను కరెంట్ సాకెట్ లకు ఎప్పటికీ వేలాడదీయకుండా.. మా ఉత్పత్తులతో సరికొత్తగా చార్జ్ చేయండి అంటున్నాయి స్మార్ట్ కంపెనీలు. ఇంతకీ ఈ వాలెంటెన్స్ డే రోజు పవర్ బ్యాంక్ లపై కంపెనీలు ఎటువంటి ఆఫర్లు ప్రకటిస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

    ప్రేమికుల దినోత్సవం సందర్భంగా Mi కంపెనీ సరికొత్త పవర్ బ్యాంక్ ను ఆవిష్కరించింది. 3i 20000 mAh లిథియం పాలిమర్ 18W ఫాస్ట్ పవర్ డెలివరీ చార్జింగ్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ఇన్ పుట్ C రకం, మైక్రో USB ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. పైగా ఇది ట్రిపుల్ అవుట్ పుట్. MI కంపెనీ దీనిపై 15% తగ్గింపు ఇస్తోంది. వాస్తవ ధర ₹ 2199 కాగా, ₹1849 కి ఇస్తోంది.
    దీని కెపాసిటీ: 20000mAh
    చార్జింగ్ టెక్నాలజీ: 22.5W సూపర్ ఫాస్ట్ చార్జింగ్.
    అవుట్ పుట్ పోర్ట్ లు: డ్యూయల్ టైప్ c పవర్ డెలివరీ+ 1 USB
    చార్జింగ్ స్పీడ్: టూ_ వే ఫాస్ట్ చార్జ్
    కాంఫాక్ట్ సైజు: పాకెట్_ సైజ్ డిజైన్.
    దీని పాస్ట్ చార్జింగ్ సామర్ధ్యాలు కొంతమందికి నచ్చవచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు.
    దీని రేటింగ్ 4.2

    URBAN 20000mAh..

    ఇది పూర్తిగా ప్రీమియం బ్లాక్ ఎడిషన్.. నానో పవర్ బ్యాంక్ గా పనిచేస్తుంది.. దీని పరిమాణం ప్యాకెట్ రూపంలో ఉంటుంది. 22.5 W సామర్థ్యంతో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనుభూతి అందిస్తుంది. మీ ప్రియమైన వారు వాడే స్మార్ట్ పరికరాలు రోజు మొత్తం పవర్ లో ఉండేలా చేస్తుంది. డ్యూయల్ టైప్ C పవర్ డెలివరీ, అవుట్ పుట్, త్వరిత చార్జ్ కోసం USB అవుట్ పుట్ తో, ఇది ఎకకాలంలో చార్జింగ్ చేయగలుగుతుంది. దీని టూ_ వే ఫాస్ట్ చార్జి ఫీచర్ స్మార్ట్ పరికరాలను వేగంగా చార్జ్ చేయగలుగుతుంది. ప్రేమికుల దినోత్సవ సందర్భంగా ఈ కంపెనీ 50% రాయితీపై ఈ పవర్ బ్యాంక్ ను విక్రయిస్తోంది. దీని వాస్తవ ధర 4,999 కాగా, 2499 కి విక్రయిస్తోంది.
    లక్షణాలు: 22.5W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.
    అవుట్ పుట్ పోర్ట్ లు: డ్యూయల్ టైప్ C పవర్ డెలివరీ+ 1 USB
    చార్జింగ్ స్పీడ్: టూ వే ఫాస్ట్ చార్జ్
    కాంపాక్ట్ సైజ్: పాకెట్ సైజ్ డిజైన్.
    ఇది బహుళ పరికరాలకు త్వరితగతిన, సమర్థవంతమైన ఛార్జింగ్ అందిస్తుంది. ఇది కేవలం పురంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది పరికరాలకు ఏకకాలంలో చార్జింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. పాకెట్ సైజు డిజైన్ లో ఉండటంతో దేవుని ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది.

    ఆంబ్రేన్ 20000mAh

    ఇది 20W సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.. ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిబుల్ అవుట్ పుట్, పవర్ డెలివరీతో ఇది బహుళ పరికరాల కోసం వేగవంతమైన, సౌకర్యమైన చార్జింగ్ అందిస్తుంది..ఇది C టైప్ ఇన్ పుట్ ను కలిగి ఉంటుంది. Li_polimer తో ఈ బ్యాటరీ తయారు చేశారు.
    కెపాసిటీ: 20000 mAh
    ఫాస్ట్ ఛార్జింగ్: 20W
    అవుట్ పుట్ లు: ట్రిబుల్
    ఇన్ పుట్: టైప్ సీ
    రక్షణ: మల్టీ లేయర్
    ఇది మేడిన్ ఇండియా గా రూపొందింది. దీని వాస్తవ ధర 2,499.. వాలెంటైన్స్ డే రోజు ప్రత్యేక తగ్గింపుతో 1,699కి అందిస్తుంది.

    Redmi 20000 mAh Li_పాలిమర్ పవర్ బ్యాంకు

    ఈ పవర్ బ్యాంకు పై 32 శాతం తగ్గింపు లభిస్తుంది. దీనికి 4.2 రేటింగ్ లభిస్తోంది. దీని వాస్తవ ధర 2999 రూపాయలు కాగా.. 2039 రూపాయలకి అందిస్తోంది. USB టైప్ C, మైక్రో USB పోర్ట్ లు, 18W ఫాస్ట్ ఛార్జింగ్, తక్కువ పవర్ మోడ్, బహుముఖ, సమర్థవంతమైన చార్జింగ్ అందిస్తుంది. నలుపు రంగులో ఇది లభ్యమవుతుంది. దీనిని తీసుకెళ్లడం కూడా సులభమే.
    కెపాసిటీ: 20000 mAh
    పోర్ట్ లు: USB టైప్ C, మైక్రో USB
    ఫాస్ట్ ఛార్జింగ్: 18 W
    తక్కువ పవర్ మోడ్ ఉపయోగిస్తుంది.
    ఇవి మాత్రమే కాక pTron dynamo క్లాసిక్, FLIX( బీ టెల్), Redmi 20000mAh, పోర్ట్రోనిక్స్ పవర్ D20k వంటి కంపెనీలు కూడా పవర్ బ్యాంకులపై మెరుగైన ఆఫర్లు ప్రకటించాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన వారికి వాలెంటైన్స్ డే రోజు ఈ పవర్ బ్యాంకులు బహుమతిగా ఇచ్చి వారి స్మార్ట్ ఉపకరణాలను మరింత వేగంగా ఛార్జ్ చేయండి.