వాట్సాప్ అప్డేట్ చేసుకోండి.. సరికొత్త ఫీచర్ వచ్చేసింది..!

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీఒక్కరు వాట్సాప్ వాడటం కామన్ అయిపోయింది. మెసేజులు.. ఫొటోలు.. వీడియోలు పంపించుకోవడం వాట్సాప్ లో చాలా ఈజీ కావడంతో ప్రతీఒక్కరికీ దీనికి అలవాటుపడిపోయారు. అయితే కొన్నిసార్లు అనవరమైన సందేహాలు వాట్సాప్ లో వస్తూ చికాకు తెప్పిస్తుంటాయి. Also Read: యూజర్లకు జియో శుభవార్త… అదిరిపోయే ఫీచర్లతో జియో బ్రౌజర్..? అలాంటి వాటికి చెక్ పెట్టేలా వాట్సాప్ సరికొత్త ఫీచర్ తో ముందుకొచ్చింది. నేటి నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ సంస్థ […]

Written By: NARESH, Updated On : October 23, 2020 4:39 pm
Follow us on

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీఒక్కరు వాట్సాప్ వాడటం కామన్ అయిపోయింది. మెసేజులు.. ఫొటోలు.. వీడియోలు పంపించుకోవడం వాట్సాప్ లో చాలా ఈజీ కావడంతో ప్రతీఒక్కరికీ దీనికి అలవాటుపడిపోయారు. అయితే కొన్నిసార్లు అనవరమైన సందేహాలు వాట్సాప్ లో వస్తూ చికాకు తెప్పిస్తుంటాయి.

Also Read: యూజర్లకు జియో శుభవార్త… అదిరిపోయే ఫీచర్లతో జియో బ్రౌజర్..?

అలాంటి వాటికి చెక్ పెట్టేలా వాట్సాప్ సరికొత్త ఫీచర్ తో ముందుకొచ్చింది. నేటి నుంచి ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రత్యేకత ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ద్వారా అనవసమైన గ్రూపుల్లోని సందేశాలకు శాశ్వతంగా మ్యూట్ చేయచ్చు. మనం అన్ మ్యూట్ చేసేవరకు సదరు గ్రూపుల నుంచి మనకు ఎలాంటి సందేశాలు రావు. ఈ ఫీచర్ సదుపాయం వాట్సాప్ వెబ్ లోనూ అందుబాటులో ఉందని
వాట్సాఫ్ సంస్థ వెల్లడించింది.

Also Read: ‘కాళరాత్రి అమ్మవారు’గా ఏడవ రోజు దర్శనం..!

ఈ సదుపాయం వాట్సాప్ లో ఇప్పటివరకు కేవలం 8గంటలు.. ఒక వారం.. ఒక ఏడాది మ్యూట్ ఆప్షన్ మాత్రమే ఉండేది. అయితే తాజాగా ఒక ఏడాది మ్యూట్ అప్షన్ స్థానం ఆల్వేస్ అనే అప్షన్ ను వాట్సాప్ గ్రూప్ తీసుకొచ్చింది. కొన్నినెలల క్రితమే ఈ సదుపాయాన్ని వినియోగదారుల కోసం తీసుకొస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది.

తాజాగా నేటి నుంచి ఈ ఫీచర్ అమల్లోకి రానుంది. ఇంకేందుకు ఆలస్యం గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి మీ వాట్సాప్ ను అప్డేట్ చేసుకొని చికాకు సందేశాలకు శాశ్వతంగా చెక్ పెట్టేయండి..!