UK PM Liz Truss’ Cabinet యూకే ప్రధాని లిజ్ ట్రస్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది. ప్రవాస భారతీయుడైన రిషి సునక్ పై గెలిచిన లిజ్ ట్రస్ బ్రిటీషర్లకే తొలి ప్రాధాన్యమంటూ ఇతర దేశానికి చెందిన రిషి సునక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆమె మద్దతు దారులు కూడా నల్లజాతీయుడైన మన రిషిపై ఇదే ప్రచారం చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు తన కేబినెట్ లో బ్రిటీష్ మేధావులు ఎవరూ లేనంటూ నల్లజాతీయులకే కీలకమైన నాలుగు ముఖ్యమైన శాఖలు కేటాయించారు.

యూకే ప్రధాని లిజ్ ట్రస్ కేబినెట్ లోని 4 అత్యంత సీనియర్ పోస్టులను శ్వేతజాతీయులు కానివారికే కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
యూకే పీఎం లిజ్ ట్రస్ కేబినెట్ మొదటిసారిగా దేశంలోని నాలుగు ముఖ్యమైన మంత్రి పదవుల్లో ఒక శ్వేతజాతీయుడు కూడా లేకపోవడం చర్చనీయాంశమైంది. ట్రస్ తాజాగా బ్రిటన్ కేబినెట్ లోని కీలకమైన పదవుల పంపకం చేపట్టారు. ఇందులో ‘క్వాసీ క్వార్టెంగ్’ను బ్రిటన్ మొదటి నల్లజాతి ఆర్థిక మంత్రిగా నియమించారు. జేమ్స్ క్లీవర్లీ దేశపు మొదటి నల్లజాతి విదేశాంగ మంత్రిగా నియామకం అయ్యారు.. కాగా, మరో నల్లజాతీయురాలు, భారత మూలాలున్న సుయెల్లా బ్రేవర్‌మన్ అంతర్గత మంత్రిగా, థెరిస్ కాఫీ ఆరోగ్య మంత్రిగా నియమితులయ్యారు. ఈ నలుగురు బ్రిటీషర్లు కాదు.. ఇతర నల్లజాతీయులే.
క్వాసీ క్వార్టెంగ్ 1960లలో ఘనా నుండి వచ్చారు. ఇతడే బ్రిటన్ మొదటి నల్లజాతి ఆర్థిక మంత్రిగా నియామకం అయ్యాడు. అలాగే బ్రిటీష్ యేతరుడు, జేమ్స్ క్లీవర్లీ మొదటి నల్లజాతి విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. ఇతడి తల్లి సియెర్రా లియోన్‌కు చెందినది. అతని తండ్రి శ్వేతజాతీయుడు. గతంలో ఒక మిశ్రమ-జాతి పిల్లవాడిగా ఇతడు వేధింపులకు గురిఅయ్యాడు. నల్లజాతి ఓటర్లను ఆకర్షించడానికి పార్టీ మరింత చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఆరు దశాబ్దాల క్రితం కెన్యా – మారిషస్‌ల నుండి బ్రిటన్‌కు వచ్చిన సుయెల్లా బ్రేవర్‌మాన్ హోమ్ సెక్రటరీ లేదా అంతర్గత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడ ఆమె పోలీసు మరియు ఇమ్మిగ్రేషన్‌కు బాధ్యత నిర్వహిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో పార్లమెంటుకు.. వైవిధ్యమైన అభ్యర్థులను ముందుకు తెచ్చేందుకు కన్జర్వేటివ్ పార్టీ కృషిచేస్తోంది. అందుకే కేబినెట్ లో వైవిధ్యం పెరుగుతోంది.
బ్రిటీష్ ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎక్కువగా శ్వేతజాతీయులతో నిండిపోయాయి. పాల్ బోటెంగ్ ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఇతడే బ్రిటన్ మొదటి నల్లజాతి మైనారిటీ క్యాబినెట్ మంత్రి. ఒక నల్లజాతీయుడు బ్రిటన్ మంత్రి కావడానికి ఏకంగా 2002 సంవత్సరం వరకు పట్టింది.
అయితే, వ్యాపారం, న్యాయవ్యవస్థ, సివిల్ సర్వీస్ మరియు సైన్యంలోని ఉన్నత ర్యాంక్‌లు ఇప్పటికీ తెల్లజాతీయుల చేతుల్లో ఉన్నాయి.. పార్టీ వైవిధ్యంగా వెళ్లినప్పటికీ పార్లమెంటులోని కన్జర్వేటివ్ సభ్యులలో నాలుగింట ఒకవంతు మాత్రమే మహిళలున్నారు. 6% మంది మైనారిటీ నేపథ్యాల నుండి ఉన్నారు. అత్యున్నత పదవుల్లో బ్రిటీషర్లు కాని వారిని నియమించిన ట్రస్ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.
[…] […]