MS Dhoni Retirement : ఎంఎస్.ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ దేశంలో అతని క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది. చాలా మంది క్రికెటర్లు నిష్క్రమించిన తర్వాత పక్కన పెట్టడం మనం చూశాం. కానీ టీమిండియా ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ విషయంలో అలా కాదు. ఐపీఎల్ ద్వారా ధోనీ సెకండ్ ఇన్నింగ్ వీరలెవల్‌లో సాగుతోంది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ సాధించడం ద్వారా సారథిగా రికార్డు సృషించాడు. ఇక ధోనీ వయస్సు 41 సంవత్సరాలు. కానీ మైదానంలో అతని మెరుస్తున్న వేగం అతను ఇంకా 30 ఏళ్లలో ఉన్నాడని చెబుతుంది. సూపర్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అంతగా బ్యాటింగ్ చేయలేదు కానీ అతను ఫీల్డ్‌లోకి వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు విపరీతంగా చూస్తారు. తాజాగా ధోనీకి సబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ధోని వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కెప్టెన్సీ, స్టంపింగ్, సహచరులను ప్రోత్సహించడం, లీగ్, ప్లేఆఫ్ విన్నింగ్ మూమెంట్స్ వీడియోలను ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. లైక్‌లు.. షేర్‌ల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంతో తాజాగా ఈసారి ఐపీఎల్ కెప్టెన్ టైమ్ ట్రావెల్ చేస్తూ కనిపించిన క్లిప్ వైరల్‌గా మారింది. ఇందులో ధోనీ నెరిసిన గడ్డంతో స్టాండ్స్ నుండి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించాడు.
20240లోనూ ధోనీ కెప్టెన్..
కెప్టెన్ కూల్ తన 2040లో తన జట్టును ఎంకరేజ్ చేస్తూ.. స్టాండ్స్ నుంచి మ్యాచ్‌ను తిలకిస్తున్నట్లు పోస్టు చేశాడు. అప్పుడు గుజరాత్ టైటాన్స్‌తోనే ఫైలన్ తలపడినట్లు.. అప్పటికి జీటీ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఉన్నట్లు పేర్కొన్నాడు. ఫైనల్‌లో 11వ సారి చెన్నై సూపర్ కింగ్స్ టీం విజేతగా నిలుస్తుందని రాసుకొచ్చాడు.
కామెంటేటర్‌గా కోహ్లీ..
ఇక 2040 నాటికి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రిటైర్ అయి కామెంటేటర్‌గా ఉంటాడని తెలిపాడు. 2040 ఐపీఎల్ గెలిచిన తర్వాత కోహ్లీ కామెంటేటర్‌గా ఈ సిరీస్ మీ టాస్ట్ సిరీసా అని అప్పుడు కూడా అడుగుతాడని పేర్కొన్నాడు. మొత్తంగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ ఫొటోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తీరొక్క కామెంట్లు పెడుతున్నారు.