Munugodu Winner : మనుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దాదాపు 10వేల ఓట్ల మెజార్టీపైగా ఓట్లతో గెలుపొందారు. గత ఎన్నికల వరకూ తెలంగాణ రాజకీయాలు కేవలం కాంగ్రెస్ -తెరాస పార్టీల మధ్యనే జరిగాయి..కానీ ఈమధ్య కాలంలో బీజేపీ అనూహ్యంగా సీన్ లోకి వచ్చి టీఆర్ఎస్ కి తిరుగులేని పోటీనిచ్చింది. ఇరు పార్టీలు కూడా డబ్బులు చాలా గట్టిగానే పంచాయి.. ఇక ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా టీఆర్ఎస్ కు అనూకూలంగా వచ్చాయి.. ఇప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా నిజం అవుతున్నాయి.. సుమారు పది వేల ఓట్లకు పైగా మెజారిటీ తో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందాడు.

2014 ఎన్నికలలో టీఆర్ఎస్ నుండి గెలుపొందిన ప్రభాకర్ రెడ్డి.. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో నాడు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో 22 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు…అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆగస్టు నెలలో బీజేపీ లో చేరాడు.
మనుగోడులో రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు ఉండడం..సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేసిన వాడు కావడంతో బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్ కి చాలా బలమైన పోటీని ఇచ్చింది.. ఓట్ కు నోటుగా మునుగోడులో టీఆర్ఎస్ పంచితే బీజేపీ కూడా ఎలా అయినా గెలవాలనే కసితో బాగానే డబ్బులు పంచారు.. అలా ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం అవ్వగా మొదటి 5 రౌండ్లు టీఆర్ఎస్ , బీజేపీ చెరో రెండు రౌండ్లలో విజయం సాధించాయి. ఇక ఆ తర్వాత రౌండ్స్ నుంచి తెరాస పార్టీ రౌండ్ రౌండ్ కి ఆధిక్యం పెంచుకుంటూ వెళ్ళింది.. చివరిగా 12 రౌండ్లు పూర్తి అయ్యేసరికి దాదాపుగా 8 వేల ఓట్ల మెజారిటీ టీఆర్ఎస్ కు వచ్చేసింది..పూర్తి రౌండ్స్ పూర్తి అయ్యేసరికి తెరాస పార్టీ కి 15 వేల మెజారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైనట్టే. బీజేపీ ఓటమి లాంఛనమైనట్టే..
ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్యెల్యేగా కొనసాగుతూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి పోటీచేశారు. ఈ కాంగ్రెస్ నుంచి పోటీచేసిన పాల్వాయి స్రవంతి ఏమాత్రం పోటీనివ్వలేదు. కాంగ్రెస్ పరిస్థితి ఈ ఎన్నికల్లో ఘోరంగా తయారైంది..ఈ పార్టీ నుండి పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి ఇప్పటి వరకు కేవలం 22 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి..కనీసం డిపాసిట్స్ కూడా దక్కికించుకోలేకపోవడం గమనార్హం