https://oktelugu.com/

Adikeshava Movie Trailer : ఆదికేశవ ట్రైలర్ టాక్ : ప్రేమ అయినా.. పగ అయినా వైష్ణవ్ తో పెట్టుకోవద్దట!

ఆదికేశవ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2023 / 07:12 PM IST
    Follow us on

    Adikeshava Movie Trailer : ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ గత రెండు చిత్రాలు కొండపొలం, రంగ రంగ వైభవంగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. రూటు మార్చిన ఈ మెగా హీరో ఈసారి ఊరమాస్ యాక్షన్ డ్రామా ఎంచుకున్నాడు. ఆదికేశవ చిత్రంతో కమర్షియల్ మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆదికేశవ విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ దుమ్మురేపింది.

    లవ్, రొమాన్స్, యాక్షన్, సస్పెన్సు, ఎమోషన్స్ కలగలిపి ట్రైలర్ ఆకట్టుకుంది. బాలుగా హీరోయిన్ శ్రీలీలతో వైష్ణవ్ రొమాన్స్, కెమిస్ట్రీ అదిరాయి. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం శ్రీలీల, వైష్ణవ్ తేజ్ లవ్ ట్రాక్ తో నడిపించేశారనిపిస్తుంది. బాలు పనీ పాట లేకుండా జాలీగా తిరిగేసే కుర్రాడు. ఆదికేశవ మాత్రం సో డేంజరస్. వైష్ణవ్ తేజ్ క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉన్నాయి. మాస్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైలర్ లో హైలెట్ అని చెప్పాలి. బాలు… ఆదికేశవ ఎలా అయ్యాడనేది ట్విస్ట్.

    ఫైట్స్ కూడా భారీగా చిత్రీకరించారని తెలుస్తుంది. ఇక శ్రీలీల సూపర్ క్యూట్ గా ఉంది. ఆమె సొంతగా డబ్బింగ్ చెప్పుకుంది. మొహమాటం లేకుండా రొమాన్స్ కురిపించింది. సీనియర్ నటి రాధిక కీలక రోల్ చేశారు. సినిమాలో ఫ్యాక్షన్ షేడ్స్ కనిపిస్తున్నాయి. మరి ఇది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమానా అనేది తెలియాలి. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంది. వైష్ణవ్ గత చిత్రాలు భిన్నంగా ఆదికేశవ ట్రై చేస్తున్నాడు.

    ఆదికేశవ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ఆయన బీజీఎం ఆకట్టుకుంది. ఉన్నత నిర్మాణ విలువలతో విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. ఆదికేశవ మూవీ సెప్టెంబర్ 24న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఆదికేశవ మంచి విషయం సాధిస్తుందని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు.