TS Weather Report : తెలంగాణను ముసుపు పట్టేసింది. ఆంధ్రాలోనూ వానలు జోరుగా కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. ఎన్.డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేస్తోంది. రానున్న 5 రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని తెలంగాణ సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
మరో 48 గంటలు వర్షాలు.. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం సీఎస్ శాంతికుమారి. తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అన్ని శాఖల అధికారులతోపాటు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
తెలంగాణలో అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఎన్.డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది.వరంగల్, ములుగు, కొత్తగూడెంలో ఈ బృందాలను ఉంచినట్లు ప్రకటించింది.హైదరాబాద్ లో 40 మంది సిబ్బందితో బృందాన్ని ఉంచారు.
హైదరాబాద్ లో భారీ వర్షాలకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు మునుగుతాయి కనుక నగరంలోనూ 426 ఎమర్జెన్సీ బృందాలు సిద్ధం చేశారు. 157 స్టాటిక్ టీంలను రెడీ చేశారు. నీటి నిల్వ ఉండే 339 ప్రాంతాల వద్ద ప్రత్యేక సిబ్బందిని మోహరించామని.. ఇప్పటివరకూ చెరువులు, కుంటలకు ఎలాంటి జరుగలేదని పేర్కొన్నారు.