Trivikram Movies : శ్రీలీల విషయంలో కూడా తన పాత ఫార్ములా వాడనున్న త్రివిక్రమ్

ఇలా పెట్టిన ప్రతిసారి దానివల్ల సినిమాల్లో మంచి ఫన్ జెనరేట్ అయ్యింది. అందుకే మరలా ఇప్పుడు ఆ ఫార్మేట్ ని గుంటూరు కారంలో కూడా రిపీట్ చేయాలని ఉద్దేశం లో ఉన్నారట మన గురూజీ.

Written By: Swathi Chilukuri, Updated On : August 15, 2023 9:14 pm
Follow us on

Trivikram Movies : త్రివిక్రమ్ సినిమాలలో హీరోయిన్స్ కి ఎంతో కొంత ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది. అంతేకాదు దాదాపు ఒక సినిమాలో తీసుకున్న హీరోయిన్ ని మరో సినిమాలో కూడా తీసుకుంటూ ఉంటారు ఈ దర్శకుడు. నువ్వే నువ్వే లో శ్రియ అతడు లో త్రిష మినహాయిస్తే, మిగతా హీరోయిన్స్ ని ఒక సినిమాకు పైగానే తీసుకున్నారు ఈ డైరెక్టర్.

ఇక ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమా మహేష్ బాబుతో గుంటూరు కారం. అతడు, ఖలేజా లాంటి మంచి సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ రెట్టింపు చేస్తూ ఈ చిత్రంలో శ్రీ లీలా ని హీరోయిన్ గా ప్రకటించారు సినిమా యూనిట్. ముందుగా ఈ చిత్రంలో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ అని చెప్పినా ఆ తరువాత కొన్ని కారణాలవల్ల ఆమె తప్పుకొని, ఆమె ప్లేస్ లో శ్రీ లీలా వచ్చింది.

ఇదంతా బాగానే ఉన్నా శ్రీ లీలా విషయంలో కూడా త్రివిక్రమ్ తన ఓల్డ్ ఫార్ములా యూస్ చేస్తారా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామందికి వస్తున్న సందేహం. ఇంతకీ ఆ ఫార్ములా ఏమిటి అంటారా??త్రివిక్రమ్ తీసిన చాలా సినిమాల్లో హీరోయిన్లను ఏదో ఒక లోపంతో చూపించాడు. పవన్ కళ్యాణ్ జల్సా లో ఇలియానా కళ్ళ సైట్ ఉన్నట్టు చూపించగా, ఖలేజా లో అనుష్క ని ఐరన్ లెగ్ గా, సన్ అఫ్ సత్యమూర్తితో సమంతని షుగర్ పేషేంట్ గా, అఆ లో మళ్ళీ సమంత ని తెలివి తక్కువ అమ్మాయిలా చూపించాడు. ఇలా దాదాపు తన చిత్రాలలో హీరోయిన్ కి ఏదో ఒక లోపం పెట్టాడు ఈ డైరెక్టర్.

అంతేకాదు ఇలా పెట్టిన ప్రతిసారి దానివల్ల సినిమాల్లో మంచి ఫన్ జెనరేట్ అయ్యింది. అందుకే మరలా ఇప్పుడు ఆ ఫార్మేట్ ని గుంటూరు కారంలో కూడా రిపీట్ చేయాలని ఉద్దేశం లో ఉన్నారట మన గురూజీ. ఇక శ్రీ లీలని గుంటూరు కారంలో మతి మరుపు ఉన్న అమ్మాయిగా చూపిస్తున్నాడని అంటున్నారు నెటిజన్లు. మరి ఇది నిజమోకాదో సినిమా వస్తే గాని తెలియదు.

గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి మరో ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నాడు.