https://oktelugu.com/

M.Phil : ఎంఫిల్ డిగ్రీ కిందకు రాదా? విద్యార్థులకు యూజీసీ కీలక సూచన

యూజీసీ రెగ్యులేషన్ నంబర్ 14 ప్రకారం.. ఉన్నత విద్యాసంస్థులు ఏవీ కూడా ఎంఫిల్ ను అందించకూడదని అధికారికంగా యూజీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకే 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంఫిల్ అడ్మిషన్లను నిలిపివేయాలని యూనివర్సిటీ అధికారులను ఆదేశించింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2023 / 09:36 PM IST
    Follow us on

    M.Phil : డిగ్రీ కాగానే.. పీజీ చేస్తాం.. ఆ తర్వాత కూడా కొందరు విద్యార్థులు.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఖాళీగా ఉండలేక ఎంఫిల్ , పీహెచ్.డీలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఎంఫిల్ చేయాలంటే విద్యార్థులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.. ఎందుకంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది.

    ఎంఫిల్ డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేదని సంచలన ప్రకటన చేసింది. విద్యార్థులు ఈ ఎంఫిల్ లో చేరవద్దంటూ హెచ్చరించింది. అంతేకాకుండా 2023-23 విద్యాసంవత్సరంలో అసలు ఎంఫిల్ అడ్మిషన్లు నిలిపివేయాలంటూ అన్ని యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశించింది.

    ఇటీవల దేశంలోని కొన్ని యూనివర్సిటీలు ఎంఫిల్( మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) ప్రోగ్రాం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు యూజీసీ దృష్టికి వచ్చింది. దీంతో అసలు ఎంఫిల్ కు డిగ్రీ గుర్తింపు లేదన్న అసలు నిజాన్ని యూజీసీ బయటపెట్టింది.

    2023లో విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) నివేదిక గత ఐదేళ్లలో ఎంఫిల్ ప్రోగ్రామ్‌ల కోసం మైనస్ 21.1 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR)ని వెల్లడించింది. ఇది 2016-17లో 43,267 నుండి 2020-21లో 16,744కి పడిపోయింది, దాదాపు 61.3 శాతం క్షీణతను సూచిస్తుంది.

    ముఖ్యంగా ఎంఫిల్ , సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లు ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం ఎన్‌రోల్‌మెంట్‌లలో బాగా క్షీణించాయి. AISHE నివేదికలో 1,084 విశ్వవిద్యాలయాలు, 40,176 కళాశాలలు , 8,696 స్వతంత్ర సంస్థల నుండి ఈ కోర్సుకు అసలు స్పందన లేదని తెలిపింది.

    తమిళనాడులోని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు 2022-23 విద్యా సంవత్సరంలో ఎంఫిల్ ను నడిపించడంలో పట్టుదలతో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.
    రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ నుండి నిర్దిష్ట ఆదేశాలు లేనందున 2023-24 విద్యా సంవత్సరానికి ప్రోగ్రామ్‌ను పొడిగించకూడదని నిర్ణయించాయి.

    యూజీసీ రెగ్యులేషన్ నంబర్ 14 ప్రకారం.. ఉన్నత విద్యాసంస్థులు ఏవీ కూడా ఎంఫిల్ ను అందించకూడదని అధికారికంగా యూజీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకే 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంఫిల్ అడ్మిషన్లను నిలిపివేయాలని యూనివర్సిటీ అధికారులను ఆదేశించింది.