https://oktelugu.com/

Undavalli Sridevi : బాలయ్యనే భయపెట్టిన ఉండవల్లి శ్రీదేవి.. ఏం వీడియోరా బాబూ!

తాజాగా నిన్న మాట్లాడిన ఉండవల్లి శ్రీదేవిపై ఈసారి బాలయ్య బాబు పూనినట్టు ఉన్నాడు. బాలయ్య లాగానే వీరావేశంతో ఆమె ఊగిపోయారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2023 / 10:45 AM IST
    Follow us on

    Undavalli Sridevi : ‘తేట తెలుగు.. తేనే లొలుకు’ అంటారు. కానీ మన లోకేషంతోపాటు ఇటీవలే వైసీపీ నుంచి బయటకొచ్చి టీడీపీ చేరిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా తెలుగును కూనీ చేస్తున్నారు. చంద్రబాబును పొగడడం కోసం వాడే పదజాలంతో నవ్వులు పూయిస్తున్నారు.

    చంద్రబాబుకు మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారు ఈ ఎమ్మెల్యే శ్రీదేవి.. ఆమెను గెలిపించిన జగన్ కే ఝలక్ ఇచ్చారు. టీడీపీ పంచన చేరారు.. జగన్ పాదయాత్ర ఫలితంతో వైసీపీ గాలిలో గెలిచిన తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశాక చంద్రబాబు జపం చేస్తున్నారు.. వైసీపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు..

    చంద్రబాబు ఎప్పుడు తన నియోజకవర్గానికి వచ్చినా.. లోకేష్ వచ్చినా తనకు రాని తెలుగు భాషలో వారిని పొగుడుతుంటుంది. ఈ క్రమంలోనే అర్థం పర్థం లేకుండా ఠంగ్ స్లిప్ అవుతోంది. ఇప్పటికే నారా లోకేష్ తాడికొండకు పాదయాత్రగా వచ్చినప్పుడు ఆయనను పొగుడుతూ ఉండవల్లి శ్రీదేవి ఇచ్చిన ఎలివేషన్లకు సోషల్ మీడియాలో జోకులు పేలాయి. లోకేష్ ను బాలయ్య డైలాగులతో పోల్చి మరీ శ్రీదేవి బుక్కయ్యారు. నెటిజన్లు పండుగ చేసుకున్నారు.

    తాజాగా నిన్న మాట్లాడిన ఉండవల్లి శ్రీదేవిపై ఈసారి బాలయ్య బాబు పూనినట్టు ఉన్నాడు. బాలయ్య లాగానే వీరావేశంతో ఆమె ఊగిపోయారు. ‘నా దళిత సోదరులు.. సోదరీమణులు.. వారికి మేం ఉన్నామని నిలుచున్న మీకందరినీ టేక్ ఏ బౌ.. వైసీపీ నాయకులకు ఐటెమ్ కెన్ యే బ్రో.. దండయాత్ర స్ట్రాట్ అయ్యింది.. అది నాతోనే మొదలైంది’ అంటూ అర్థం కాని తెలుగులో భాషను కూనీ అర్థం కాకుండా ఊగిపోయింది. అచ్చం మన బాలయ్య బాబు ఎలా అర్థం కాకుండా గజిబిజీగా గందరగోళంగా మాట్లాడుతాడో అలానే మాట్లాడేసింది..