https://oktelugu.com/

Turtle meat : తాబేలు మాంసం మంచిది కాదా.. అది తింటే చనిపోతారా?

తాబేలు జలచర జీవి కాబట్టి.. చేపల లాగానే.. దానిని కూడా వేటాడి తింటారు. కాకపోతే తాబేలు పైన దృఢమైన నిర్మాణం ఉంటుంది.. దానిని పగలగొట్టి.. అందులో ఉన్న తాబేలును శుభ్రంగా కడిగి, ముక్కలుగా చేసి తింటారు. చేపల్లో అన్ని రకాల ను తినలేనట్టే.. తాబేళ్ళళ్ళోనూ అన్ని రకాల ను మనం తినలేం. అలా తింటే శరీరం తీవ్రంగా ప్రభావితమవుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 11, 2024 10:56 pm
    Turtle meat

    Turtle meat

    Follow us on

    Turtle meat : జింక గడ్డి తింటుంది. గడ్డి తిన్న జింకను పులి తింటుంది. కానీ మనిషి మాత్రం అటు శాకాహారాన్ని, ఇటు మాంసాహారాన్ని ఏకకాలంలో లాగిస్తాడు. బహుశా భూమి మీద వైవిధ్యమైన జంతువు ఎవరంటే అది కేవలం మనిషి మాత్రమే కావచ్చు. ఇక మనుషుల్లో రకాలను బట్టి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఒక దేశంలో ఉన్న రాష్ట్రాలలోనే భిన్నమైన ఆహార పద్ధతులున్నాయి. ఉదాహరణకు మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో కుక్కలను తింటారు.. అదే సమయంలో వారు గొర్రెలను సొంతమనుషుల కంటే ఎక్కువగా చూసుకుంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో కుక్కలను సొంత మనుషుల్లాగా చూసుకుంటే.. గొర్రెలను కోసుకొని తింటారు. సేమ్ ఇలానే తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో సముద్ర తాబేలు మాంసం ఇష్టంగా తింటారు. సాధారణంగా మన దేశంలో తాబేలు మాంసాన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు లొట్టలేసుకుని తింటారు. తీర ప్రాంతంలో మాత్రం తాబేళ్ళ వేటపై నిషేధం ఉన్న నేపథ్యంలో.. వాటిని తినేందుకు సాహసించరు. ఒకవేళ వాటిని వేటాడినా మళ్లీ సముద్రంలోనే వదిలేస్తారు.

    తాబేలు జలచర జీవి కాబట్టి.. చేపల లాగానే.. దానిని కూడా వేటాడి తింటారు. కాకపోతే తాబేలు పైన దృఢమైన నిర్మాణం ఉంటుంది.. దానిని పగలగొట్టి.. అందులో ఉన్న తాబేలును శుభ్రంగా కడిగి, ముక్కలుగా చేసి తింటారు. చేపల్లో అన్ని రకాల ను తినలేనట్టే.. తాబేళ్ళళ్ళోనూ అన్ని రకాల ను మనం తినలేం. అలా తింటే శరీరం తీవ్రంగా ప్రభావితమవుతుంది. కొన్ని కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. ఎందుకంటే కొన్ని రకాలైన తాబేళ్ళ మాంసంలో కిలోనిటాక్సిజం అనే రసాయనం ఉంటుంది. అది కెమికల్ ఫుడ్ పాయిజనింగ్ కు దారి తీస్తుంది. అది తిన్న మనుషులు వెంటనే చనిపోతారు. అలాంటి కెమికల్ సముద్రపు తాబేళ్ళళ్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సముద్రపు నీరు ఉప్పుగా ఉండటం.. రకరకాల జలచరాలు అందులో జీవించటం.. ఆ నీరు రకరకాల మార్పులకు గురై తాబేలు శరీరంలో కిలోనిటాక్సిజానికి దారితీస్తుంది..

    ఇటీవల టాంజానియాలోని జాంజిబార్ సముద్ర దీవుల్లో కొంతమంది ప్రజలు తాబేళ్లను వేటాడారు. వాటి మాంసాన్ని ఇష్టంగా తిన్నారు. ఆ తాబేళ్లలో కిలో నిటాక్సిజం ఉందట. అది తిన్న మనుషుల్లో కెమికల్ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దీంతో 9 మంది మరణించారు. మరో 78 మంది ఆసుపత్రి పాలయ్యారు. జాంజి బార్ సముద్ర దీవుల్లో లభించే తాబేళ్ళు చాలా బాగుంటాయని, వాటి మాంసం రుచికరంగా ఉంటుందని టాంజానియా వాసుల నమ్మకం. అందుకే ఆ తాబేళ్లను వేటాడి.. వాటి మాంసాన్ని వండుకొని తింటారు. అయితే గతంలో ఎటువంటి మరణాలు చోటు చేసుకోలేదు. కానీ ఇటీవల ఆ తాబేళ్ళ మాంసాన్ని తిని 9 మంది మరణించడంతో విషాదం నెలకొంది. అయితే ఇకపై సముద్ర జలాల్లో తాబేళ్ళ వేటకు వెళ్ళబోమని అక్కడి ప్రజలు తీర్మానించుకున్నారు.