https://oktelugu.com/

Valentine`s Day 2024 : టాలీవుడ్ లవబుల్ కపుల్ మహేష్ -నమ్రత లవ్ స్టోరీలో ఊహించని మలుపులివీ..?

రాజమౌళి ఆర్ అండ్ ఆర్ తరువాత మహేష్ తో వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : February 14, 2024 / 09:11 PM IST
    Follow us on

    Valentine`s Day 2024 : ప్రపంచం అంతా ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుగా ఘనంగా నిర్వహించుకుంటారన్న సంగతి తెలిసిందే.. భారత్ లోనూ చాలా వరకు వాలైంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేమించి వివాహ బంధంతో ఒక్కటైన జంట గురించి చూద్దాం.. టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అనగానే మొదటగా గుర్తుకు వచ్చే జంట ప్రిన్స్ మహేష్ బాబు- నమ్రత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు నటి నమ్రతా శిరోద్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

    మహేశ్ -నమ్రత కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘వంశీ’. బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన వంశీ చిత్ర బృందం అవుట్ డోర్ షూటింగ్ కోసం న్యూజిలాండ్ కు వెళ్లారు. అక్కడే నెల రోజుల పాటు సినిమా షూటింగ్ కొనసాగింది. ఈ సమయంలోనే మహేష్ బాబు, నమ్రత మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. చిత్రీకరణ పూర్తై తిరిగి వచ్చిన తరువాత ముందుగా నమ్రతనే తన ప్రేమను మహేష్ బాబుకు వ్యక్తపరిచారట. ఈ క్రమంలోనే మహేశ్ బాబు కూడా ఓకే అనడంతో వీరి ప్రేమ పెళ్లికి దారితీసిందని తెలుస్తోంది.

    అయితే మహేశ్ బాబు – నమ్రతల వివాహానికి తొలుత మహేశ్ కుటుంబ అంగీకారం చెప్పలేదట. అనేక ట్విస్టులతో సినిమాల్లో జరిగిన విధంగానే వీరి ప్రేమ పెళ్లి జరిగిందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మహేశ్ తన సోదరి మంజుల సాయం తీసుకున్నారట. ఆమెతో పాటు దర్శకుడు జయంత్ కూడా సాయం చేశారని తెలుస్తోంది.

    ఈ క్రమంలోనే కొన్ని ట్విస్టుల అనంతరం ఫిబ్రవరి 10వ తేదీ 2005 లో నమ్రత, మహేశ్ బాబు ప్రేమ పెళ్లిగా మారింది. అయితే ఈ పెళ్లి రహస్యంగా అంటే అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. లవబుల్ కపుల్ గా ప్రేక్షకులు, అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న మహేశ్, నమ్రతకు గౌతమ్, సితార సంతానం. నమ్రత హౌస్ వైఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా మహేశ్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

    మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరీలు హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం మహేశ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నారు. రాజమౌళి ఆర్ అండ్ ఆర్ తరువాత మహేష్ తో వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.